Home /News /andhra-pradesh /

AMID NARA BHUVANESWARI ROW TDP SEEKS ASSEMBLY VIDEO FOOTAGE ACRO SONU SOOD CALLS CHANDRABABU MKS GNT

భువనేశ్వరి ఉదంతంలో కీలక మలుపు -అసెంబ్లీ ఫుటేజ్ కోసం టీడీపీ పట్టు -చంద్రబాబుకు సోనూ సూద్ ఫోన్

నారా భువనేశ్వరి, చంద్రబాబు

నారా భువనేశ్వరి, చంద్రబాబు

ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని ఉద్దేశించి వైసీపీ నేతలు అవమానకరంగా మాట్లాడారని టీడీపీ ఆరోపిస్తున్నది. వీటిని ప్రభుత్వం తోసిపుచ్చుతుండగా, అసలారోజు సభలో ఏం జరిగిందో వీడియో ఫుటేజ్ ఎడిటింగ్ చేయకుండా ఇవ్వాలంటూ టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆదివారం నాడు స్పీకర్ తమ్మినేని సీతారాంకు లేఖ రాశారు.

ఇంకా చదవండి ...
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ (AP Assembly) లో ప్రతిపక్ష టీడీపీ చీఫ్ చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari)ని అధికార వైసీపీ ఎమ్మెల్యేలు అవమానించారనే ఆరోపణల ఉదంతం మరింత జఠిలంగా మారుతున్నది. వ్యవసాయ రంగంపై చర్చ సందర్భంగా శుక్రవారం నాడు అసెంబ్లీలో ఇరు పక్షాల మధ్య వాగ్వాదం జరగడం, ఒక దశలో వ్యక్తిగత దూషణలకు దిగడం, ఎన్నడూ లేనిది చంద్రబాబు(Chandrababu) కంటతడిపెట్టడం తెలిసిందే. అయితే, సభలో భువనేశ్వరి పేరు ప్రస్తావనకే రాలేదని ప్రభుత్వం వాదిస్తోన్న క్రమంలో.. ఈనెల 19నాటి అసెంబ్లీ వీడియో ఫుటేజ్ కోరుతూ టీడీపీ.. స్పీకర్ తమ్మినేని సీతారాంకు లేఖ రాయడం తాజా పరిణామం. మరోవైపు, చంద్రబాబుకు నటుడు, దాత సోనూ సూద్ ఫోన్ చేసి పరామర్శించారు.

ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని ఉద్దేశించి వైసీపీ నేతలు అవమానకరంగా మాట్లాడారని టీడీపీ ఆరోపిస్తున్నది. వీటిని ప్రభుత్వం తోసిపుచ్చుతుండగా, అసలారోజు సభలో ఏం జరిగిందో వాస్తవాలను బయట పెట్టేందుకు టీడీపీ ప్రయత్నిస్తున్నది. ఆ పార్టీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆదివారం నాడు స్పీకర్ తమ్మినేని సీతారాంకు లేఖ రాశారు. ఈ నెల 19వ తేదీన జరిగిన సభలో జరిగిన ప్రొసీడింగ్స్ ను ఎలాంటి ఎడిటింగ్ లేకుండా ఇవ్వాలని ఎమ్మెల్యే అనగాని లేఖలో కోరారు.

ప్రియుడి పురుషాంగాన్ని కోసేసిన యువతి.. ఆ తర్వాత జరిగిన డ్రామా నెవర్ బిఫోర్..


శుక్రవారం నాటి శాసనసభలో జరిగిన చర్చను ఎటువంటి ఎడిటింగ్ లేకుండా ఆడియో, వీడియోలను ప్రజల ముందు పెట్టాలని టీడీపీ ఎమ్మెల్యే అనగాని కోరారు. తద్వారా సర్కారు వాదన తేలిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. గడిచిన రెండున్నరేళ్లుగా అధికార వైసీపీ వారు వ్యక్తిగత దూషణలకు దిగుతుండటం బాధాకరమని, స్త్రీ, పురుషులనే బేధం లేకుండా సభకు సంబంధం లేని వ్యక్తులను కూడా వివాదాల్లోకి లాగుతున్నారని, ఇప్పుడు ఏకంగా చంద్రబాబు సతీమణినే కించపరిచారని ఎమ్మెల్యే అనగాని అన్నారు. ఈ విషయంలో స్పీకర్ తమ్మినేని ఎలాంటి పక్షపాతం లేకుండా, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని ఆయన కోరారు. ఇదిలా ఉంటే,

ఆస్పత్రిలో చేరిన cm kcr సతీమణి శోభ -కుటుంబమంతా ఢిల్లీలోనే -AIIMS డాక్టర్లు ఏమన్నారు?


టీడీపీ చీఫ్ చంద్రబాబుకు నటుడు, దాత సోనూ సూద్ ఆదివారం నాడు ఫోన్ చేశారు. ఇటీవల అసెంబ్లీలో చంద్రబాబు సతీమణిపై వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో చంద్రబాబును సోనూసూద్ పరామర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి వేదిక అవ్వాల్సిన అసెంబ్లీలో ఇలాంటి ఘటన దురదృష్టకరమని, శాసనసభలో విధ్వంస ధోరణి సరికాదని సోనూ సూద్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌కు వచ్చినప్పుడు చంద్రబాబును కలుస్తానని సోనూసూద్ చెప్పారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం చంద్రబాబుకు ఫోన్ చేసి పరామర్శించారు.
Published by:Madhu Kota
First published:

Tags: AP Assembly, Chandrababu naidu, Nara Bhuvaneshwari, Sonu Sood, Tdp, Ysrcp

తదుపరి వార్తలు