హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Ananthapur: జాతీయస్థాయి ఫుట్బాల్ పోటీలకు అనంతపురం క్రీడాకారులు ఎంపిక

Ananthapur: జాతీయస్థాయి ఫుట్బాల్ పోటీలకు అనంతపురం క్రీడాకారులు ఎంపిక

జాతీయ స్థాయి క్రీడాపోటీలు

జాతీయ స్థాయి క్రీడాపోటీలు

Andhra Pradesh: జాతీయస్థాయి ఫుట్బాల్ కు ఎంపికైన అనంతపురం క్రీడాకారులు. అనంతపురం జిల్లా నుంచి ఈ మధ్యకాలంలో అనేకమంది క్రీడాకారులు వివిధ పోటీలలో రాణిస్తున్నారు. క్రికెట్, వాలీబాల్, మరియు ఇతర క్రీడల్లో కూడా అనంతపురం క్రీడాకారులు ముందుకు దూసుకెళ్తున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

(G.Venkatesh, News 18, Ananthapur)

జాతీయస్థాయి ఫుట్బాల్ కు ఎంపికైన అనంతపురం క్రీడాకారులు. అనంతపురం జిల్లా నుంచి ఈ మధ్యకాలంలో అనేకమంది క్రీడాకారులు వివిధ పోటీలలో రాణిస్తున్నారు. క్రికెట్, వాలీబాల్, మరియు ఇతర క్రీడల్లో కూడా అనంతపురం క్రీడాకారులు ముందుకు దూసుకెళ్తున్నారు. ఈ తరుణంలోనే అనంతపురం జిల్లా నుంచి ఫుట్బాల్ కు జాతీయస్థాయిలో ఎంపికయ్యారు. ముఖ్యంగా అనంతపురంలో బాల,బాలికలకుక్రీడల ప్రకారంగా మంచి ప్రోత్సాహం లభిస్తోంది.

ఇటీవల కడప జిల్లా ఎర్రగుంట్లలో జరిగిన 66వ రాష్ట్రస్థాయి ఎస్ జి ఎఫ్ అండర్- 17 ఫుట్బాల్ ఫుట్బాల్ పోటీలలో అనంతపురం జిల్లా కు చెందిన క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, ఎస్ జి ఎఫ్ జాతీయస్థాయి ఫుట్బాల్ పోటీలకు అనంతపురం నుంచి ఎంపికయ్యారు. బాలికల విభాగంలో అనంతపురంకి చెందిన అనూష, కీర్తి, మధు, బాలుర విభాగంలో రిషి తేజ, నందకిషోర్ ఎర్రగుంట్ల జరిగిన ఫుట్బాల్ పోటీలలో పాల్గొని అక్కడ అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించారు.

దీంతోవీరిని జాతీయస్థాయి ఫుట్బాల్ కు పోటీలకు ఎంపిక చేశారు. జాతీయస్థాయిలో కూడా వీరు మంచి ప్రతిభ కనబరచాలని పోటీలలో విజయం సాధించాలని వారి తల్లిదండ్రులు ఆకాంక్షిస్తున్నారు. అలాగే జాతీయస్థాయి ఫుట్బాల్ కు ఎంపికైన క్రీడాకారులను, అనంతపురం జిల్లా డీ ఈ వో కృష్ణయ్య, ఎస్ జి ఎఫ్ అనంతపురం జిల్లా కార్యదర్శి రవికుమార్, జిల్లా కోఆర్డినేటర్ నాగరాజు, అనంతపురం జిల్లా పిడి నాగరాజు, వేణు, రమేష్ ,శివ, ప్రకాష్ రెడ్డి, లోకేష్ వీరిని అభినందించారు వీరికి ఎలాంటి సహాయ సహకారులైన అందిస్తామని, వారు జాతీయ స్థాయిలో మంచి ప్రతిభ కనబరిచి విజయం సాధించాలనితెలిపారు.

First published:

Tags: Anantapuram, Andhra Pradesh, Local News

ఉత్తమ కథలు