G Venkatesh, News18, Anantapuram
అనంతపురం జిల్లా (Anantapuram District) ఇండస్ట్రియల్ పార్కులకు నిలువుగా అభివృద్ధి చెందుతోంది, వీటిలో భాగంగా కియా పరిశ్రమ కూడా అనంతపురం జిల్లాలోనే స్థాపించారు. అలాగే సోలార్ ప్రాజెక్టులు కూడా కేటాయిస్తున్నారు. దీనిలో భాగంగా ఆదానీ సంస్థ సోలార్ పార్క్ ను అనంతపురం జిల్లాలోని రాయదుర్గం, కనేకల్, డి హరేహళ్, బొమ్మనహల్ మండలాల్లోని 13 గ్రామాలలో దాదాపుగా 11831.81 ఎకరాల భూమిని ఈ పార్కు కోసం కేటాయించారు. అయితే ఈ భూమిని ప్రభుత్వం లీజు పద్ధతిలో భూసేకరణను చేపడుతుంది. ఎకరాకి సంవత్సరం కాలానికి 30,000 చొప్పున చెల్లిస్తారు. అయితే ఈ మొత్తం భూమిలో పట్టా భూమి 9817.18 ఎకరాలు, ప్రభుత్వ భూమి 557.52 ఎకరాలు, అసైన్డ్ భూమి 1457.14 ఎకరాలు గుర్తించారు.
గతంలో భూసేకరణ చేపట్టే సమయంలో వారికి మొత్తం డబ్బులు చెల్లించి భూమిని సేకరించేవారు. ఇప్పుడు ప్రస్తుతం లీజు పద్ధతిలో భూమిని సేకరిస్తున్నారు. సక్రమంగా చెల్లిస్తారో లేదో అని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. సంవత్సరానికి 30 వేల రూపాయలు చెల్లించేలా ప్రభుత్వం జీవో వచ్చిందన్నారు. ప్రభుత్వం నుండి తమకుఎలాంటి భరోసా లేదని రైతులను తెలుపుతున్నారు. ముఖ్యంగా రైతులు గందరగోళం అవడానికి కారణం కూడా ఈ మధ్యకాలంలో ఆదని సంస్థ అవకతవకలకు పాల్పడుతుందని ప్రచారం సాగడంతో వారు గందరగోళానికి గురవుతున్నారు.
ఇలానే గతంలో లేపాక్షి నాలెడ్జ్ హబ్ ఏర్పాటు చేసే సమయంలో కొన్ని వేల ఎకరాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పడంతో, వారు ఆ భూమిని ప్రభుత్వ బ్యాంకులలో తాకట్టు పెట్టి డబ్బు తీసుకొని పరిశ్రమ ఏర్పాటు చేయలేదు. దీంతో అక్కడ భూములు ఇచ్చిన రైతులకు ఉద్యోగ అవకాశాలు ఉపాధి లభించలేదని సిపిఎం జిల్లా కార్యదర్శి కార్యదర్శి రాంభూపాల్ తెలిపారు.
బొమ్మనహల్ మండలం ఇలాంటి గ్రామానికి చెందిన రైతు సాయన్న మాట్లాడుతూ.., ప్రభుత్వం హామీ ఇవ్వాలని అప్పుడే తమకు ఎటువంటి భయంతో ఉండదన్నారుఅలా ప్రభుత్వం హామీ ఇవ్వకపోతే కచ్చితంగా భూములు ఇవ్వడం సాధ్యం కాదని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anantapuram, Andhra Pradesh, Local News