Home /News /andhra-pradesh /

ANANDAYYA SUGGEST DO NOT EAT NON VEG ATLEAST ONE WEEK AFTER TAKING HIS MEDICINE SSR

Anandayya Medicine: ఆనందయ్య మందు తీసుకున్న వాళ్లు పొరపాటున కూడా దాన్ని తినకండి.. తినొద్దని ఆయనే చెప్పారు..

ఆనందయ్య, ఆయన తయారు చేసిన మందు

ఆనందయ్య, ఆయన తయారు చేసిన మందు

ఈ సందర్భంగా.. ఇంటి వద్దే ఆనందయ్య మందును బాధితులు తీసుకునే అవకాశం ఉండటంతో మందును తీసుకునే కోవిడ్ బాధితులకు ఆనందయ్య కీలక సూచన చేశారు. తాను తయారుచేసిన ఈ మందు తీసుకున్న వారు వారం రోజుల వరకూ...

    నెల్లూరు: నిన్నమొన్నటి దాకా అదొక చిన్న గ్రామం. నెల్లూరు జిల్లాలోని ఆ గ్రామం గత కొద్దిరోజులుగా వార్తల్లో నిలిచింది. కరోనాకు విరుగుడు మందును పంపిణీ చేస్తున్న గ్రామంగా వార్తల్లోకెక్కింది. ఆ గ్రామమే కృష్ణపట్నం. ఈ గ్రామానికి చెందిన ఆనందయ్య అనే ఒక సామాన్యుడు సోషల్ మీడియాలో, మీడియాలో చర్చనీయాంశంగా మారాడు. ఆయన చుట్టూ ఎన్నో వివాదాలు కూడా చుట్టుముట్టాయి. ఆనందయ్యను అరెస్ట్ చేశారని వార్తలు రాగానే సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. కరోనా నుంచి కాపాడేందుకు వచ్చిన బోధిధర్మ ఆనందయ్య అని, ఆయనను అరెస్ట్ చేయడమేంటని నెటిజన్లు మండిపడ్డారు. కొన్ని రోజులు కరోనాకు విరుగుడుగా ఆనందయ్య ఇస్తున్న మందు పంపిణీకి కూడా బ్రేక్ పడింది. ఇలాంటి.. ఎన్నో నాటకీయ పరిణామాల అనంతరం.. మళ్లీ ఇన్ని రోజులకు ఆనందయ్య మందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో.. ఆయన తయారుచేసే మందును పంపిణీ చేసేందుకు నెల్లూరు జిల్లా అధికార యంత్రాంగం సిద్ధమైంది. కృష్ణపట్నం గ్రామానికి గతంలో మాదిరిగా తండోపతండాలుగా కరోనా బాధితులు, వారి సన్నిహితులు వస్తే వైరస్ మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో ఆనందయ్య మందును ఆన్‌లైన్‌లో పంపిణీ చేయనున్నట్లు నెల్లూరు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా మొబైల్ యాప్‌ను రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు.

    ఈ సందర్భంగా.. ఇంటి వద్దే ఆనందయ్య మందును బాధితులు తీసుకునే అవకాశం ఉండటంతో మందును తీసుకునే కోవిడ్ బాధితులకు ఆనందయ్య కీలక సూచన చేశారు. తాను తయారుచేసిన ఈ మందు తీసుకున్న వారు వారం రోజుల వరకూ నాన్‌వెజ్‌కు దూరంగా ఉండాలని ఆనందయ్య స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో నాన్‌వెజ్ తినవద్దని ఆయన సూచించారు. ఒకవేళ పొరపాటున తమ మందు తీసుకున్న వారు నాన్‌వెజ్ తింటే దానివల్ల దుష్ప్రభావాలు వచ్చి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఆనందయ్య తెలిపారు. ఉచితంగా కరోనాకు మందు అందించడంపై కూడా ఆయన స్పందించారు. తొలుత తమ కుటుంబం లక్ష రూపాయలు వెచ్చించి మందు తయారుచేశామని.. ఆ తర్వాత గ్రామస్తుల సహకారంతో మందును అందించామని.. ప్రస్తుతం స్పాన్సర్స్ కూడా ముందుకు రావడంతో ఉచితంగా ఇంతమందికి మందును అందించగలుగుతున్నట్లు చెప్పారు.

    ఇది కూడా చదవండి: Anandayya Medicine: ఆనందయ్య కరోనా మందుపై గుడ్‌న్యూస్.. ఇకపై అందరికీ ఎలా ఇస్తారంటే..

    కరోనాకు ఇస్తున్న మందును గతంలో కూడా ఇతర అనారోగ్య సమస్యలకు విరుగుడుగా ఇవ్వడం జరిగిందని, పాము కరిచినా.. తేలు కరిచినా.. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ ఉన్నా ఈ మందును ఇవ్వడం ద్వారా వారు కోలుకున్నట్లు ఆనందయ్య తెలిపారు. కంట్లో వేస్తున్న చుక్కల మందును 16 సంవత్సరాల క్రితం నుంచే ఇవ్వడం జరిగిందని.. వనమూలికలతో తయారుచేసిన మందు కావడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు రాలేదని ఆయన చెప్పారు. ఆనందయ్య స్వగ్రామమైన కృష్ణపట్నం సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలో ఉంది.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Corona, Corona second wave, Covid -19 pandemic, Nellore

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు