Home /News /andhra-pradesh /

AMARNATH YATRA UPDATES 37 PILGRIMS FROM ANDHRA PRADESH STILL MISSING IN AMARNATH TRAGEDY 84 PEOPLE SAFE MKS

Amarnath Tragedy | AP : అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లిన ఏపీ వాసుల్లో ఇంకా 37 మంది మిస్సింగ్..

అమర్‌నాథ్‌ పరిసరాల్లో ఆర్మీ సహాయక చర్యలు

అమర్‌నాథ్‌ పరిసరాల్లో ఆర్మీ సహాయక చర్యలు

జమ్మూ కాశ్మీర్ లోని అమర్‌నాథ్‌ క్షేత్రం పరిసరాల్లో సంభవించిన జలప్రళయంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన 37 మంది యాత్రికుల ఆచూకీ ఇంకా లభించాల్సి ఉందని తెలుస్తోంది. యాత్రలో చిక్కుకున్న తెలుగువారి సమాచారం కోసం సంప్రదించాల్సిన నంబర్లు ఇవే..

యాత్రలో చిక్కుకున్న తెలుగువారి సమాచారం కోసం సంప్రదించాల్సిన నంబర్లు
►ఢిల్లీ ఏపీ భవన్ హెల్ప్ లైన్ నంబర్స్: 011-23384016, 011-23387089
►ఆంధ్ర ప్రదేశ్ హెల్ప్ లైన్ నంబర్: 1902

జమ్మూ కాశ్మీర్ లోని అమర్‌నాథ్‌ క్షేత్రం (Amarnath Yatra) పరిసరాల్లో సంభవించిన జలప్రళయంలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)కు చెందిన 37 మంది యాత్రికుల ఆచూకీ ఇంకా లభించాల్సి ఉందని తెలుస్తోంది. నెల్లూరు జిల్లా నుంచి రెండు బృందాలుగా వెళ్లిన 29 మందితోపాటు ఏలూరు నుంచి ఇద్దరు, తణుకు సమీపంలోని ఉండ్రాజవరం నుంచి ఒకరు, రాజమండ్రికిచెందిన ఇద్దరు మహిళల సహా 37 మంది ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

అమర్‌నాథ్‌ యాత్రలో వరదల తర్వాత పలువురు తెలుగు యాత్రికుల క్షేమ సమాచారాలు అందకపోవడంతో స్థానిక రెవెన్యూ అధికారులు వారి అడ్రస్, ఫోన్ నంబర్ల ఆధారంగా ఇళ్లకు వెళ్లి విచారిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు.. తమ బంధువులు క్షేమంగానే ఉన్నారని, ఫోన్ చేసి మాట్లాడారని తెలిపారు. అయితే, ఇప్పటికీ ఆచూకీ లభించని వారి విషయంలో మాత్రం ఆందోళన నెలకొంది. వారి ఫోన్లు స్విచాఫ్ వస్తున్నాయని బంధువులు చెబుతున్నారు.

CM KCR | BJP : అసెంబ్లీ రద్దు.. ముందస్తు ఎన్నికలు.. కేసీఆర్ సవాలుతో బీజేపీ ఇరుకున పడిందా?


అమర్‌నాథ్‌ లో గల్లంతైన ఏపీ వాసుల సమాచారాన్ని.. ప్రస్తుతం శ్రీనగర్ లో ఉన్న ఏపీ భవన్ అదనపు రెసిడెంట్ కమిషనర్ హిమాన్షు కౌషిక్ కు అందజేశారు. ఆయన అక్కడి స్థానిక అధికారులతో మాట్లాడుతూ ఏపీ వాసుల జాడ కోసం ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ లో మొబైల్ నెట్ వర్క్ లు పనిచేయకపోవడం, ఫోన్ చార్జింగ్ అయిపోవడం వంటి కారణాల వల్ల సరైన సమాచారం అందడం లేదని, తద్వారా గందరగోళం నెలకొన్నట్లు తెలుస్తోంది.

Union Cabinet : కేంద్ర కేబినెట్‌లో మార్పులు.. తెలంగాణకు మరో బెర్త్.. జగన్ వైసీపీకీ అహ్వానం?


ఏపీ నుంచి అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లి వరదల్లో చిక్కుకుపోయినవారిలో ఇప్పటి వరకు 84 మందిని కాపాడినట్లు తెలుస్తోంది. అందులో 20 మంది విజయవాడకు చెందినవారు కాగా, తాడేపల్లి గూడేనికి చెందిన 17 మంది, తిరుపతికి చెందిన ఆరుగురు, విజయనగరానికి చెందిన ఒకరు, రాజంపేట(కడప)కు చెందిన మరొకరు క్షేమంగా ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఇక..


Man Menstrual Periods : పురుషుడికి రుతుస్రావం.. కంగుతిన్న డాక్టర్లు.. చివరికి ఏమైందంటే..


వాతావరణ పరిస్థితులు అనుకూలించని కారణంగా జమ్మూ నుంచి అమర్‌నాథ్‌ యాత్రను కేంద్రం తాత్కాలికంగా నిలిపేసింది. కొత్త బ్యాచ్ భక్తులు ఎవరినీ అనుమతించడంలేదు. ఇప్పటివరకు సుమారు లక్ష మంది అమర్‌నాథ్‌ క్షేత్రాన్ని దర్శించుకున్నారు. అమర్నాథ్‌ జల ప్రళయంలో ఇప్పటి వరకు 16 మంది మృతి చెందగా.. ఇంకా 40 మంది యాత్రికుల ఆచూకీ తెలియరాలేదు. ఇప్పటి వరకు ఆర్మీ బేస్‌ క్యాంప్‌కు 15 వేల మందిని తరలించారు. అయితే అనుమతిస్తే దర్శనానికి వెళ్తామని కొందరు భక్తులు చెబుతున్నారు.
Published by:Madhu Kota
First published:

Tags: Amarnath Yatra, Amarnath Yatra 2022, Andhra Pradesh, AP News

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు