తెలంగాణ ఎమ్మెల్యే కాళ్లు పట్టుకున్న అమరావతి మహిళ

సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న అమరావతి మహిళలు అనంతరం... అక్కడే ఉన్న ఎమ్మెల్యే సీతక్కను కలుసుకున్నారు.

news18-telugu
Updated: February 8, 2020, 2:17 PM IST
తెలంగాణ ఎమ్మెల్యే కాళ్లు పట్టుకున్న అమరావతి మహిళ
ఎమ్మెల్యే సీతక్క కాళ్లు పట్టుకున్న మహిళ
  • Share this:
తమ సమస్యలు తీర్చాలంటూ మేడారంలోని సమ్మక్క సారలమ్మలకు మొక్కులు చెల్లించేందుకు వెళ్లిన అమరావతి మహిళలు... అక్కడ భావోద్వేగానికి గురయ్యారు. సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న అనంతరం... అక్కడే ఉన్న ఎమ్మెల్యే సీతక్కను కలుసుకున్నారు. తమ సమస్యలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా ఓ మహిళ తీవ్ర భావోద్వేగానికి లోనైంది. ఎమ్మెల్యే సీతక్క కాళ్లు పట్టుకుని తమ సమస్యను తీర్చాలని కోరింది. ఆమెను ఎమ్మెల్యే సీతక్క ఓదార్చారు. అమరావతి రైతులకు న్యాయం చేయాలని ఆమె ఏపీ ప్రభుత్వాన్ని కోరారు.

అంతకుముందు అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ అమరావతి జేఏసీ నేతలు ఈరోజు ఉదయం హైదరాబాద్‌లో ధర్నా అనంతరం మేడారం జాతరకు వెళ్లారు. ప్రత్యేక బస్సులో బయలుదేరిన వీరు జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్ అంటూ నినాదాలు చేశారు.
First published: February 8, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు