ANANDAIAH SON SRIDHAR STARTED PREPARATION OF CORONA AYURVEDA MEDICINE IN TIRUPATI MLA CHEVIREDDY WILL DISTRIBUTE TO EVERY HOUSE SK
Anandaiah Medicine: తిరుపతిలో ఆనందయ్య మందు తయారీ.. ఇంటింటికి పంపిణీ.. వాళ్లకు మాత్రమే
ఆనందయ్య
తిరుపతిలో కూడా ఆనందయ్య పంపిణీకి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే మందు తయారీ ప్రక్రియ ప్రారంభమయింది. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలోని నారాయణ గార్డెన్స్‌లో కరోనా ఆయుర్వేద మందును తయారు చేస్తున్నారు
కృష్ణపట్నంలో ఆనందయ్య మందు పంపిణీ ఎప్పటి నుంచి మొదలవుతుంది? ఎంత మందికి ఇస్తారు? ఏపీ, తెలంగాణలో ఇప్పుడు దీని గురించే చర్చించుకుంటున్నారు. కానీ మందు పంపిణీపై ఇప్పటి వరకూ క్లారిటీ లేదు. ఐతే ఆదివారం పరిమిత సంఖ్యలో కొంత మందికి మందును పంపిణీ చేశారు. ఆనందయ్య సోదరుడి ఆధ్వర్యంలో మందు పంపిణీ జరిగింది. రేపటి నుంచి మిగతా పూర్తి స్థాయిలో మందు పంపిణీ జరుగుతుందని ఆనందయ్య అనుచరులు చెప్పారు. మొదట సర్వేపల్లి ప్రజలకు మాత్రమే ఇస్తారు. మందుకోసం వచ్చిన వారు ఆధార్ కార్డు చూపించాల్సి ఉంటుంది. ఐతే రోజుకు 2వేల కంటే ఎక్కువ మందికి ఇవ్వలేనని ఆనందయ్య చెప్పినట్లు తెలుస్తోంది.
మరోవైపు తిరుపతిలో కూడా ఆనందయ్య పంపిణీకి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే మందు తయారీ ప్రక్రియ ప్రారంభమయింది. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలోని నారాయణ గార్డెన్స్‌లో కరోనా ఆయుర్వేద మందును తయారు చేస్తున్నారు. ఆనందయ్య కుమారుడు శ్రీధర్ మందు తయారీని పర్యవేక్షిస్తున్నారు. మరో రెండు రోజుల్లో చంద్రగిరి నియోజకవర్గ ప్రజలందరికీ మందును పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే చెవిరెడ్డి తెలిపరు.
''చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో లక్షాల 60వేల కుటుంబాలున్నాయి. 5లక్షల 20వేల మంది ప్రజలున్నారు. ఒక ఇంటిలో 5 మందికి సరిపడా మందును ఇస్తాం. కరోనా రాకుండా వ్యాధినిరోధక శక్తిని పెంచే P మందు (ప్రివెంటివ్ మెడిసిన్) మాత్రమే ఇక్కడ తయారు చేస్తున్నాం. చుట్టుపక్కల పల్లెల నుంచి వనమూలికలు తెప్పించాం. అరకు నుంచి తేనెను తీసుకొచ్చాం. మందు తయారీ ప్రక్రియ కొనసాగుతోంది. బఠాణి గింజంత సైజులోనే మందు ఇస్తాం. ఒక్కొక్కరు రెండు పూటలు వేసుకోవాల్సి ఉంటుంది. నా నియోజకవర్గ పరిధిలోని ప్రజలందరికీ ఉచితంగానే పంపిణీ చేస్తాం. ఎవరికీ ఇక్కడకు రాకూడదు. ప్లాస్టిక్ కవర్లో పెట్టి మేమే ఇంటింటికీ పంచుతాం. సీఎం జగన్ అనుమతులతోనే మందును తయారీ చేస్తున్నాం.'' అని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు.
మరోవైపు ఆనందయ్య మందును ఆన్లైన్లో పంపిణీ చేసేందుకు వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెస్తారని మొదట ప్రచారం జరిగింది. Childeal.com వెబ్సైట్ ద్వారా పంపిణీ చేస్తారని సోషల్ మీడియా కోడై కూసింది. ఐతే అందులో నిజం లేదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. అది ఫేక్ వెబ్సైట్ అని తెలిపింది. ఈ నేపథ్యంలో తమకు మందు ఎప్పుడు దొరుకుతుందోనని ఇతర ప్రాంతాల ప్రజలు నిరుత్సహానికి గురవుతున్నారు. ఇక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కేవలం తమ నియోజకవర్గ ప్రజల కోసమే మందును తయారుచేయిస్తుండడంపైనా విమర్శలు వస్తున్నాయి.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.