AN UNEMPLOYED MAN COMMITS SUICIDE FOR FINANCIAL REASONS IN HYDERABAD VB
Attempt to suicide: ఎస్ఎస్ స్సీ లో ఉద్యోగం అతడి లక్ష్యం.. చుట్టుముట్టిన ఆర్థిక సమస్యలు.. చివరకు దిల్ సుఖ్ నగర్ లో..
ప్రతీకాత్మక చిత్రం
Attempt to suicide: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో ఉద్యోగం సాధించాలని నగరానికి వచ్చిన ఓ యువకుడు ఆర్థిక కారణాలతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొలువు సాధించాలని వచ్చిన అతడిని కరోనా మహమ్మారి కాటికి పంపించింది. అసలేం జరిగిందంటే..
ఎన్నో కలలతో కొలువు కొట్టాలని హైదరాబాద్ లోని దిల్ సుఖ్ నగర్ లో కోచింగ్ కోసం నిరుద్యోగులు వస్తుంటారు. ఈ మధ్యన తెలంగాణ సీఎం కేసీఆర్ 50 వేల ఉద్యోగాలు త్వరలో భర్తీ చేస్తాం అని ప్రకటించగానే నగరానికి చాలామంది నిరుద్యోగులు కోచింగ్ తీసుకోవడానికి దారి కట్టారు. నోటిఫికేషన్ ఎప్పటికీ రాకపోవడంతో కొంతమంది ఇళ్లకు పయనపయ్యారు.. మరి కొంతమంది ఇక్కడే ఉంటూ పార్ట్ టైం ఉద్యోగం చేసుకుంటున్నారు. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ఉప్పెనలా ముంచుకొస్తోంది. చిన్న, పెద్ద, పేద, ధనిక తేడా లేకుండా అందరినీ ముంచేస్తోంది. కొన్ని సంస్థలు తమ ఉద్యోగులను తొలగించుకుంటుంటే మరి కొంతమంది సంస్థలనే మూసేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని పట్టుదలతో నగరానికి వచ్చిన ఓ వ్యక్తి ఆర్థిక ఇబ్బందులు తాలలేక తనువు చాలించాడు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
విజయవాడకు చెందిన లంకిశెట్టి సాయిచరణ్ (23) కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యం తో దిల్ సుఖ్ నగర్ లో కోచింగ్ కోసం ఫిబ్రవరి 3 న వచ్చాడు. ఇంజనీరింగ్ ను విజయవాడలో పూర్తి చేశాడు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో వివిధ ఉద్యోగాల భర్తీకి క్యాంలండర్ ను విడుదల చేస్తుంది. అందులో ఎదో ఒక కొలువు కొట్టాలనే ఆశతో నగరానికి వచ్చిన సాయి చరణ్ కోచింగ్ లో జాయిన్ అయ్యాడు. దాంతో పాటు ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్న సదరు వ్యక్తి పార్ట్ టైం జాబ్ లో చేరాడు. అది చేసుకుంటూ కోచింగ్ తీసుకుంటున్నాడు. కరోనా కారణంగా ఉద్యోగం పోయింది. నెల రోజుల నుంచి ఖాళీగానే ఉంటున్నాడు. కోచింగ్ సెంటర్లు కూడా కరోనా కారణంగా మూసేశాడు. దీంతో అతడికి ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. ఇంటివద్ద డబ్బులు అడుగుదాం అంటే వారి పరిస్థితి మంచిగా లేక తనలో తాను బాధపడ్డాడు.
ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న తన తండ్రిని డబ్బులు అడగలేక పోయాడు. తల్లిదండ్రులకు నేను ఇంటికి వస్తున్నాను అంటూ రెండు సార్లు ఫోన్ చేశాడు. అదే రోజు ‘నా చావుకు ఎవరూ కారణం కాదు’ అని సూసైడ్ నోట్ రాసి అతడు ఉంటున్న హాస్టల్ లోనే ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న సరూర్ నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరారు. వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై రవికుమార్ తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.