టీడీపీ అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీని వీడుతున్నారంటూ జరుగుతున్న ప్రచారానికి ఆజ్యం పోసే సంఘటనలు ఏపీలో జరుగుతున్నాయి. విశాఖలోని పార్టీ కార్యాలయంలో టీడీపీ జెండాలను అవంతి అనుచరులు తొలగించారు. రాత్రికి రాత్రి తన గన్ మెన్‌లను ఆయన రిటర్న్ పంపించేశారు. ఇక ఇవాళ అవంతి శ్రీనివాస్... సాయంత్రం లోటస్ పాండ్‌లో జగన్‌ను కలిసి వైసీపీలో చేరడమే మిగిలివుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అందుకు తగ్గట్టుగానే అవంతి హైదరాబాద్‌లోనే ఉన్నారు. అవంతితోపాటూ... మరో సిట్టింగ్ ఎమ్మెల్యేతోపాటూ... అమలాపురం ఎంపీ రవీంద్రబాబు కూడా వైసీపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. జగన్‌ను కలుస్తారని తెలుస్తోంది. ఇప్పటికే... చీరాల నుంచీ ఆమంచి కృష్ణమోహన్ వైసీపీకి దగ్గరయ్యారు. అంతకుముందు... దగ్గుపాటి ఫ్యామిలీ వైసీపీతో జట్టుకట్టింది. ఇలా ఒక్కొక్కరూ పార్టీకి దగ్గరవుతుంటే వైసీపీ అధినేత జగన్ క్యాంప్ కళకళలాడుతోంది.
ఒట్టు తీసి గట్టున పెట్టేశారా ? : రాజకీయ నాయకులు మాటపై నిలబడరు అనేందుకు ఎన్నో ఉదాహరణలు. తాజాగా అవంతి శ్రీనివాస్ కూడా అదే రూట్ ఫాలో అవుతున్నారు. గతేడాది డిసెంబర్‌లో స్వయంగా అవంతే ప్రెస్ మీట్ పెట్టి... తాను పార్టీ మారట్లేదనీ, ప్రచారాలన్నీ పుకార్లేనని తేల్చేశారు. తెలుగుదేశం పార్టీ ఎంపీగా తాను పార్లమెంట్‌లో విభజన హామీల అమలు కోసం పోరాడానని తెలిపిన అవంతి శ్రీనివాస్ రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్ వేదికగా పోరాటం చేస్తానని అన్నారు. ఉద్దేశపూర్వకంగా జరిగే ప్రచారాన్ని నమ్మొద్దని అభ్యర్థించారు. రెండు నెలలు కూడా గడవక ముందే... ప్లేట్ తిప్పేస్తున్నారు.
గత ఎన్నికల్లో అనకాపల్లి లోక్‌సభ నుంచి గెలిచిన అవంతి శ్రీనివాస్... భీమిలీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై వైసీపీ కూడా సానుకూలంగానే ఉన్నట్లు సమాచారం.
Video : ప్రధాని మోదీ ట్వీట్ కలిపింది ఇద్దరినీ... ఆన్‌లైన్‌లో ప్రేమించుకొని ఒక్కటైన జంట
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Tdp