హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

కోనసీమలో పసుపు పుచ్చకాయ సాగు.. ఎకరానికి ఎంత లాభమంటే..!

కోనసీమలో పసుపు పుచ్చకాయ సాగు.. ఎకరానికి ఎంత లాభమంటే..!

కోనసీమలో లాభదాయకంగా పుచ్చకాయలసాగు

కోనసీమలో లాభదాయకంగా పుచ్చకాయలసాగు

Konaseema: చేపట్టిన పనుల్లో విజయం సాధించాలంటే.. కృషి పట్టుదల ఎంత అవసరమో.. అన్నదాత ఆర్ధికంగా నష్టపోకుండా ఉండాలంటే.. కాలానుగుణంగా ఆధునిక పద్దతుల్లో పంటలు పండించడం అంతే అవసరం. దీంతో అనేక మంది రైతులు సరికొత్త పద్ధతుల్లో వ్యవసాయం చేస్తూ.. విజయాన్ని అందుకుంటున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Amalapuram, India

Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati

చేపట్టిన పనుల్లో విజయం సాధించాలంటే.. కృషి పట్టుదల ఎంత అవసరమో.. అన్నదాత ఆర్ధికంగా నష్టపోకుండా ఉండాలంటే.. కాలానుగుణంగా ఆధునిక పద్దతుల్లో పంటలు పండించడం అంతే అవసరం. దీంతో అనేక మంది రైతులు సరికొత్త పద్ధతుల్లో వ్యవసాయం చేస్తూ.. విజయాన్ని అందుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని కోనసీమ జిల్లాకు చెందిన రైతు పసుపు రంగు పుచ్చకాయలు పండిస్తూ లాభాలను ఆర్జిస్తున్నాడు. కోనసీమ జిల్లాలోని సఖినేటిపల్లి మండలం, రామేశ్వరం గ్రామానికి చెందిన దొమ్మేటి శ్రీనివాస్ ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లి.. తిరిగి స్వగ్రామానికి చేరుకున్నాడు. అయితే ఈ సారి సొంత ఊళ్ళోనే ఉపాధిని కల్పించుకోవాలనుకున్నాడు. అప్పుడు అతని దృష్టి వ్యవసాయంమీద పడింది.

ఏదైనా విభిన్న పద్దతిలో సాగు చేయాలని శ్రీనివాస్ భావించాడు. దీంతో పసుపు పుచ్చకాయ పంటను పండించాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా కేశనపల్లి గ్రామంలో ఎకరం భూమిని కౌలుకు తీసుకుని ప్రయోగాత్మకంగా పసుపు రంగు పుచ్చకాయలు పంట వేసాడు. కేశనపల్లి పరిసర ప్రాంతాల్లోని భూమి ఇసుకతో ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా సరుగుడుని వేస్తారు. కానీ శ్రీనివాస్ పసుపు రంగు పుచ్చకాయలు సాగును ప్రయోగాత్మకంగా చేపట్టాడు. అంతేకాదు కర్బూజ పండ్ల సాగు కూడా చేపట్టాడు. మొదట్లో నష్టం వచ్చినా వ్యవసాయం దండగ అనుకోలేదు. మళ్లీ ఈ ఏడాది కూడా పంట వేశాడు. అయితే ఈ ఏడాది పంట పెట్టుబడి పోగా లాభాలను సొంతం చేసుకున్నాడు.

ఇది చదవండి: ఇక్కడ సోడా తాగితే బ్రేవ్ అనాల్సిందే..! ఒకేచోట 500 రకాల సోడాలు

ఎకరానికి రూ. లక్షా అరవై వేల ఆదాయం

ఎకరం భూమిలో ఎరుపు రంగు పుచ్చతో పాటు పసుపు రంగు పుచ్చకాయలు, కర్బూజాలను ఏకకాలంలో పండించాడు. ఎకరానికి రూ. ఒక లక్షా అరవై వేల ఆదాయాన్ని ఆర్జించాడు. పెట్టుబడి  పెట్టిన రూ.60 వేలు పోగా తనకు లక్ష వరకు లాభం వచ్చిందని శ్రీనివాస్ చెప్పాడు. ఆంధ్రప్రదేశ్ లో ఇటువంటి రకాల పుచ్చుకాయ సాగు వేయడం మొదటి సారని శ్రీనివాస్ అంటున్నాడు. అంతేకాదు ఒక్కో పుచ్చకాయ బరువు 8 కిలోలు, కర్బూజా బరువు 4కిలోల వరకు ఉన్నయని తెలిపాడు. ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తే మరింత ఉత్సాహంగా సాగు చేసి మరిన్ని మంచి ఫలితాలు సాధిస్తానని ధీమా  వ్యక్తం చేస్తున్నాడు శ్రీనివాస్.

మరో కోనసీమ రైతు

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమజిల్లా, మలికిపురం మండలం, కేశనపల్లి గ్రామానికి చెందిన యర్రంశెట్టి సుబ్బారాయుడు అనే మరో యువరైతు సరికొత్త పుచ్చకాయ సాగును రెండు ఎకరాల విస్తీర్ణంలో వేసాడు.  మనం మార్కెట్ లో చూసిన పుచ్చకాయ ఎరుపు రంగులో మాత్రమే చూసాం.. కానీ ఈరైతు మూడు రకాల పుచ్చకాయ సాగును పండిస్తున్నాడు. సరికొత్త ఆలోచనతో పుచ్చసాగు వేస్తే ఎలా ఉంటుందని ఆలోచించి సుమారు రెండు ఎకరాల్లో పుచ్చసాగు వేయడం జరిగిందని సంవత్సరానికి లక్ష రూపాయలు ఆదాయం చేకూరుస్తుందని ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈపుచ్చకాయలకు మార్కెట్లో మంచి డిమాండ్ పలుకుతుందని యువరైతు యర్రంశెట్టి సుబ్బారాయుడు తెలిపారు.

First published:

Tags: Agriculture, Andhra Pradesh, East Godavari Dist, Farmers

ఉత్తమ కథలు