హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Breaking News: యమపాశంగా మారిన విద్యుత్ వైర్లు.. ఆరుగురు వ్యవసాయ కూలీలు మృతి..

Breaking News: యమపాశంగా మారిన విద్యుత్ వైర్లు.. ఆరుగురు వ్యవసాయ కూలీలు మృతి..

విద్యుత్ వైర్లు పడి ఆరుగురు వ్యవసాయ కూలీలు మృతి

విద్యుత్ వైర్లు పడి ఆరుగురు వ్యవసాయ కూలీలు మృతి

Breaking News: వారంతా వ్యవసాయ కూలీలు.. రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబాలు వారివి.. కాయాకష్టం నమ్ముకున్న వారిపై విధి పగ పట్టింది. విద్యుత్ వైర్ల రూపంలో ఆరుగురు కూలీల ప్రాణాలు తీసింది.. ఏం జరిగింది అంటే..?

  • News18 Telugu
  • Last Updated :
  • Anantapur, India

Breaking News: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పెను విషాదం చోటు చేసుకుంది. ఆరుగురు వ్యవసాయ కూలీలు దుర్మరణం పాలయ్యారు. అముదం పంట కోస్తే నాలుగు రాళ్లు సంపాదించుకోవచ్చు.. అని కష్టపడడానికి వచ్చిన వారిని విధి బలితీసుకుంది. ఈ ఘటన అనంతపురం జిల్లా (Anantapuram District) లో చోటు చేసుకుంది. బొమ్మనహల్ మండలం దర్గాహొన్నూరులో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. వ్యవసాయ పనులకు ట్రాక్టర్ (Tractor) లో వెళ్తున్న సమయంలో విద్యుత్ మెయిన్ లైన్ తెగి పడి ఆరుగురు కూలీలు మృతి చెందారు. ఆముదం పంట కోసేందుకు వచ్చిన కూలీలు.. తమ పని ముగించుకుని.. తిరిగి ఆటోలో వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ఇలా వ్యవసాయ కూలీలు బలి అవ్వడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది జూన్ 30న ఉమ్మడి అనంతపురం జిల్లాలోని తాడిమర్రి మండలంలో వ్యవసాయ పనులకు వెళ్తున్న కూలీల ఆటోపై విద్యుత్ వైర్లు తెగిపడి ఐదుగురు కూలీలు మరణించారు. ఆ ఘటన మరువకు ముందే.. మరోసారి ఆరుగురు కూలీలు సజీవ సమాధి అయ్యారు.

ఇలాంటి ప్రమాదాలకు ప్రధాన కారణం విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణం అంటున్నారు.. ఎందుకంటే విద్యుత్ వైర్లు తెగిపడి.. జరుగుతున్న ప్రమాదాలు పెరుగుతున్నాయి. అయితే ఎక్కడే విద్యుత్ వైర్లు తెగే అవకాశం ఉందో.. అక్కడ ఫిర్యాదులు అందుతున్నాయి. అయినా అధికారులు వెంటనే స్పదించడం లేదు.. అలాంటి వాటిని ముందే గుర్తించి... చర్యలు తీసుకుంటే ఇలాంటి ప్రమాదాలు తగ్గొచ్చు అంటున్నారు.

ఇదీ చదవండి : శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఇంటి దగ్గర నుండే టీటీడీ 2023 క్యాలెండర్లు, డైరీలు పొందండి? ధర ఎంతంటే?

అసలు ఏం జరిగింది అంటే..? బొమ్మనహాళ్ మండలం దర్గాహొన్నూరులో కొందరు వ్యవసాయ కూలీలు ఆముదం పంట కోయడానికి ట్రాక్టర్‌లో వెళ్లారు. పంట కోస్తున్న సమయంలో వర్షం పడింది. దీంతో పని అక్కడకు ఆపేసి.. ఇంటికి తిరిగి వెళ్దామని కూలీలు భావించారు. ఇంతలోనే విద్యుత్ మెయిన్ లైన్ తీగలు హఠాత్తుగా తెగబడ్డాయి. ఏం జరిగిందో తెలుసుకునేలోపే ఆరుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. పని కోసం వెళ్లిన తమ వారు.. ఇలా విగతజీవులుగా మారడాన్ని చూసిన కుటుంబ సభ్యులు తట్టుకోలేక కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇదీ చదవండి: విశాఖలో ప్రధాని మోదీ షెడ్యూల్ ఇదే.. భోగాపురం ఎయిర్ పోర్టు శంకుస్థాపనం..!

మరోవైపు.. బాధితులతో పాటు గ్రామస్తులు కూడా విద్యుత్ అధికారులపై మండిపడుతున్నారు. దర్గాహోన్నూరు సమీపంలో విద్యుత్ తీగలు ఎప్పటినుంచో వేలాడుతున్నాయని, విద్యుత్ అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ దారుణం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: నవంబర్ లో వెళ్లాల్సిన బెస్ట్ పికినిక్ స్పాట్.. అక్కడ కొండెక్కితే మేఘాలు చేతికే అందుతాయా..?

మొత్తం 8 మంది ట్రాక్టర్ లో ప్రయాణిస్తుండగా.. ఇద్దరు పురుషులు సహా నలుగురు మహిళలు విద్యుత్ షాక్ కు గురై చనిపోయారు. దర్గాహోన్నూరు గ్రామానికి చెందిన శంకరమ్మ, లక్ష్మి, సరోజమ్మ, వడ్రక్క మృతి చెందారు. అదే గ్రామానికి చెందిన రత్నమ్మ, పార్వతి తీవ్ర గాయాలతో బళ్లారి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతి చెందిన కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారని ఎమ్మెల్యే కాపు రామచంద్రా రెడ్డి ప్రకటించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది అన్నారు. తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందేలా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

First published:

Tags: Anantapuram, Andhra Pradesh, AP News, Crime news

ఉత్తమ కథలు