HOME »NEWS »ANDHRA PRADESH »amaravati farmers protest to tollywood stars chiranjeevi nagarjuna daggubati suresh ak

టాలీవుడ్ ప్రముఖులకు అమరావతి రైతుల నిరసన

టాలీవుడ్ ప్రముఖులకు అమరావతి రైతుల నిరసన
ప్రతీకాత్మక చిత్రం

సినీ ప్రముఖులు ఇక్కడికి వస్తున్నారని తెలుసుకున్న అమరావతి రైతులు... తమకు న్యాయం జరిగేలా చూడాలని నినాదాలు చేశారు.

  • Share this:
    సీఎం జగన్‌ను కలిసేందుకు అమరావతి వచ్చిన టాలీవుడ్ ప్రముఖలకు అమరావతి రైతులు నిరసన తెలిపారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి నేరుగా గోకరాజు గంగరాజు గెస్ట్ హౌస్‌కు చేరుకున్నారు టాలీవుడ్ ప్రముఖులు. సినీ ప్రముఖులు ఇక్కడికి వస్తున్నారని తెలుసుకున్న అమరావతి రైతులు... తమకు న్యాయం జరిగేలా చూడాలని నినాదాలు చేశారు. వారు బస చేసిన గెస్ట్ హౌస్ ముందు నిరసన చేపట్టారు. రైతుల కోసం అనేక సినిమాలు చేసిన హీరోలకు అమరావతి రైతుల కష్టాలు కనపడటం లేదా అని ప్రశ్నించారు. మూడు రాజధానులు వద్దు రాజధానే ముద్దు అంటూ ప్లకార్డుల ప్రదర్శించారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని రైతులు డిమాండ్ చేశారు. రాజధాని మహిళలు రావడంతో అప్రమత్తమైన పోలీసులు గెస్ట్ హౌస్‌ వద్దకు చేరుకున్నారు. అయితే టాలీవుడ్ పెద్దలను కలిసేందుకు నిరసనకారులకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. సీఎం జగన్‌ను కలిసేందుకు అమరావతి చేరుకున్న మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, దగ్గుబాటి సురేష్ సహా పలువురు ప్రముఖులు అంతకుముందు గోకరాజు గంగరాజు గెస్ట్ హౌస్‌కు వెళ్లి కాసేపు బస చేశారు.
    Published by:Kishore Akkaladevi
    First published:June 09, 2020, 15:48 IST