G Venkatesh, News18, Anantapuram
అనంతపురం (Anantapuram) నగరంలోని ఇస్కాన్ టెంపుల్ (ISKON Temple) ఎంతో అద్భుతంగా ఆకర్షణీయంగా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా చాలా సుందరంగా నిర్మించారు. అనంతపురం నగల శివారులోని సోమల దొడ్డి గ్రామం వద్ద ఈ ఇస్కాన్ టెంపుల్ లో 28వ సంవత్సరంలో నిర్మించారు. ప్రపంచంలోనే మొత్తం ఇస్కాన్ టెంపుల్ ఎలా అయితే నిర్మాణం చేశారు. అదేవిధంగా ఇక్కడ అనంతపురం జిల్లాలో నిర్మించారు. అనంతపురంలోని ఇస్కాన్ దేవస్థానంలో రాధ పార్థసారధి గా పిలుస్తారు. ఇక్కడ శ్రీకృష్ణుడు రాధా సమేతంగా కొలువై ఉన్నాడు ఈ దేవాలయం యొక్క విశిష్టత చాలా గొప్పది. ఈ దేవాలయం ముందువైపు నాలుగు పెద్ద గుర్రాలు రతాన్ని లాగుతున్నట్టు ఈ గర్భగుడిని నిర్మించారు. ఈ దేవాలయం ఇరువైపులా నాలుగు పెద్ద రథచక్రాలు కూడా అమర్చినట్టు వీటిని నిర్మించారు ఈ దేవాలయం ఎంతో వైభవంగా వర్ధిల్లుతుంది. నగరంలోన వందలాది ప్రజలు ప్రతిరోజు ఈ దేవాలయంలో సందర్శిస్తూ ఉంటారు.
అనంతపురం జిల్లా వ్యాప్తంగా అతి ముఖ్యమైన సందర్శన ప్రదేశాలలో అనంతపురం నగరంలోని ఇస్కాన్ దేవాలయం ఒకటి. ఇస్కాన్ దేవస్థానం ఉమ్మడి అనంతపురం జిల్లాకే ఒక ముఖ్యమైన పర్యాటక కేంద్రంగా ఆధ్యాత్మికంగా నిలుస్తోంది. ఇక్కడ ప్రతిరోజు శ్రీకృష్ణుడు మరియు రాధా లకు ఉదయం నుంచి పూజలు జరుపుతూనే ఉంటారు.
ఈ ఇస్కాన్ టెంపుల్ వారి ఆధ్వర్యంలో ఒక గోశాల కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఉదయం 4:30 పూజలో ప్రారంభమవుతాయి. రాత్రి 8:30 వరకు ప్రజలు సందర్శనార్థం ఇక్కడ దేవాలయంలో తెలిసి ఉంచుతారు. లోపల రాధా సమేతంగా ఉన్న కొలవై ఉన్న శ్రీకృష్ణుడు ఎంతో అద్భుతంగా ఎంతో ప్రకాశవంతంగా తేజస్తో దర్శనమిస్తూ ఉంటారు.
కుటుంబ సమేతంగా వెళ్లి ఇస్కాన్ దేవాలయం పరిసర ప్రాంతాల్లో ఆహ్లాదమైన వాతావరణంలో ఆధ్యాత్మికతను ఆస్వాదించవచ్చు మరియు పిల్లలకు చూడడానికి పార్కు వంటి ప్రదేశాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా వెళ్లి సందర్శించిన దేవస్థానంలో ఈ ఇస్కాన్ టెంపుల్ ఒకటి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anantapuram, Andhra Pradesh, Local News