జేసీ దివాకర్ రెడ్డి భారీ షాక్ ఇచ్చిన ఏపీ పోలీసులు...

పోలీసులపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన టీడీపీ మాజీ ఎంపీ జెసీ దివాకర్ రెడ్డిపై అనంతపురం పోలీసులు కేసు నమోదు చేశారు.

news18-telugu
Updated: December 20, 2019, 9:36 PM IST
జేసీ దివాకర్ రెడ్డి భారీ షాక్ ఇచ్చిన ఏపీ పోలీసులు...
టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి(ఫైల్ ఫోటో)
  • Share this:
పోలీసులపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన టీడీపీ మాజీ ఎంపీ జెసీ దివాకర్ రెడ్డిపై అనంతపురం పోలీసులు కేసు నమోదు చేశారు. మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బూట్లు నాకే పోలీసులను పెట్టుకుంటానంటూ జెసీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై మండిపడ్డ పోలీసు అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు త్రిలోక్.. టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి పై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. జెసీపై 153, 506 సెక్షన్ల కింద అనంతపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. జెసీ దివాకర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలపై సమగ్ర విచారణ చేస్తున్నామని, ఆయనపై చాలా ఫిర్యాదులు అందాయని, 153, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డి తెలిపారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: December 20, 2019, 9:36 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading