HOME »NEWS »ANDHRA PRADESH »ammonia gas leaked at a milk dairy in chittoor district bandapalli 12 people admitted in hospital all are safe ba

AP Gas Leak | ఏపీలో మరో గ్యాస్ లీక్ ఘటన.. ఈ సారి చిత్తూరు జిల్లాలో

AP Gas Leak | ఏపీలో మరో గ్యాస్ లీక్ ఘటన.. ఈ సారి చిత్తూరు జిల్లాలో
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం బండపల్లిలోని ఓ డెయిర్ ఫాంలో అమోనియా గ్యాస్ లీక్ అయింది. (Image;ANI)

Chittoor District Gas Leak | డైరీ ప్లాంట్‌లో గ్యాస్ లీక్ ఘటన ఎలా జరిగిందనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి ఎవరికీ ప్రాణనష్టం లేకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

  • Share this:
    Gas Leak in Dairy Plant | ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్‌లో గ్యాస్ లీక్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు చిత్తూరు జిల్లాలో మరో గ్యాస్ లీక్ ఘటన జరిగింది. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం బందపల్లిలోని హాట్సన్ డెయిర్ ఫాంలో అమోనియా గ్యాస్ లీక్ అయింది. ఈ ఘటనలో 12 మంది స్పృహతప్పినట్టు ఏఎన్‌ఐ వార్తాసంస్థ పేర్కొంది. వారిని స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఎవరికీ ఎలాంటి ప్రాణహాని లేదు. అందరూ కోలుకున్నారు. అదే సమయంలో 13 మంది పేర్లతో అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో 12 మంది మహిళలే ఉన్నారు. డెయిరీలో గ్యాస్ లీక్‌ను కట్టడి చేసినట్టు పూతలపట్టు ఎస్ఐ తెలిపారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

    డైరీ ప్లాంట్‌లో గ్యాస్ లీక్ ఘటన ఎలా జరిగిందనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి ఎవరికీ ప్రాణనష్టం లేకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఇప్పటికే విశాఖలో జరిగిన గ్యాస్ లీక్ ఘటన ఎందరో జీవితాల్లో విషాదాలను నింపింది. మరోసారి అలాంటిదేమీ జరగకపోవడంతో అందరూ శాంతించారు. ఇక బాధితులకు ఎలాంటి ప్రాణనష్టం లేదని డాక్టర్లు చెప్పినా వారికి పూర్తిగా మెరుగయ్యే వరకు  ఆస్పత్రిలో చికిత్స అందించనున్నారు. గ్యాస్ లీక్ సమయంలో డెయిరీలో 100 మంది కార్మికులు ఉన్నారు. వారిలో కొందరిని వేలూరు సీఎంసీ ఆస్పత్రికి తరలించినట్టు తెలిసింది.



    ఈ ఘటనలో 13 మంది కార్మికులు అస్వస్థతకు గురైనట్టు అధికారులు జాబితాను ప్రకటించారు. వారిలో 12 మంది మహిళలే ఉన్నారు.


    గ్యాస్ లీక్ అయిన ప్రైవేట్ పాల డెయిరీని చిత్తూరు జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా, చిత్తూరు ఎస్పీ సెంథిల్ కుమార్ పరిశీలించారు. గ్యాస్ లీక్ అయిన సమయంలో 14 మంది కార్మికులు విధి నిర్వహణలో ఉన్నారని చెప్పారు. 14 మంది ఆరోగ్యం నిలకడగా ఉంది, ఎవరికి ప్రాణాపాయం లేదని స్పష్టం చేశారు. అయితే, ముగ్గురి పరిస్థితి ఇబ్బందిగా ఉందని, మెరుగైన వైద్యం కోసం స్విమ్స్, రుయా ఆసుపత్రికి తరలిస్తామని చెప్పారు. ఘటనపై జిల్లా పరిశ్రమల కేంద్ర జనరల్ మేనేజర్, ఫైర్ సిబ్బందితో విచారణకు అదేశించామని కలెక్టర్ భరత్ గుప్తా తెలిపారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:August 20, 2020, 22:56 IST