Updated: January 21, 2020, 7:29 PM IST
ప్రతీకాత్మక చిత్రం
అమరావతి కోసం రాజధాని గ్రామాల్లో ఆందోళనలు ఉద్థృతమయ్యాయి. అమరావతి నుంచి పారిపాలనా రాజధానిని తరలించడంపై రైతులు, విపక్షాలు మండిపడుతున్నారు. ఈ క్రమంలో రాజధానిని మార్పును వ్యతిరేకిస్తూ బుధవారం గుంటూరు జిల్లా బంద్‌కు అమరావతి పరిరక్షణ జేఏసీ పిలుపునిచ్చింది. ఆర్టీసీ బస్సులు మినహాయించి వ్యాపార, విద్యాసంస్థలు సినిమా హాళ్ళు, ప్రభుత్వ కార్యాలయాల స్వచ్ఛందంగా మూసివేయాలని జేఏసీ విజ్ఞప్తి చేసింది. బంద్‌లో అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చింది. ఇప్పటికే రాజధాని పరిధిలోని గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా బంద్‌కు జేఏసీ పిలుపునివ్వడంతో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అసెంబ్లీతో పాటు పలు చోట్ల అదనపు బలగాలను మోహరిస్తున్నారు.
Published by:
Shiva Kumar Addula
First published:
January 21, 2020, 7:25 PM IST