హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

God Father: గాడ్ ఫాదర్ టైటిల్స్ లో ఏపీ పోలీస్ అధికారి పేరు.. చిరు అభిమానానికి ఎస్పీ ఫిదా.. అసలు స్టోరీ ఇదే..!

God Father: గాడ్ ఫాదర్ టైటిల్స్ లో ఏపీ పోలీస్ అధికారి పేరు.. చిరు అభిమానానికి ఎస్పీ ఫిదా.. అసలు స్టోరీ ఇదే..!

చిరంజీవిపై అనంతపురం ఎస్పీ అభిమానం

చిరంజీవిపై అనంతపురం ఎస్పీ అభిమానం

గాడ్ ఫాదర్ టైటిల్స్ లో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కి చెందిన ఓ పోలీస్ అధికారి పేరు కనిపించడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అంతేకాదు తన పేరు వెండితెరపై కనిపించడంతో సదరు పోలీస్ ఆఫీసర్ కూడా ట్వీట్ చేయడం వైరల్ గా మారింది.

 • News18 Telugu
 • Last Updated :
 • Anantapur, India

  GT Hemanth Kumar, News18, Tirupati

  మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) సినిమా అంటేనే క్రేజ్ వేరే లెవెల్ లో ఉంటుంది. అంచనాలు ఆకాశాన్ని అంటుతాయి. ఎన్నో అంచనాలతో విడుదలైన ఆచార్య సినిమా డిజాస్టర్ కావడం.., ఆచార్య (Acharya) అనంతరం భారీ ఎక్స్పెటేషన్ నడుమ విడుదల అయిన గాడ్ ఫాదర్ సినిమా (God Father Movie)పై అందరి దృష్టి పడింది. ఫస్ట్ షో నుంచే గాడ్ ఫాదర్ సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే గాడ్ ఫాదర్ టైటిల్స్ లో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కి చెందిన ఓ పోలీస్ అధికారి పేరు కనిపించడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అంతేకాదు తన పేరు వెండితెరపై కనిపించడంతో సదరు పోలీస్ ఆఫీసర్ కూడా ట్వీట్ చేయడం వైరల్ గా మారింది.

  ఇంతకీ గాడ్ ఫాదర్ సినిమాలో వెండితెరపై కనిపించిన పోలీస్ అధికారి ఎవరో కాదు.. అనంతపురం జిల్లా (Anantapuram District) ఎస్పీ ఫకీరప్ప. అవును ఫకీరప్పకు స్పెషల్ థ్యాంక్స్ చెబుతూ టైటిల్ కార్డ్స్ వేశారు. దీంతో ఆయన పేరు ఎందుకు వేశారన్న డిస్కషన్ కూడా నడుస్తోంది. అసలు విషయం ఏంటంటే..! గాడ్ ఫాదర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 28న అనంతపురంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్ లో జరిగింది. భారీ స్థాయిలో జరిగిన ఆ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. జోరువానలోనూ అభిమానాలు మెగాస్టార్ కోసం వచ్చి ఈవెంట్ ను సక్సెస్ చేశారు. భారీ స్థాయిలో వచ్చిన అభిమానులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు ఏర్పాట్లు చేశారు. అలాగే మెగా ఈవెంట్ కు సరైన భద్రత కల్పించారు.

  ఇది చదవండి: రాజధానిపై రూటు మార్చిన వైసీపీ ..? దేవుడిపై భారం వేయడంలో ఆంతర్యం ఏంటి..?

  ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి మాట్లాడుతూ.. పోలీసుల సహకారానికి, వర్షంలోనూ చూపించిన డెడికేషన్ కి పేరు పేరునా తన కృతజ్ఞతలు తెలిపారు. ఆ కృతజ్ఞత భావాన్ని మెగాస్టార్ చిరంజీవి అనంతపురంలోనే విడిచిపెట్టలేదు. తన హృదయానికి హత్తుకునేలా పోలీస్ శాఖ ఏర్పాట్లను చూసి మైమరచి పోయిన మెగాస్టార్.. స్క్రీన్ పై ఎస్పీ ఫక్కీరప్ప పేరును వేయించి కృతజ్ఞతలు తెలిపారు. “THANKS TO DR. FAKKEERAPPA KANGINELLI,ips... Govt arts college and officials” అంటూ స్క్రీన్ పై వేశారు.

  వెండి తెరపై అందునా మెగాస్టార్ చిరంజీవి సినిమా టైటిల్స్ లో తన పేరు కనిపించడంతో ఖుషీ అయిన అనంతపురం ఎస్పీ ఫకీరప్ప.. తన ఆనందాన్ని ట్విట్టర్ లో పంచుకున్నారు. థ్యాంక్స్ టూ గాడ్ ఫాదర్ అంటూ స్క్రీన్ పై తన పేరు వచ్చిన ఫోటోను ఫకీరప్ప ట్వీట్ చేశారు. ఇప్పుడా ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటికే ఈ ట్వీట్ ని 272 మంది షేర్ చేయగా...1330 లైక్స్ వచ్చాయి. చిరంజీవిపై చూపించే అభిమానం.. చిరంజీవి చూపించే అభిమానం కూడా ఉన్నతస్థాయిలో ఉంటాయని మెగా ఫ్యాన్స్ చెబుతున్నారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Anantapuram, Andhra Pradesh, God Father Movie, Megastar Chiranjeevi

  ఉత్తమ కథలు