Anand Mohan Pudipeddi, Visakhapatnam, News18.
Ganta Political Game: 2019 ఎన్నికల ఫలితాల తరువాత.. టీడీపీ (TDP) నుంచి నెగ్గిన గంటా శ్రీనివాసర రావు (Ganta Srinivasa Rao) .. అధికార వైసీపీ (YCP) లోకి వెళ్లే ప్రయత్నాలు చేశారు.. కానీ అప్పటి స్థానిక పరిస్థితుల నేపథ్యంలో.. గంటాకు డోర్స్ క్లోజ్ చేసింది వైసీపీ.. ఆయన వస్తాను అన్నా తీసుకోవడం లేదని.. వైసీపీ కీలక నేత విజయసాయి రెడ్డే (Vijayasai Reddy) బహిరంగంగా చెప్పారు.. కానీ ఇప్పుడు ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో పరిస్థితి రివర్స్ అయినట్టు కనిపిస్తోంది. అప్పుడు వద్దు అన్న వైసీపీ నేతలు.. ఇప్పుడు గంటాకు డోర్లు తెరిచారు.. ఘన స్వాగతం పలుకుతాం అంటున్నారు. ఇప్పటికే కొందరు వైైసీపీ కీలక నేతలు.. గంటాతో చర్చలు జరిపినట్టు సమాచారం.. మరి అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటి.. అప్పుడు వద్దు అనుకున్న గంటా అవసరం ఏమొచ్చింది.. దానికి ప్రధాన కారణం అదే..
వైసీపీ వద్దు అన్నతరువాత గంటా.. టీడీపీకి దూరంగా ఉంటూ.. సైలెంట్ గా కూర్చున్నారని అంతా భావించారు.. కానీ రాజకీయంగా పార్టీలకు దూరంగా ఉన్నా.. ఆయన చేయాల్సిన పనులు చక చకా చెక్కబెట్టారు. అందులో మొదటిది స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్ ను క్యాష్ చేసుకుంటూ.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ.. ఆ లేఖను స్పీకర్ కు పంపారు.. రాజీనామా ఆమోదించమని కోరుతున్నా.. ప్రస్తుతానికి పెండింగ్ లోనే ఉంది.
ఇక రెండో అతి ముఖ్యమైనది.. అది ఏంటంటే.. ఆయన ఖాళీగా ఉండకుండా.. రాష్ట్రంలోని కీలక కాపు నేతలను అందరినీ ఒకేవేదకిపై కలిసేలా చేశారు. ఎప్పటికప్పుడు కాపు నేతలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. అవసరమైతే కాపు పార్టీ పెట్టడానికి కూడా వెనుకాడకూడదనే ఆలోచన కలిగేలా.. వ్యవహారాన్ని నడిపించారు. ప్రస్తుతం కాపులందరినీ ఏకతాటిపైకి తీసుకురాగలిగే నేత తానే అనే అభిప్రాయాన్ని అన్ని పార్టీలకు కలిగేలా చేశారు. ఆయనకు మెగాస్టార్ చిరంజీవి మద్దతు ఉండడం కూడా ఒక కారణం.
ఇదీ చదవండి : కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయాన్ని వెంటాడుతున్న వివాదాలు.. వారిపై బదిలీ వేటు..!
అందుకే మాజీ మంత్రిపై ఇప్పుడు అన్నీ పార్టీలు ఫోకస్ పెట్టాయి. ప్రస్తుతం టీడీపీలో ఆయనకు పెద్దగా వాల్యూ ఉండడ లేదు.. సీటు ఇవ్వడం వరకు అయితే ఎలాంటి సమస్య ఉండదు.. కానీ జిల్లాపై పెత్తనం ఇప్పడున్న పరిస్థితుల్లో టీడీపీ నుంచి సాధ్యం కాదు.. అందుకే ఆయన మొన్నటి వరకు జనసేనలోకి వెళ్లాలని ఫిక్స్ అయినట్టు ప్రచారం జరిగింది. అయితే జనసేనలోకి వెళితే సీటుతో పాటు డిప్యూటీ సీఎం ఇవ్వడానికి పవన్ అంగీకరించారనే ప్రచారం జరిగింది. అయితే ఆయిన డిమాండ్లు ఇంకా ఎక్కువగానే ఉన్నాయని తెలుస్తోంది. ఇలా జనసేనతో బేరాలు జరుగుతున్న సమయంలో వైసీపీ నుంచి పిలుపు రావడంతో.. ఆయనకు డిమాండ్ పెరిగింది.
ఇదీ చదవండి: దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం కుట్ర.. లిక్కర్ స్కామ్‌పై వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
ప్రస్తుతం విశాఖలో వైసీపీకి అన్నీ ప్రతికూల పరిస్థితులే ఉన్నాయి. విశాఖను రాజధాని చేస్తామని చెబుతున్నా.. నాయకత్వ లేమి స్పష్టంగా కనిపిస్తోంది. నేతలను అంతా ఏకతాటిపైకి తేగల స్థానిక నాయకుడు లేడనే చెప్పాలి.. అందులోనే స్టీల్ ప్లాంట్ కార్మికులు అంతా వైసీపీకి వ్యతిరేకంగానే ఉన్నారు. దీంతో పాటు జనసేన వైపు కాపు ఓటర్లు చూస్తున్నారు.. ఇదే సమయంలో విశాఖ అర్బన్ లో టీడీపీ గట్టి పట్టు ఉంది.. ఈ అవరోధాలన్నీ దాటాలి అంటే.. గంటాలాంటి నేత అవసరం తప్పక వైసీపీ కనిపిస్తోంది. అందుకే ఆయన ఇప్పుడు వైసీపీ ముందు కూడా భారీగానే డిమాండ్లు పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. తనతో పాటు మరో ఇద్దరికి సీట్లు ఇవ్వాలని.. జిల్లా పార్టీ బాధ్యతలు తనకే అప్పచెప్పాలని కోరినట్టు సమాచారం.. మరి అధిష్టానం ఎలా స్పందిస్తుంది అన్నదానిపై గంటా పార్టీ మార్పు ఉంటుంది..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, AP Politics, Ganta srinivasa rao, Visakhapatnam