హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Andhra Pradesh: అన్ని పోటీ పరీక్షలకు ఫ్రీ కోచింగ్

Andhra Pradesh: అన్ని పోటీ పరీక్షలకు ఫ్రీ కోచింగ్

X
విద్యార్థులకు

విద్యార్థులకు ఉచితంగా కోచింగ్

Andhar Pradesh: అనంతపురం జిల్లాలో గల డిస్టిక్ పోలీస్ హెడ్ క్వార్టర్​ కమ్యూనిటీ హాల్ నందు జిల్లా ఎస్పీ ఫకీరప్ప పేద పిల్లలకు, ఆసక్తిగల విద్యార్థులకు, సివిల్ సర్వీస్‌కి ప్రిపేర్ అయ్యేవారికి ఫ్రీ కోచింగ్ ఇప్పిస్తున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

G.Venkatesh, News 18, Ananthapur

అనంతపురం జిల్లాలో గల డిస్టిక్ పోలీస్ హెడ్ క్వార్టర్​కమ్యూనిటీ హాల్ నందు జిల్లా ఎస్పీ ఫకీరప్ప పేద పిల్లలకు,ఆసక్తిగల విద్యార్థులకు, సివిల్ సర్వీస్‌కి ప్రిపేర్ అయ్యేవారికి ఫ్రీ కోచింగ్ ఇప్పిస్తున్నారు. అంతేకాక స్టేట్ సర్వీస్ అయిన గ్రూప్ వన్, గ్రూప్ టు, ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు స్టడీ హాల్ మరియు లైబ్రరీ సదుపాయం కూడా కల్పించారు. రాష్ట్రంలో ఎక్కడ ఇలాంటి సదుపాయాలు లేవు. అంతేకాక అనంతపురం జిల్లా ఎస్పీ గారు ఎంతోమంది పేద పిల్లలకు ఇలాంటి సదుపాయం కల్పించారు.

వారి జీవితాలను తీర్చిదిద్దుతున్నారు. దాదాపుగా వంద నుంచి 150 మంది విద్యార్థులు స్టడీ హాల్ కు వెళ్తున్నారు. లైబ్రరీ ఏర్పాటు చేసి సివిల్ సర్వీస్ మరియు పోలీస్ డిపార్ట్మెంట్, బ్యాంక్ జాబ్స్ , స్టేట్ సర్వీస్ ఆయన గ్రూప్ వన్ గ్రూప్ టు అభ్యర్థులకు మంచి కోచింగ్ కావాలంటే హైదరాబాద్ మరియు విశాఖపట్నం ఇలాంటి దూర ప్రాంతాలకు వెళ్ళవలసి ఉంటుంది, దగ్గర్లో ఎలాంటి నాణ్యతమైన కోచింగ్‌ను అందించేవారు కాదు, అలా వారి ఆర్థికంగా కూడా చాలా ఇబ్బంది పడేవారు, కానీ ఇప్పుడు ఎస్పీ గారు వారికి అండగా నిలుస్తున్నారు. రైల్వే అభ్యర్థులకు మరియు అన్ని రకాల స్టాండర్డ్ బుక్స్ ఇంగ్లీష్ మీడియం, మరియు తెలుగు మీడియంలో ఎస్పీ లైబ్రరీలో అందుబాటులో ఏర్పాటు చేశారు.

అంతేకాక వారికి డిజిటల్ లైబ్రరీ కూడా ఏర్పాటు చేశారు, దీనిలో ఆన్లైన్ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయవచ్చు, మరియు ప్రతి వారంలో ఒకసారి ఎగ్జామ్ కండక్ట్ చేసి వారి నైపుణ్యాలలో మెరుగుపరుస్తున్నారు. అంతేకాక ఈ లైబ్రరీ కి వచ్చే అభ్యర్థులకు సహాయార్థం మరియు వారి సందేహాలను తీర్చడానికి ప్రత్యేకించి ఒక ఇన్చార్జిని కూడా నియమించారు.వారికి ఎటువంటి ఇబ్బంది కలిగిన మరియు స్టాండర్డ్ బుక్స్ లేకపోయినా మరియు ఇతర ఇన్ఫర్మేషన్ కొరకు ఇన్చార్జ్ పనిచేస్తూ ఉంటారు.

అనంతపురం జిల్లా మరియు శ్రీ సత్యసాయి జిల్లాలోని ఎంతోమంది కి ఇదొక సువర్ణ అవకాశం. సివిల్ సర్వీస్ వారికి ఢిల్లీ నుంచి సివిల్ సర్వీస్ క్లాసులు ఆన్లైన్ ద్వారా తరగతుల నిర్వహిస్తున్నారు. అలాగే నోటీసు బోర్డు ఏర్పాటు చేసి ఏదైనా డిపార్ట్మెంట్ నుంచి జాబ్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ అందుబాటులో పొందుపరుస్తారు. ఎస్పీ గారికి ఇక్కడ చదువుతున్న అభ్యర్థులు ఎంతో రుణపడి ఉంటామని తెలియజేశారు, మాకందరికీ ఎస్పీ గారు కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని తెలిపారు.

First published:

Tags: Anantapuram, Andhra Pradesh, Local News

ఉత్తమ కథలు