అనంతలో రైతుకు దొరికిన రూ.కోటి విలువైన వజ్రం?

అనంతపురం జిల్లాలో ఓ రైతుకు తన పొలంలో రూ.కోటి విలువైన వజ్రం దొరికినట్టు ప్రచారం జరుగుతోంది.

news18-telugu
Updated: May 23, 2020, 5:17 PM IST
అనంతలో రైతుకు దొరికిన రూ.కోటి విలువైన వజ్రం?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అనంతపురం జిల్లాలో ఓ రైతుకు తన పొలంలో రూ.కోటి విలువైన వజ్రం దొరికినట్టు ప్రచారం జరుగుతోంది. అనంతపురం జిల్లా బత్తలపల్లికి చెందిన ఓ రైతుకు నాలుగు రోజుల క్రితం తన పొలంలో ఓ వజ్రం దొరికినట్టు తెలిసింది. ఆ వజ్రాన్ని రైతు ఓ వ్యాపారికి చూపించాడు. వీలైనంత త్వరగా దాన్ని విక్రయించడానికి రైతు పడుతున్న తొందరను గమనించిన ఆ వ్యాపారి ఆ వజ్రానికి రూ.30 లక్షలు చెల్లించి కొనుగోలు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే, బహిరంగ మార్కెట్లో ఆ వజ్రం విలువ రూ.కోటికి పైగానే ఉంటుందని కొందరు చెబుతున్నారు. రైతుకు పొలంలో వజ్రం దొరికిన విషయం దావానలంలా గ్రామంలోపాకిపోయింది. కొందరు దీనిపై ప్రభుత్వఅధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారం గుత్తి తహసీల్దార్ వద్దకు చేరింది. ఆయన ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. దీనిపై ప్రభుత్వ అధికారులు ప్రశ్నించగా, తనకు ఎలాంటి వజ్రం దొరకలేదని, ఎవరో కొందరు తన మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని అధికారులకు చెప్పినట్టు తెలిసింది. ఒకవేళ రైతుకు దొరికినా బయట అమ్మేసుకున్నట్టు తమ విచారణలో తేలితే అతడి మీద చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ హెచ్చరించారు.
First published: May 23, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading