(G.Venkatesh, News 18, Ananthapur)
అనంతపురం(Ananthapur)జిల్లా గుత్తి(Gutti)మండలంలో అఫ్జల్ ఖాన్ (Afzal Khan)ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. తను దివ్యాంగుడు (Disabled person)అయినా అధైర్యపడకుండా తన స్నేహితుడి సలహా మేరకు నగరంలోని రుడ్సెట్ వారిసహకారంతో వారు వివిధ రంగాల్లో ఇస్తున్న శిక్షణభాగంగా మొబైల్ రిపేర్(Mobile Repair)ఈ శిక్షణ తీసుకున్నాడు .శిక్షణ 30 రోజులు తీసుకున్న తర్వాత వారి సహకారంతో కొంత కొంత రుణ సదుపాయం ద్వారా కల్పించుకొని ఒక చిన్న షాపు గుత్తిలో ఆర్టీసీ బస్టాండ్(RTC Bus Stand)దగ్గర ఏర్పాటు చేసుకున్నాడు.
జ్ఞానమే అతని ముందు చూపు..
ఇతనికి సహాయంగా వాళ్ళ అన్న కూడా పనిచేస్తూ చేదోడు వాదోడుగా ఉన్నారు. ఇతను కూడా ఆర్థికంగా కుటుంబానికి అండగా నిలుస్తున్నారు. ఇతను పీజీ వరకు కూడా చదివారు. తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు ప్రిపేర్ అయ్యారు. అయితే ప్రభుత్వ ఉద్యోగం రాకపోవడంతో శిక్షణ తీసుకోవడానికి మొగ్గుచూపారు. శిక్షణలో భాగంగా మల్టిపుల్ ఫోన్ సర్వీసింగ్ లో మొబైల్ రిపేర్, ఈ సాఫ్ట్వేర్, అప్డేట్ పాస్వర్డ్ పీప్లేస్మెంట్ తది తర విభాగాలలో శిక్షణ తీసుకున్నాడు.
పట్టుదలే అతని అంగబలం..
అంతేకాకుండా ల్యాప్టాప్ రిపేర్ కూడా చేస్తానని తెలిపాడు. వీటితోపాటు చార్జింగ్, బ్లూటూత్ మరియు స్క్రీన్ గార్డ్ లాంటి అమ్ముతునాడు. ఇతనికి శిక్షణ సమయంలో భోజన సదుపాయం ఉచితంగా కల్పించినవారికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. రూడ్స్ సంస్థ ఇచ్చిన శిక్షణ వల్ల స్వయం ఉపాధి చేస్తూ కుటుంబానికి అండగా ఉంటున్నాని తెలిపాడు. రిపేర్లో భాగంగా ఎటువంటి డిఫెక్ట్ రాకుండాబ్యాక్ డ్రాప్ రాకుండారిపేర్ చేస్తానని తెలిపారు. తమఅన్న కూడా షాప్లో అన్ని విధాల సహాయంగా ఉన్నారని తెలిపారు.
రోల్ మోడల్ ..
ఇప్పుడుసరిపడా డబ్బుతో జీవనం సాగిస్తున్నామని తెలిపాడు సంస్థ తరుపునరుణసదుపాయం కల్పించిన బ్యాంకు వారికి రుణపడి ఉంటానని అంటున్నారు.అయితే ప్రభుత్వం పెద్ద మొత్తంలో రుణ సదుపాయం కల్పిస్తే తనలాంటి వారికి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించుకుని తన వంతు సహాయం చేస్తానని తెలిపారు.అంగవైకల్యం ఉందని బాధపడకు ధైర్యంగా స్వయం ఉపాధి కల్పించుకునేలాఅందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు ఈ అఫ్జల్ ఖాన్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anantapuram, Andhrapradesh, Local News