మళ్లీ రాజధాని రగడ... హైకోర్టులో పిటిషన్

విశాఖకు రాజధానిని తరలించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని.. సచివాలయ ఉద్యోగులకు ఇప్పటికే సూచనలు వెళ్లాయని ఏపీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.


Updated: April 22, 2020, 3:58 PM IST
మళ్లీ రాజధాని రగడ... హైకోర్టులో పిటిషన్
ఏపీ హైకోర్టు
  • Share this:
ఏపీ ప్రభుత్వం అమరావతి నుంచి రాజధానిని తరలించేందుకు సన్నాహాలు చేస్తోందంటూ అమరావతి పరిరక్షణ సమితి కార్యదర్శి గద్దె తిరుపతిరావు హైకోర్టులో అత్యవసర పిల్‌ దాఖలు చేశారు.రాజధానిని తరలించకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. విశాఖకు రాజధానిని తరలించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని.. సచివాలయ ఉద్యోగులకు ఇప్పటికే సూచనలు వెళ్లాయని పిటిషన్‌లో ప్రస్తావించారు. రాజధాని తరలింపుపై ప్రభుత్వం అంతర్గతంగా చర్యలు చేపట్టిందని పిటిషనర్ ఆరోపించారు.

అమరావతిలో సువిశాల రాజధాని ఉందని.. ఇప్పుడు మరో ప్రాంతానికి తరలించడం వల్ల రాష్ట్ర ఖజానాపై అదనపు భారం పడుతుందని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని సచివాలయాన్ని విశాఖ తరలించకుండా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. అమరావతి ప్రాంతంలో రాజధానికి సంబంధించి రూ.52,837 కోట్ల వ్యయంతో ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోందని పిటిషన్‌లో ప్రస్తావించారు. ఆ నిర్మాణాలను నిలిపేయకుండా చూడాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరారు. పిటిషన్‌లో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, నీతి ఆయోగ్‌ కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు సీఎం జగన్‌ని ప్రతివాదులుగా ప్రస్తావించారు.

First published: April 22, 2020, 3:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading