Home /News /andhra-pradesh /

ANANTAPURAM ANDHRA PRADESH CRIME NEWS ONE MAN KILLED HIS OWN BROTHER IN LAW AT ANANATAPURAM NGS TPT

Crime News: బావమరిదిపై సొంత బావ దారుణం.. దాని కోసం అంత నీచానికి ఒడిగట్టాలా..?

ఆస్తి కోసం బావమరిదిని చంపిన బావ

ఆస్తి కోసం బావమరిదిని చంపిన బావ

Crime News: డబ్బుకు ఉండే విలువ మనుషులకు.. బంధాలకు ఇవ్వడం లేదు.. తాజాగా మైనర్ అయిన బామ్మర్దిని.. సొంత బావే హత్య చేయడం కలకలం రేపుతోంది. అందుకు కారణం.. అతడు వేసిన ప్లాన్ తెలిస్తే షాక్ అవుతారు..

 • News18 Telugu
 • Last Updated :
 • Vijayawada, India
  T Hemanth Kumar, Tirupathi, News18

  Andhra Pradesh Crime News: రోజు రోజుకు సమాజంలో చాలా మంది మనుషులమన్న సంగతి మరిచిపోతున్నారు. రక్త సంబంధాలను.. బంధాలను కూడా తెంచేసుకుంటున్నారు. మనుషులను.. విలువలను పక్కన పెట్టి.. కేవలం  డబ్బులకే ప్రాధాన్యత ఇచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. ఒకప్పుడు పెళ్లి సంబంధం చూడాలి అంటే ఇటు ఏడు తరాలు.. అటు ఏడు తరాలు చూడాలి అనేవారు.. కానీ ఇప్పుడు అవేవి పట్టించుకోవడం లేదు.  కేవలం అవతల వాళ్లకు ఉన్న ఆస్తి మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నారు. అందుకే బంధాలకు విలువలు తగ్గిపోతున్నాయి. తాజాగా అనంతపురం (Anantapuram) లో జరిగిన ఘటన ఆస్తిపై మనుషులకు  ఎంత వ్యామోహం ఉందో తెలిసేలా చేస్తోంది.

  స్థానికులు పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా కంబదూరు మండలం ములకనూరు గ్రామానికి చెందిన 9 వ తరగతి చదివే 15 ఏళ్ల విద్యార్థి (15 years Student) దండా అఖిల్  మే 22న కందూరు పోలీస్ స్టేషన్ లో అదృశ్యమైనట్లు కేసు నమోదు అయ్యింది. అలా మిస్ అయిన అఖిల్ హత్య (Murder) కు గురయ్యాడని తెలియడంతో అంతా షాక్ అయ్యారు. అయితే ఆ హత్యకు సూత్రధారి, పాత్రధారి సొంత బావే అనిల్ అని తెలియడం కలవర పాటుకు గురి చేసింది.  ములకనూరు గ్రామానికి చెందిన శారదమ్మ హనుమంతరాయుడు లకు దండా అఖిల్, వర్షిత, త్రిష ముగ్గురు పిల్లలు ఉన్నారు, 8 నెలల క్రితం పెద్ద కూతురు వర్షితను పక్క గ్రామమైన గుద్దేళ్ల గ్రామానికి చెందిన బారపనీడి అనిల్ కు ఇచ్చి వివాహం చేశారు. కొన్ని నెలలపాటు కుటుంబంతో సంతోషంగా ఉన్నాడు.

  ఇదీ చదవండి : ఎమ్మెల్యేను భయపెడుతున్న సెంటిమెంట్? అక్కడ ఎవరికైనా ఒక్క ఛాన్స్ మాత్రమేనా?

  అయితే సొంత అల్లుడు అనిల్  తన అత్త ఆస్తికి  బామ్మర్ది అడ్డుగా ఉన్నాడని అనిల్ కు ఆగ్రహం పెరిగింది. దీంతో అతడిని చంపాలని పథకం వేశాడు. మే 21న ములకనూరులో తిమ్మప్పస్వామి జాతర జరుగుతుండగా అఖిల్ అదృశ్యమయ్యాడు మరుసటి రోజే కందూరు పోలీస్ స్టేషన్లు అదృశ్యమయ్యాడు. అని ఫిర్యాదుతో పోలీసులు రంగ ప్రవేశం చేసి గాలింపు చర్యలు చేసిన అఖిల్ ఆచూకీ దొరకలేదు. దీంతో సొంత బావ అనిల్ పై పోలీసులకు అనుమానం వచ్చిన వెంటనే బావ అనిల్ పరారయ్యాడు.  పరారీలో ఉన్న అనిల్ ఎవరికి పట్టుకొని అసలు విషయాలు పోలీసులు వెల్లడించారు.

  ఇదీ చదవండి: ఆధ్యాత్మిక బాటలో మంత్రి.. లక్ష్మీ నృసింహునికి పురాణపండ "శ్రీమాలిక " సమర్పించిన రోజా

  సెల్ ఫోన్ ఇప్పిస్తానని తన బైక్ లో గుద్దేళ్ల లోని తన వ్యవసాయ తోటలోకి తీసుకువెళ్లి వేరుశనగ పంటలో స్ప్రింక్లర్ల పై మార్పించి అనంతరం తన పొలం పక్కనే ఉన్న వంకలో అప్పటికే తీసి ఉంచిన గుంత వద్దకు తీసుకువెళ్లి తన బావమరిది అఖిల్ కాళ్లు చేతులను రేపు వైరుతో కట్టేసి మెడపై మచ్చు కొడవలితో నరికి గుంతలోకి వేసిన తర్వాత రాళ్ళు వేసి  కప్పేశాడు. బుధవారం ఆ ప్రాంతంలో గుంత తవ్వి చూడగా అఖిల్ మాంసపు ముద్ద, ఎముకలు బట్టలు డ్రిప్ వైర్లు తో ఉండి దుర్వాసన వెదజల్లుతోంది.

  ఇదీ చదవండి : ఏపీకి మరో హెచ్చరిక.. ఆ తొమ్మిది జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఎప్పుడంటే?

  సుమారు నాలుగు గంటల పాటు గుంతను తవ్వడానికి నానా కష్టాలు పడ్డారు ఏ మాత్రం గుర్తు పట్టలేని విధంగా కేవలం మాంసపు ముద్దలు కనిపించాయి పోలీసులు రెవెన్యూ అధికారుల సమక్షంలో పోస్టు మార్టం చేపట్టారు. నిందితుడైన బావ అనిల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్య పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Anantapuram, Andhra Pradesh, AP News, Crime news

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు