తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఆనందయ్య గురించే చర్చ జరుగుతోంది. ఆనందయ్య ఆయుర్వేద మందుపై పరిశోధనలు ఎంత వరకు వచ్చాయి? ప్రభుత్వానికి నివేదిక ఎప్పుడు అందుతుంది? ఆయన మందు పంపిణీ ఎప్పుడు ప్రారంభం అవుతుంది? అసలు ఇప్పుడు అనందయ్య ఎక్కడున్నారు? ఇలా ఎన్నో ప్రశ్నలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కృష్ణపట్నం ఆనందయ్యపై సీపీఐ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన్ను ఏపీ ప్రభుత్వమే కిడ్నాప్ చేసిందని ఆరోపించారు. కార్పొరేట్ శక్తులకు లాభం చేకూర్చేందుకు ఆనందయ్య మందును పంపిణీ చేయకుండా అడ్డుపడుతున్నారని మండిపడ్డారు.
''ఆనందయ్యను ప్రభుత్వమే కిడ్నాప్ చేసింది. కార్పొరేట్‌ల కోసమే ఆయన్ను నిర్బంధించారు. ఆనందయ్యను ఎందుకు దౌర్జన్యంగా తీసుకెళ్లారు. ఆయన్ను మీడియా ముందు ప్రవేశపెట్టాలి. ఆనందయ్య కరోనా మందుకు ప్రభుత్వం ఎప్పటికీ అనుమతి ఇవ్వదు. రక్షణ పేరుతో వేధించడం మాత్రం సరికాదు. ఆయనకు విముక్తి కల్పించాలని పిటిషన్ వేస్తాం.'' అని నారాయణ పేర్కొన్నారు.
దాదాపు వారం రోజుల తరువాత ఆనందయ్యను పోలీసు భద్రతా వలయం నుంచి శుక్రవారం సాయంత్రం ఇంటికి పంపించారు. ఆ రోజు కృష్ణపట్నంలో స్థానికులు ఆందోళన చేశారు. ఆనందయ్యను వేధిస్తున్నారని పోలీసులపై మండిపడ్డారు. ఈ క్రమంలోనే శనివారం ఆయన్ను తిరిగి పోలీసుల భద్రతలోకి పంపించారు. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారో ఎవరికీ అర్ధం కావడం లేదు. ఆనందయ్యను తమ ఆధీనంలోకి తీసుకొని..కొందరు నేతలు మందును తయారు చేయించుకుంటున్నారని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు.కానీ ప్రజలకు పంచితే మాత్రం అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.
మరోవైపు కృష్ణపట్నంలో కరోనా కేసులు వస్తున్నాయన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆనందయ్య టీమ్‌లో పనిచేసే సిబ్బందితో పాటు కొందరు స్థానికులకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తెలిసింది. మొన్నటి వరకు అక్కడ కరోనా యాక్టివ్ కేసులు లేవు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా కేసులు బయటపడడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. ఆనందయ్య మందు కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచే కరోనా వ్యాప్తి చెంది ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి:
Anandaiah Medicine: కృష్ణపట్నం ఆనందయ్య మందుపై చిన్నజీయర్ స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు
Andhra Pradesh: కాలజ్ఞానం చెప్పిన కుటుంబంలో ఆధిపత్య పోరు.. పీఠాధిపతి ఎవరో బ్రహ్మయ్యకే ఎరుక
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anandaiah corona medicine, Andhra Pradesh, AP News, Ayurveda, CPI Narayana, Nellore