హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Politics: పరిటాల గెలవాలంటే ఆ పని చేయాల్సిందే..? అందుకే ‘జాకీ’ ఇష్యూ అంటూ ఎమ్మెల్యే ఫైర్

AP Politics: పరిటాల గెలవాలంటే ఆ పని చేయాల్సిందే..? అందుకే ‘జాకీ’ ఇష్యూ అంటూ ఎమ్మెల్యే ఫైర్

పరిటాల సునీత

పరిటాల సునీత

AP Politics: అనంతపురం రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. గెలుపు కోసం అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం ఢీ అంటే ఢీ అంటున్నాయి.. ముఖ్యంగా రాప్తాడులో పరిస్థితి ఉధ్రిక్తంగా మారుతోంది. పరిటాల వర్సెస్ స్థానిక ఎమ్మెల్యే పోరులో మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ సంచలన ఆరోపణలు చేశారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Anantapur, India

AP Politics: అనంతపురం (Anantapuram) రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ముఖ్యంగా అధికార వైసీపీ (YCP), ప్రధాన ప్రతిపక్ష టీడీపీ (TDP) మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరింది. సవాళ్ల పర్వ కొనసాగుతోంది. అయితే రాప్తాడులో పరిస్థితి రాజకీయ యుద్ధ వాతావారణాన్ని తలపిస్తోంది. ఇటు పరిటాల ఫ్యామిలీకి.. స్థానిక ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ (Thopudarthi Prakahs Reddy) కు మధ్య పరిస్థితి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా మారింది. తాజాగా ఈ రెండు వర్గాల మధ్య.. జాకీ పరిశ్రమ హీట్‌ పెంచుతుంది… ఈ విషయంపై తాజాగా సీఎం వైఎస్‌ జగన్‌ (CM Jagan)కు లేఖ రాశారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (CPI Ramakrishna) లేఖ.. జాకీ పరిశ్రమ ఏర్పాటుకు తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు..

రాప్తాడులో జాకీ పరిశ్రమ ఏర్పాటు చేస్తే సుమారు 6000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని లేఖలో పేర్కొన్న రామకృష్ణ.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ వారి దగ్గర 10 కోట్లు డిమాండ్ చేయడంతో జాకీ పరిశ్రమ తరలిపోయినట్లు సంచలన ఆరోపణలు చేశారు. పారిశ్రామికవేత్తలను ప్రజా ప్రతినిధులు బెదిరిస్తే పరిశ్రమలు ఎలా ఏర్పాటు అవుతాయని ప్రశ్నించారు. ఈ ఆ ఆరోపణలపై ఘాటుగా రియాక్ట్‌ అయ్యారు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి..

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన గ్యాంగ్ తో పాటు.. సీపీఊ రామకృష్ణ కళ్లున్న కాబోదులని ప్రకాష్ ఫైరయ్యారు.

2018 డిసెంబర్‌లో రాప్తాడు నుంచి జాకీ పరిశ్రమ సేలంకు తరలిపోయిందని.. మరి అప్పుడు ఎందుకు ప్రశ్నించ లేదు అంటూ రామకృష్ణను నిలదీశారు. ఆరోజే చంద్రబాబు పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ ను ఎందుకు తిట్టలేదన్న ఆయన.. పరిటాల వారు గుడ్ విల్ అడిగినందుకే అప్పుడు పరిశ్రమ పోయిందని ఆరోపించారు.. కమ్యూనిస్టు భావాలను పక్కన పెట్టి.. అమ్ముడుపోయారు అంటూ రామకృష్ణపై ఫైర్‌ అయ్యారు.

ఇదీ చదవండి : నెంబర్ 2 సహా.. అందరి కోరిక అదే.. మరి అధినేత పవన్ వారి నిర్ణయాన్ని గౌరవిస్తారా..?

వచ్చే ఎన్నికల్లోని రాప్తాడులో పరిటాల కుటుంబానికి డిపాజిట్ కూడా రాదన్నారు. అందుకే ధర్మవరం, పెనుకొండ చూస్తున్నారని.. కానీ, చంద్రబాబు వాళ్లను రాప్తాడు తిరిగి పంపారని.. రాప్తాడులో పరిటాల వాళ్లు గెలవాలంటే తననైనా చంపాలని లేదా తన క్యారెక్టర్ నైనా చంపాలి అంటూ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రాకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వారికి కమ్యూనిస్టులు అండగా ఉంటారని చంద్రబాబు చెప్పారు.. ఇప్పుడే అందుకే జాకీ పరిశ్రమ ఇష్యూని తెరపైకి తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి : ఎంపీ విజయసాయి రెడ్డి ఫోన్ మిస్సింగ్ అంటూ ఫిర్యాదు.. పోయిందా లేక పడేశారా..?

2018లోనే రాప్తాడు నుంచి తరలిపోయిన జాకీ పరిశ్రమను సీపీఐ నేత రామకృష్ణ, టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ రాష్ట్ర చీఫ్‌ సోమూవీర్రాజు వెనక్కి తీసుకొస్తారా? అని ఆయన ప్రశ్నించారు. ఇదే సమయంలో, 10 వేల మంది మహిళలకు ఉపయోగపడే ఉండే విధంగా డైరీ స్థాపిస్తున్నాను అని వెల్లడించారు.. పేజ్ (జాకీ) సంస్థ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ అని.. అనేక రాష్ట్రాల్లో వీరు పెట్టుబడులు పెడుతామని వెనక్కి వెళ్లిపోయారని ఆరోపించారు.

First published:

Tags: Anantapuram, Andhra Pradesh, AP News, AP Politics, Paritala Sunita