హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Love Failure: ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను అన్నాడు.. పాపం చివరికి ఇలా అయ్యిందేంటి..?

Love Failure: ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను అన్నాడు.. పాపం చివరికి ఇలా అయ్యిందేంటి..?

ప్రేమ విఫలమైందని కఠిన నిర్ణయం

ప్రేమ విఫలమైందని కఠిన నిర్ణయం

Love Failure: ప్రాణానికి ప్రాణంగా ఆమెను ప్రేమించాను అన్నాడు. ఆమె లేని జీవితం లేదనుకున్నాడు. కానీ తన ప్రేమను ప్రేయసి అంగీకరించకపోవడంతో.. తట్టుకోలేకపోయాడు. దీంతో ఆ బాధను తట్టుకోలేకపోయాడు.. చివరకు ఏం చేశాడంటే?

  • News18 Telugu
  • Last Updated :
  • Anantapur, India

G Venkatesh, News18, Anantapuram

ప్రేమ (Love) చాలా మధురమైంది.. ప్రేమలో ఉన్నంత కాలం.. స్వర్గంలో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది.. ప్రేమ కోసం ఏ చేయడానికైనా సిద్ధం అనేలా తయారు చేస్తుంది. ఒక్కసారి పీకల్లోతు ప్రేమలో మునిగితే చుట్టుపక్కల లోకంతో పనే ఉండదు.. కొందరికి అయితే  ఆకలి వేయదు.. నిద్ర రాదు.. ఇలా ప్రేమ  ఎంత హ్యాపీగా ఉంచుతుందో.. కానీ విఫలమైతే (Love Failure) విషాదం నింపుతోంది. తాజాగా శ్రీ సత్య సాయి జిల్లా (Sri Satya Sai District) లోని గోరంట్ల మండలంలో గల పాలసముద్రం గ్రామంలో ప్రేమ విఫలమై యువకుడు ఆత్మహత్య (Suicide) చేసుకున్నాడు. యువతని ప్రేమిస్తున్నాను చెప్పడంతో ఆమె ప్రేమను నిరాకరించింది, అయితే మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.

ఇటీవల కాలంలో  యువకులు ప్రతి చిన్న విషయానికి ఆత్మహత్య చేసుకోవడం అలవాటైపోయింది. అయితే కుటుంబానికి అండగా నిలవాల్సిన వయసులో ఇలా ఆత్మహత్య చేసుకోవడంతో ఆయా కుటుంబాలు అనాధలుగా మారుతున్నాయి.

ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో ఆత్మహత్యల సంఘటనలు పెరుగుతూనే ఉన్నాయి. అది కూడా చిన్న చిన్న కారణాలకే.. ప్రేమ నిరాకరించడంతో ఆత్మహత్య చేసుకోవడం.. కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్య చేసుకోవడం.. వివాహేతర సంబంధాల కారణంగా ఆత్మహత్య చేసుకోవడం, ఇలా ప్రతి చిన్న విషయానికి ఆత్మహత్యే గతి అనుకుంటున్నారు. నిండు నూరేళ్ల జీవవితాన్ని ముందే ముగించేసుకుంటున్నారు.

ఇదీ చదవండి : ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను అన్నాడు.. పాపం చివరికి ఇలా అయ్యిందేంటి..?

బిడ్లలను  తల్లిదండ్రులు ఎంతో గారాబంగా పెంచుకొని ఉంటారు. తీరా ఆ తల్లిదండ్రులకు అండగా ఉండాల్సిన సమయంలో..  యువత ఆత్మహత్య చేసుకోవడం విష్మయం కలిగిస్తోంది.  తాజాగా నిన్న గోరంట్ల మండలం పాలసముద్రం గ్రామానికి చెందిన చెన్నప్ప, నాగమణి దంపతుల కుమారుడు ప్రభాకర్ (24) ప్రేమ విఫలమైందని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇదీ చదవండి: గంటా రీ ఎంట్రీతో అయ్యన్న ఫైర్.. ఎవడయ్యా గంటా.. లక్షల్లో ఒక్కడు.. అంటూ సంచలన వ్యాఖ్యలు

ప్రభాకర్ పెనుగొండ మండలంలోని కియా పరిశ్రమలో ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడు. ఉద్యోగం చేస్తూ కుటుంబానికి అండగా ఉండేవాడు. ఇటీవల అతడు ఒక అమ్మాయిని ప్రేమించాడు.. ఆ విషయం ఆ అమ్మాయికి తెలపడంతో ఆమె ప్రేమను నిరాకరించింది.  మనస్థాపానికి గురై ఆవేదనతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇదీ చదవండి: జగన్ సర్కార్ కు షాక్.. గవర్నర్ ను కలిసిన ఉద్యోగ సంఘాలు.. సంచలన వ్యాఖ్యలు

కొడుకు దూరమవడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది, చేతికి అందిన కొడుకు ఇలా ఆత్మహత్య చేసుకుని దూరం అవడంతో వారిని ఓదార్చడం ఎవరికీ సాధ్యం కావడం లేదు.  ఒక్కసారి ఇలాంటి ఆత్మహత్యలు చేసుకునే ముందు యువత ఒకసారి ఆలోచించుకోవాలి..  వారి మీద కుటుంబాలు ఆధారపడి ఉంటాయని గుర్తుంచుకోవాలి. ఈ సంఘటనపై తండ్రి చెన్నప్ప ఫిర్యాదు  మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఏఎస్ఐ మద్దిలేటి తెలిపారు.

First published:

Tags: Anantapuram, Andhra Pradesh, AP News, Crime news, Local News

ఉత్తమ కథలు