హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Amaravati Case: అమరావతిపై CBI విచారణ.. కోర్టు మానిటరింగ్.. జగన్ ప్రభుత్వం ఓకే

Amaravati Case: అమరావతిపై CBI విచారణ.. కోర్టు మానిటరింగ్.. జగన్ ప్రభుత్వం ఓకే

Amaravati Land Scam Case: ఇది కచ్చితంగా టీడీపీకి కొంత ఇబ్బంది కలిగించే అంశమే. అసలు ఏంటి ఈ కేసు... దీన్లో తాజాగా జరిగిన పరిమాణాలేంటి... ఫటాఫట్ తెలుసుకుందాం.

Amaravati Land Scam Case: ఇది కచ్చితంగా టీడీపీకి కొంత ఇబ్బంది కలిగించే అంశమే. అసలు ఏంటి ఈ కేసు... దీన్లో తాజాగా జరిగిన పరిమాణాలేంటి... ఫటాఫట్ తెలుసుకుందాం.

Amaravati Land Scam Case: ఇది కచ్చితంగా టీడీపీకి కొంత ఇబ్బంది కలిగించే అంశమే. అసలు ఏంటి ఈ కేసు... దీన్లో తాజాగా జరిగిన పరిమాణాలేంటి... ఫటాఫట్ తెలుసుకుందాం.

  Amaravati Land Scam Case: అమరావతి భూముల బదలాయింపుల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై కోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు జరపడం తమకు ఆమోదయోగ్యమే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం... శుక్రవారం సుప్రీంకోర్టుకు చెప్పింది. ప్రస్తుతం ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) జరుపుతున్న దర్యాప్తుపై ఏపీ హైకోర్టు విధించిన స్టే (దర్యాప్తు నిలుపుదల ఉత్తర్వు)ను ఎత్తివేయాలని ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. లిఫ్ట్ ఎత్తివేసి సిట్ దర్యాప్తు కొనసాగించేలా చెయ్యాలని కోరింది. మీకు తెలుసు... వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇది వరకు ఈ అక్రమాల ఆరోపణలపై దర్యాప్తు నకు 10 మంది సభ్యులతో సిట్‌ని ఏర్పాటు చేసింది. దీనికి హెడ్‌గా డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ - ర్యాంక్ IPS ఆఫీసర్ ఉన్నారు. సమగ్ర దర్యాప్తు జరిపి... అయే అక్రమాలు ఎలా జరిగాయో నివేదిక ఇవ్వాల్సి ఉంది. గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో అమరావతి రాజధాని ప్రాంతంలో... జరిగిన ల్యాండ్ డీలింగ్స్‌లో అక్రమాలు జరిగాయన్నది ప్రభుత్వ వర్గాల వాదన. ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందన్నది ప్రధాన ఆరోపణ.

  ఈ కేసులో సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సీనియర్ లాయర్ రాజీవ్ ధావన్ వాదించారు. జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్ఎస్ రెడ్డి... తో కూడిన బెంచ్ ఈ వాదనలు వింది. ఇది వరకు హైకోర్టులో ప్రభుత్వ గత అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ వినిపించిన కొన్ని వాదనలను తాము అంగీకరిస్తున్నామని ఆ బెంచ్... రాజీవ్ ధావన్‌కి తెలిపింది. "మేము తీవ్రమైన చర్యలేవీ దమ్మలపాటి శ్రీనివాస్‌పై తీసుకోకూడదు అనే అంశాన్ని ఒప్పుకుంటున్నాం. అలాగే... దర్యాప్తుకు కోర్టు మానిటరింగ్ చెయ్యాలన్న వాదనతోనూ ఒప్పుకుంటున్నాం... ఐతే దర్యాప్తు సీబీఐ చేపట్టాలి. మేము ఇదివరకే కోరాం. కానీ అది జరగలేదు" అని రాజీవ్ ధావన్ తెలిపారు. సీబీఐ దర్యాప్తు ప్రారంభించేవరకూ... సిట్ దర్యాప్తు కొనసాగించేలా చెయ్యాలని ఆయన కోరారు.

  దీనిపై కోర్టు మరోసారి వాదనలు వింటామని తెలిపింది. ప్రస్తుతానికి చాలా ముఖ్యమైన కేసులు ఉన్నాయని వివరించింది. ఫలితంగా ఏప్రిల్ 7న మళ్లీ దీనిపై వాదనలు జరగనున్నాయి. సిట్ దర్యాప్తుకి హైకోర్టు స్టే విధించడంతో... దానిపై అడ్వకేట్ మహఫూజ్ అహశాన్ నజ్కీ... గత సెప్టెంబర్ 15న సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ కేసుకు సంబంధించి మీడియా వార్తలు ప్రచారం చేయకూడదని హైకోర్టు ఆర్డర్‌పై గతేడాది నవంబర్ 25న సుప్రీంకోర్టు స్టే విధించింది. అదే సమయంలో సిట్ దర్యాప్తుపై స్టే విషయంలో మాత్రం సుప్రీంకోర్టు ఏమీ చెప్పలేదు.

  ఇది కూడా చదవండి: Leopard in CCTV: సిటీలోకి సీక్రెట్‌గా వచ్చిన చిరుత... ప్రజల్లో టెన్షన్... ఎక్కడుందో

  సో... ఏప్రిల్ 17న సుప్రీంకోర్టు గనక సీబీఐ దర్యాప్తుకి గ్రీన్ సిగ్నల్ ఇస్తే... అప్పుడు ఈ అంశం మరింత పెద్దదవుతుంది.

  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Telugu news

  ఉత్తమ కథలు