హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ఆ విషయంలో అనంతపురం రికార్డ్.. ఏపీలోనే టాప్

ఆ విషయంలో అనంతపురం రికార్డ్.. ఏపీలోనే టాప్

ఉపాధిహామీ పథకంలో అనంతపురం టాప్

ఉపాధిహామీ పథకంలో అనంతపురం టాప్

గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా రాష్ట్రంలోనే ఉమ్మడి అనంతపురం జిల్లా (Anantapuram District) దూసుకుపోతోంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎక్కువగా పనుల కోసం ఇతర రాష్ట్రాలకు ముఖ్యంగా కర్ణాటకకు కూలీలు వలస వెళుతూ ఉంటారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Anantapur | Andhra Pradesh

G Venkatesh, News18, Anantapuram

గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా రాష్ట్రంలోనే ఉమ్మడి అనంతపురం జిల్లా (Anantapuram District) దూసుకుపోతోంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎక్కువగా పనుల కోసం ఇతర రాష్ట్రాలకు ముఖ్యంగా కర్ణాటకకు కూలీలు వలస వెళుతూ ఉంటారు. అనంతపురం జిల్లాలో ఎక్కువగా కరువు సంభవిస్తూ ఉంటుంది.ఇలాంటి సమయంలో పనులు దొరకక కూలీలు ఇతర రాష్ట్రాలకు వలస వెళుతూ ఉంటారు. అయితే గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనులు చేస్తూ అనంతపురం దూసుకు వెళ్తా ఉంది. అనంతపురం జిల్లాలో ఎక్కడ చూసినా కరువు ఉంటుంది.చేయడానికి పనులు ఉండవు.వ్యవసాయం చేసిన అర కొర మాత్రమేఉంటుంది. అలాంటి సమయంలో ఇక్కడ ప్రజలకు పనులు దొరకవు.అయితే ఉపాధి హామీ పథకం అమలులోకి వచ్చినప్పుడు నుంచి అనంతపురం జిల్లాలో ఎక్కువగా ఉపాధి హామీ పథకానికి వెళ్తున్నారు.

తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం గత నాలుగు సంవత్సరాలలో కేవలం ఉమ్మడి అనంతపురం జిల్లాకే రూ.1,076 కోట్ల నిధులు పనులు చేసే వారి ఖాతాలోకి జమయ్యాయి. ఇంత పెద్ద మొత్తంలో అమౌంటు జమ అయ్యిందంటే పనులలో పురోగతి ఎంతుందో మనం గమనించవచ్చు. అయితే ప్రభుత్వం సంవత్సరంలో వంద రోజులు ఉపాధి హామీ పథకంలో భాగంగా పని కల్పించడంతో అనంతపురంలోని కూలీలకు పనులు దొరుకుతున్నాయి.

ఇది చదవండి: బెజవాడలో బెస్ట్ స్వీట్ ఇదే..! ఈ టేస్ట్ మరెక్కడా దొరకదు..!

 మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం ఎంతోమంది కుటుంబాల్లో వెలుగు నింపుతోంది.వారికి ఇతర రాష్ట్రాలకు మరియు ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లకుండా వారి ప్రాంతాల్లోనే పని కల్పించడంతో చాలామందికి ఉపయోగంగా ఈ పథకం ఉంది. ప్రస్తుతం ఈ ఉపాధి హామీ పథకం పనులు చేస్తున్నారు. దీనితో ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లే కూలీలు తగ్గిపోయారు. వారి సొంత ఊర్లోనే పనులు చేసుకుంటూ కుటుంబానికి దగ్గరగానే జీవిస్తున్నారు.నిజంగా ఈ పథకాన్ని అనంతపురం జిల్లా వాసులు చక్కగా వినియోగించుకుంటున్నారు.

First published:

Tags: Anantapuram, Andhra Pradesh, Local News

ఉత్తమ కథలు