Home /News /andhra-pradesh /

ANANTAPURAM ANDHRA PRADESH POLITICAL NEWS BIG SHOCK TO TDP LEADER BANDARU SRAVANI NGS

Telugu Desam: ఆ మహిళా నేతను టీడీపీ పెద్దలు పక్కన పెడుతున్నారా? వర్గపోరులో పైచేయి ఎవరిది?

మహిళానేతకు అధిష్టానం షాక్ ఇస్తుందా?

మహిళానేతకు అధిష్టానం షాక్ ఇస్తుందా?

Telugu Desam: ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఓ వైపు అధికారంలోకి రావడానికి ప్రత్యేక వ్యూహాలు రచిస్తుంటే.. కొన్ని నియోజకవర్గాల్లో వర్గపోరు ఇబ్బంది పెడుతోంది. ఈ వర్గపోరు కారణంగానే ఆ మహిళా నేతను పార్టీ వదిలించుకోవాలి అనుకుంటోందా..? అందుకే షోకాజ్ నోటీసు ఇచ్చి., సస్పెండ్ చేసినంత పని చేశారా..?

ఇంకా చదవండి ...
  Telugu Desam: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) కి వచ్చే ఎన్నికలు చాలా కీలకం కానున్నాయి. కచ్చితంగా గెలిచి తీరాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి సమయంలో పలు నియోజవర్గాల్లో వర్గ పోరు టెన్షన్ గా మారింది. ముఖ్యంగా కొంతమంది నేతల తీరుపై అనుమానాలు నెలకొన్నాయి. అలాంటి వారిలో కొందర్ని పార్టీ దూరం పెడుతోందనే ప్రచారం ఉంది. తాజాగా ఓ మహిళా నేతకు పొమ్మన లేక పొగ పెడుతున్నారా? మూడేళ్లుగా మహిళా నేత విషయంలో జరుగుతోంది అదేనా? తాజాగా ఒక మీటింగ్‌కు వెళ్లారని షోకాజ్‌ నోటీసు ఇచ్చి.. సస్పెండ్ చేసినంత పని చేశారా? చివరి నిమిషంలో ఎందుకు వెనక్కి తగ్గారు? ఇంతకీ ఏం జరిగిందంటే..? అనతంతపురం జిల్లా (Anantapuram District) శింగనమల నియోజకవర్గం పార్టీ పెద్దలకు తలపోటుగా మారింది. మూడేళ్లుగా పార్టీలో విభేదాలు కొనసాగుతున్నాయి. ఎస్సీ రిజర్డ్వ్‌ నియోజకవర్గమైన శింగనమలలో టీడీపీ (TDP) అధిష్ఠానం చేసిన కొన్ని తప్పిదాలతో సమస్య జఠిలంగా మారింది అంటున్నారు స్థానిక తమ్ముళ్లు.. అందుకే సమస్య ఎప్పుడు ఏ రూపంలో బయటకు వస్తుందో అంతుచిక్కని పరిస్థితి ఉంది.

  శింగనమలలో టీడీపీని శమంతకమణి కుటుంబం లీడ్‌ చేస్తుండేది. సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న యామినీబాలపై వ్యతిరేకత రావడంతో 2019లో బండారు శ్రావణికి టీడీపీ ఛాన్స్‌ ఇచ్చింది. అయితే ఆ ఎన్నికల్లో వైసీపీ గాలికి తోడు తెలుగు దేశం సొంత తప్పిదాలతో చేదు ఫలితం తప్పలేదు. ఎన్నికల తర్వాత అయినా పరిస్థితి సద్దుమణుగుతుంది అనుకుంటే.. పరిస్థితి మరింత ముదిరింది. డీపీలోని వర్గపోరు ముదురు పాకాన పడింది.  పార్టీలోని సీనియర్లను పట్టించుకోవడం లేదని శ్రావణిపై అధిష్ఠానానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దాంతో సమస్యను సర్దుబాటు చేయడానికి పార్టీ పెద్దలు టు మెన్ కమిటీ ఏర్పాటు చేశారు. ముంటిమడుగు కేశవరెడ్డి, ఆలం నర్సానాయుడు ఆ కమిటీలో ఉన్నారు. టుమెన్‌ కమిటీపైనా పార్టీలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. చివరకు కమిటీలోనే విభేదాలు వెలుగు చూశాయి. ఆ తర్వాత శింగనమలలో టీడీపీ పరిస్థితి మరింత దిగజారింది.

  ఇదీ చదవండి : 9 జిల్లాల్లో పబ్లిక్ పల్స్ పై క్లారిటీ.. మరో ఎన్నికల సమరానికి సై అంటున్న సీఎం జగన్

  చంద్రబాబు జిల్లా పర్యటనకు వచ్చిన సమయంలో నియోజకవర్గ నేతలతో మాట్లాడి అంతా సెట్‌ చేసినట్టు ప్రచారం జరిగింది. ఆ తర్వాత బండారు శ్రావణి శింగనమలలో యాక్టివ్‌ అయ్యారు. కానీ.. పరిస్థితులు మళ్లీ మొదటికి వచ్చాయి. పుట్లూరు మండలం కొండాపురంలో చంద్రన్న రైతు గ్రామ పోరు గర్జన నిర్వహించారు. కార్యక్రమానికి ఆహ్వానించడంతో శ్రావణి వెళ్లారు. అయితే ఆ సభకు ఎందుకు వెళ్లారని జిల్లా నేతలు శ్రావణిని వివరణ అడగటం చర్చగా మారింది. దీనిపై పార్టీ నేతలు కాల్వ శ్రీనివాసులు, బీటీ నాయుడుకు ఫిర్యాదు చేశారట. టీడీపీలో విభేదాలు సృష్టించేలా.. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారని మండిపడుతూ.. అసలు శ్రావణి ఏ హోదాతో చేస్తున్నారని ప్రశ్నిస్తోంది.

  ఇదీ చదవండి: ఇద్దరి దిగ్గజాలతో రామ్మోహన్ నాయుడు.. పార్లమెంట్ సమావేశాల్లో తొలి రోజు ఆసక్తికర ఘటనలు

  శ్రావణి గట్టిగానే బదులిచ్చినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తనను మూడేళ్ల క్రితమే శింగనమల టీడీపీ ఇంఛార్జ్‌గా నియమించారని వ్యతిరేకవర్గానికి బదులిచ్చారట. ఒకవేళ ఇంఛార్జ్‌ పదవి నుంచి తీసేసినట్టు చెబితే.. ఆధారాలు చూపించాలని ఎదురు ప్రశ్నించారట. పార్టీలో గొడవలకు కారణం అవుతున్నవారిపై గతంలో తాను ఇచ్చిన ఫిర్యాదుపై ఇలాంటి విచారణలు ఎందుకు చేయలేదని నిలదీశారట శ్రావణి. ఈ క్రమంలో విజయవాడలో యనమల రామకృష్ణుడు సమక్షంలో శింగనమల పంచాయితీ జరిగినట్టు చెబుతున్నారు. దళిత మహిళను కావడంతో అన్ని వర్గాల వారూ తనను ఇబ్బంది పెడుతున్నారని శ్రావణి ఆవేదన వ్యక్తం చేశారట. మరి.. ఈ సమస్య పరిష్కారానికి పార్టీ పెద్దలు ఏ మంత్రం వేస్తారో చూడాలి.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Anantapuram, Andhra Pradesh, AP News, TDP

  తదుపరి వార్తలు