హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Ration Mafia: సరిహద్దులు దాటేస్తున్న రేషన్ బియ్యం.. ఎలా మాయ చేస్తున్నారంటే..?

Ration Mafia: సరిహద్దులు దాటేస్తున్న రేషన్ బియ్యం.. ఎలా మాయ చేస్తున్నారంటే..?

X
పక్కదారి

పక్కదారి పడుతున్న రేషన్ బియ్యం

Anantapur: పేదల కడుపు నింపేందుకు ప్రభుత్వం ఇస్తున్న రేషన్ లోనూ మాఫియా చేతివాటం హద్దులు దాటుతోంది.. కిలో రెండు కిలోలు మిగల్చడం కాదు.. బస్తాలకు బస్తాల ధాన్యాన్ని ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలించేస్తున్నారు. అందుకోసం ఏం చేస్తున్నారంటే..?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Anantapur, India

G Venkatesh, News18, Anantapuram

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలు అందిస్తోంది. అందులో భాగంగా ఇంటింటికీ రైస్ (Door to Door Ration) పంపిణీ చేస్తోంది. పేద వాడి పొట్ట నింపాలనే మంచి ఉద్దేశంతో ప్రభుత్వం ఈ రేషన్ అందిస్తుంటే.. కొందరు వాటిలోనూ చేతి వాటం చూపిస్తున్నారు. ఎదో బస్తా.. అరబస్తా మోసం చేస్తున్నారు అంటే కాదు.. వారి ఆశ అయితే రేషన్ బియ్యాన్ని సరిహద్దులు దాటించేస్తోంది. అది అతి తెలివిగా.. బియ్యాన్ని తరలించేస్తున్నారు. ఈ దందా గురించి పూర్తిగా తెలిస్తే  షాక్ అవుతారు. ఎక్కడంటే..? అనంతపురం (Anantapuram) నగరంలోని పంగల రోడ్డు దగ్గర గల ఓరైస్ మిల్లులో రేషన్ బియ్యాన్నిఅక్రమంగా కొనుగోలు చేసి....పాలిష్ పట్టి తరువాత సన్న బియ్యంగా మార్చి గుట్టు చప్పుడుగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు.

కర్ణాటక చుట్టుపక్కల బార్డర్ తీసుకెళ్లి వాటిని విక్రయిస్తున్నారు. నగరంలోని రేషన్ బియ్యం సేకరించి, వాటిని ఇక్కడ పాలిష్ చేస్తున్నారు. రాప్తాడు మండలం పరిధిలోని పంగల్ రోడ్డు సమీపంలో గల సురేష్ కుమార్ అనే వ్యక్తి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర రైస్ మిల్ నిర్వహిస్తున్నారు.

జిల్లా కేంద్ర పరిసర ప్రాంతాల్లో ,రేషన్ కార్డుదారుల నుంచి తక్కువ ధరకు బియ్యం సేకరించి, వాటిని రీసైక్లింగ్ చేసి తర్వాత తాజ్ మహల్ అనే బ్రాండ్ పేరు కలిగిన సంచుల్లో నింపి కర్ణాటక తరలించేవారు. ఈ క్రమంలో విజిలెన్స్ వారు పక్క సమాచారంతో లోడుతో వెళ్తున్న లారీని నేషనల్ హైవే సమీపంలో రాప్తాడు వద్ద పట్టుకున్నారు.

ఇదీ చదవండి : పందానికి సై అంటున్న క్రాస్ పుంజులు.. వీటి ప్రత్యేకత ఏంటో తెలుసా..?

ప్రభుత్వం పేదవారికి తక్కువ ధరలో రేషన్ కార్డు కలిగిన వారికి బియ్యం అందిస్తోంది.అయితే కొంతమంది వాటిని వారి స్వార్థం కోసం వాడుకుంటున్నారు. విజిలెన్స్ వారు లారీని అదుపులోకి తీసుకుని రాప్తాడు పోలీసులకు అప్పగించారు. లారీ డ్రైవర్లు అల్లా భకాష్ , జైపాల్ రెడ్డిని అరెస్టు చేశారు. అనంతరం రైస్ మిల్లులను తనిఖీ చేసి అక్కడ నిల్వ ఉన్న చౌక బియ్యంను స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం నగరం చుట్టుపక్కల గ్రామాల నుంచి రేషన్ బియ్యం సేకరించి, వాటిని ఈ రైస్ మిల్లుకు గుట్టు చప్పుడు కాకుండా తరలించేవారు.

ఇదీ చదవండి : ప్రజల ప్రాణాల కంటే ప్యాకేజీ ముఖ్యమా..? పవన్ కు మంత్రి రోజా ప్రశ్న

అక్కడ సేకరించిన బియ్యంను రీసైక్లింగ్ చేసి వాటిని సన్న బియ్యముగా మార్చి ఇతర ప్రాంతాలకు తరలించి అమ్ముకునేవారు. అయితే అధికారులకు అందిన సమాచారం ప్రకారం వాటిని స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వం పేదలకు చౌక బియ్యం అందిస్తోంటే...అయితే దళారులు ఈ బియ్యంను 8 రూపాయల నుంచి 12 రూపాయలు వరకు తీసుకొని రైస్ మిల్ తరలిస్తున్నారు. ఈ బియ్యాన్నిపాలిష్ చేసి గుట్టు చప్పుడు కాకుండా ఇతర రాష్ట్రాలకు తరలించేవారనివీటిని అధికారులు తనిఖీ చేసి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

First published:

Tags: Anantapuram, Andhra Pradesh, AP News, Local News