హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Republic Day: ఘనంగా రిపబ్లిక్ డే ఉత్సవాలు.. వారందరికీ సత్కారం..

Republic Day: ఘనంగా రిపబ్లిక్ డే ఉత్సవాలు.. వారందరికీ సత్కారం..

ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు

ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు

Republic Day: దేశవ్యాప్తంగా ఘనతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక ఏపీలోనూ వేడుకలు అంబరాన్ని అంటాయి. అనంతపురం జిల్లాలో సంఘ సేవకులను గుర్తించి వారికి సన్మానాలు చేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Anantapur, India

G Venkatesh, News18, Anantapuram

భారత దేశ వ్యాప్తంగా ఘనతంత్య్ర దినోత్సవ వేడుకలు (Republic Day Celebrations) ఘనంగా జరుగుతున్నాయి. ఇక ఏపీలో  వేడుకలు అంబరాన్ని అంటుతున్నాయి. అనంతపురం జిల్లా (Anantapuram District) లోని జిల్లా పోలీస్ కార్యాలయంలోని పరేడ్ మైదానంలో 74వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ (District Collector Naga Lakshmi Selvarajan) ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతకాన్ని ఆవిష్కరించి, జాతీయ జెండాకు గౌరవ వందనం చేశారు. జిల్లా కలెక్టర్ తో కలిసి జిల్లా ఎస్పీ ఫకీరప్ప జాతీయ జెండాకు గౌరవ వందనం చేశారు.  పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. జిల్లాలో ఉన్న ప్రముఖులతో పాటు.. విద్యార్థులు... వివిధ వర్గాల వారు ఈ వేడుకలకు హాజరయ్యారు.

జిల్లాకు చెందిన స్వతంత్యసమరయోధుల కుటుంబ సభ్యులకు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ శాలువాతో సత్కరించారు. ఉత్తమ సేవలందించిన వివిధ శాఖల సిబ్బందికి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ప్రశంసా పత్రాలు అందజేశారు. దీనిలో భాగంగా రాయదుర్గం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వి యుగంధర్ కూడా జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ నుండి ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.

జెండా వందనం తర్వాత అదేవిధంగా కవాతును నిర్వహించినటువంటి వివిధ విభాగాలకు చెందినటువంటి ఏఆర్ ఫోర్స్, హోం గార్డ్స్, ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ అద్భుతమైన కవాతును నిర్వహించారు. కవాతు అనంతరం జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన నిర్వహించినటువంటి కార్యక్రమాలు అద్భుతంగా ప్రదర్శన చేయడం జరిగింది. ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో కర్ర సాము, పిరమిడ్స్ మరియు దేశభక్తి గీతాలు అయినటువంటి దేశభక్తి గీతాలతో నృత్యాలతో అలరించడం జరిగింది.

ఇదీ చదవండి : రేపటి నుంచి యువగళం.. తిరుమల క్యూ లైన్ లో లోకేష్ ను వెయిట్ చేయించారా..?

డాగ్ స్క్వాడ్ కు చెందినటువంటి జాగిలాలు వాటి యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించడం జరిగింది. అలాగే కవాతులు మంచి ప్రదర్శ కనబరిచినటువంటి వారికి బహుమతి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వివిధ ప్రభుత్వ శాఖలకు చెందినటువంటి ఉద్యోగులకు ప్రతిభా అవార్డులను ప్రదానం చేయడం జరిగింది. అదేవిధంగా వివిధ ప్రభుత్వ శాఖలకు చెందినటువంటి శకటాలు పాల్గొన్నాయి. పెరేడ్ గ్రౌండ్లో భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.

First published:

Tags: Anantapuram, Andhra Pradesh, AP News, Local News

ఉత్తమ కథలు