Rupa Ranga Puttagunta: అమెరికాలో తెలుగు మహిళకు కీలక పదవి.. జో బైడెన్ తీసుకున్న నిర్ణయంతో కృష్ణా జిల్లాలోని ఆ ఊళ్లో పండగ వాతావరణం..!

Rupa Ranga Puttagunta, Joe Biden (ఫైల్ ఫొటోలు)

అమెరికాలో జో బైడెన్ ప్రభుత్వంలో ఓ తెలుగు సంతతి మహిళకు అరుదైన గౌరవం దక్కింది. ఆమెను కీలక పదవికి నామినేట్ చేస్తూ జో బైడెన్ నిర్ణయం తీసుకున్నారు. కృష్ణా జిల్లాలోని మారుమూల గ్రామానికి చెందిన..

 • Share this:
  జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత భారతీయులకు అత్యధిక ప్రాధాన్యం దక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పదుల సంఖ్యలో భారతీయులు జో బైడెన్ సర్కారులో కొలువుదీరి ఉన్నారు. తాజాగా మరో భారతీయ మహిళకు, అందులోనూ తెలుగు సంతతి మహిళకు జో బైడెన్ కీలక బాధ్యతలను అప్పగించారు. అమెరికాలో దాదాపు పది లోకల్ కోర్టులకు న్యాయమూర్తులను సిఫారసు చేస్తూ జో బైడెన్ ఓ జాబితాను ప్రకటించారు. ఆ పది మందిలో తెలుగు సంతతికి చెందిన ఇండియన్ అమెరికన్ రూపా రంగా పుట్టగుంట కూడా ఉన్నారు. ఆమెను వాషింగ్టన్ లోని సుపీరియర్ కోర్ట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా కు న్యాయమూర్తిగా నామినేట్ చేస్తూ జో బైడెన్ నిర్ణయం తీసుకున్నారు. జో బైడెన్ తీసుకున్న నిర్ణయాన్ని సెనేట్ కూడా అంగీకరించింది.

  ట్రంప్ తన పరిపాలన చివరి రోజుల్లో ఈ కోర్టునకు విజయ్ శంకర్ అనే వ్యక్తిని నామినేట్ చేశారు. జో బైడెన్ ఆ నిర్ణయాన్ని రద్దు చేస్తూ తాజాగా, రూపా రంగాను నియమించారు. బైడెన్ తన పరిపాలన టీమ్ లోకి తీసుకున్న భారతీయులు సహా విదేశీ ప్రముఖులంతా ఆయా రంగాల్లో నిష్ణాతులేనని, వీళ్లందరూ అమెరికన్ ప్రజలకు నిస్వార్ధంగా సేవ చేయాల్సి ఉంటుందని వైట్ హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇదిలా ఉండగా, డిస్ట్రిక్ట్ ఆఫ్ డీసీకి న్యాయమూర్తిగా నామినేట్ అయిన తొలి భారతీయ అమెరికన్ రూపా రంగా పుట్టగుంటయేనని వైట్ హౌస్ అధికారులు చెబుతున్నారు.
  ఇది కూడా చదవండి: హైదరాబాద్ హాస్టల్లో ఘోరం.. నాన్నా.. నన్ను క్షమించు.. అన్నా.. నేను తప్పు చేయలేదురా అంటూ.. మెసేజ్ పెట్టి మరీ..

  రూపా రంగా పుట్టగుంట తల్లిదండ్రులది కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం కలవపాముల గ్రామం. రూపా రంగాకు కీలక పదవి దక్కిందని ఆ గ్రామస్తులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. దేశాలుదాటినా, ఆ కుటుంబ సభ్యులు మాత్రం సొంతూరితో అనుబంధాన్ని కొనసాగిస్తూనే ఉన్నారట. ఆమె తల్లిదండ్రులు చాలా ఏళ్లక్రితమే అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. రూపా రంగా కూడా అక్కడే పుట్టి పెరిగారు. ఎన్నో ఉన్నత చదువులు చదివారు. 2007వ సంవత్సరం నుంచి ఓహియో స్టేట్ మార్టిజ్ కాలేజ్ ఆఫ్ లా నుంచి జూరిస్ డాక్టర్ డిగ్రీని పొందారు. 2010 నుంచి రెండేళ్ల పాటు డీసీ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ లో న్యాయమూర్తిగా సేవలు అందించారు. 2013వ సంవత్సరంలో డిలానీ మెక్ కెన్నీ ఎల్ఎల్పీ నుంచి ఫ్యామిలీ అండ్ అపిలేట్ లాలోనూ, ఆ తర్వాత డీసీ సుపీరియర్ కోర్టు న్యాయమూర్తి విలియం ఎం జాక్సన్ వద్ద లా క్లర్క్ గానూ పని చేశారు. 2019 వరకు సోలో ప్రాక్టీషనర్ గా కొనసాగిన ఆమె ప్రస్తుతం బీసీలోనే రెంటల్ హౌసింగ్ కమిషన్ విభాగంలో అడ్మినిస్ట్రేటివ్ న్యాయమూర్తిగా ఉన్నారు.
  ఇది కూడా చదవండి: బీటెక్ కుర్రాడు.. డిగ్రీ యువతి.. రాత్రి 10.30గంటల సమయంలో పాల ప్యాకెట్ తీసుకొస్తానంటూ ఆ యువతి బయటకు వచ్చి..
  Published by:Hasaan Kandula
  First published: