హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Andhra Pradesh: అనంతపురంలో కొరియా వస్తువులు

Andhra Pradesh: అనంతపురంలో కొరియా వస్తువులు

X
అందుబాటులో

అందుబాటులో కొరియా వస్తువులు

Andhra Pradesh: శ్రీ సత్యసాయి జిల్లాలోని పెనుగొండ మండలంలోకియా పరిశ్రమ కలదు. ఇది దక్షిణ కొరియా దేశానికి సంబంధించిన కార్ల పరిశ్రమ. ఈ పరిశ్రమ నిర్మించిన అతి కొద్దికాలంలోనేతన కార్ల మోడల్స్ మరియు ఫీచర్స్ తో అద్భుతంగాగుర్తింపు పొందింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

G.Venkatesh, News 18, Ananthapur

శ్రీ సత్యసాయి జిల్లాలోని పెనుగొండ మండలంలోకియా పరిశ్రమ కలదు. ఇది దక్షిణ కొరియా దేశానికి సంబంధించిన కార్ల పరిశ్రమ. ఈ పరిశ్రమ నిర్మించిన అతి కొద్దికాలంలోనేతన కార్ల మోడల్స్ మరియు ఫీచర్స్ తో అద్భుతంగాగుర్తింపు పొందింది. అయితే మన రాష్ట్రంలో పెనుగొండ మండలం లో నిర్మించిన ఈ కియా పరిశ్రమలో సంవత్సరానికి మూడు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు కారు ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది.

ఈ పరిశ్రమ రావడం వల్ల కూడా చుట్టుపక్కల గ్రామాలలో చాలామందికి యువతకు ఉపాధి కలిగిందిదాదాపుగా స్థానికులు ఏడు వేల మందిని ఇక్కడ పని చేస్తూ ఉంటారు. వాటితో పాటు తమిళనాడుకు చెందిన చాలామంది ఇక్కడ పని చేస్తూ ఉంటారు. అయితే ఈ కార్ల పరిశ్రమ దక్షిణ కొరియా దేశానికి చెందినది కాబట్టి ఆ ప్రాంతం నుంచి ఆ దేశం నుంచి కొరియా వారు చాలామంది ఇక్కడ పని చేస్తూ ఉంటారు. వారితో పాటు వారి కుటుంబాలు కూడా ఇక్కడే స్థిరపడి ఉన్నాయి.

అయితే వారి ఆహారపు అలవాట్లు మనకు చాలా భిన్నంగా ఉంటాయి. వారు ఇక్కడ ఉన్న ఆహారం తినలేరు. అయితే వారి కోసం దక్షిణ కొరియా నుంచి వస్తువులను దిగుమతి చేసుకొని ఇక్కడ స్థానికంగా స్టోర్ను ఏర్పాటు చేసుకున్నారు. వాటిలో భాగంగా పెనుగొండ మండలం లో seoul స్టోర్లో చాలా వస్తువులు అందుబాటులో ఉంటాయి.

మనం వాటి గురించి తెలుసుకుందాం. కొరియర్ దేశస్తులు ఎక్కువగా నాన్వెజ్ ఇష్టపడతారని పనిచేసే మేనేజర్ తెలిపాడు అయితే ఈ షాప్ లోకాస్మోటిక్స్ఫేస్ వాష్ ఫేస్ క్రీమ్స్ మరియు బాడీ లోషన్స్ మొదలై కొరియా నుంచి దిగుమతి చేసుకుని అమ్ముతామని తెలిపాడుమరియు నాన్ వెజ్ లో భాగంగా ఇక్కడ చికెన్ పౌడర్, ఫిష్ పౌడర్, బీఫ్ పౌడర్. డ్రై ఫిష్పౌడర్రూపంలో ప్యాకెట్లలో దిగుమతి చేసుకునే ఇక్కడ లభిస్తాయి. వీటితో పాటు కొరియా దేశంలో తయారైన వెజిటేబుల్స్ కూడా మీరు దిగుమతి చేసుకొనిమరియు ఆ దేశం లో దొరికే కూల్ డ్రింక్స్ జూస్ మరియు బర్గర్ మరియు స్నాక్స్ మరియు బిస్కెట్స్ మరియు కిచెన్ కి సంబంధించిన వస్తువులు అన్నీ కూడా ఇక్కడ లభిస్తాయి అని తెలిపారు.

ముఖ్యంగా అక్కడ లభించే జూస్ చాలా టేస్ట్గా ఉంటాయని తెలిపారు. వాటిని కూడా మన దేశ ప్రజలు ఇష్టపడతారని మరియు ఈ రాష్ట్రంలో ఇక్కడ వారు కొనుగోలు చేస్తూ ఉంటారని నిర్వహాకులు తెలిపారు. ఈ షాప్ లో కొరియా వస్తువులు అన్నీ కూడా కొరియా నుంచి దిగుమతి చేసుకొని విక్రయిస్తున్నామని తెలిపారు.

First published:

Tags: Anantapuram, Andhra Pradesh, Local News

ఉత్తమ కథలు