Roja: ఎమ్మెల్యే రోజాకు అమరావతి సెగ

రోజాకు నిరసన తెలిపేందుకు అమరావతి రైతులు, మహిళలు ఆమె పాల్గొన్న కార్యక్రమం దగ్గరకు భారీగా చేరుకున్నారు.

news18-telugu
Updated: February 20, 2020, 12:47 PM IST
Roja: ఎమ్మెల్యే రోజాకు అమరావతి సెగ
రోజా(ఫైల్ ఫోటో)
  • Share this:
ఏపీఐఐసీ చైర్‌పర్సన్, వైసీపీ ఎమ్మెల్యే రోజాకు అమరావతి రైతుల నిరసన సెగ తగిలింది. గురువారం ఉదయం నీరుకొండ ఎస్‌ఆర్ఎం యూనివర్సటీ సమ్మిట్‌లో రోజా పాల్గొన్నారు. అయితే రోజా అక్కడికి వస్తున్న తెలుసుకున్న అమరావతి మహిళలు, రైతులు... అక్కడికి చేరుకున్నారు. సమ్మిట్ జరుగుతున్న ఎస్ఆర్ఎం యూనివర్సిటీ బయట ఆందోళనకు దిగారు. అమరావతికి న్యాయం చేయాలంటూ మహిళలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మహిళలు, రైతుల ఆందోళనతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు.

రోజాను వెనుక గేటు నుంచి బయటకు తీసుకెళ్లారు. అయితే విషయం తెలుసుకున్న కొందరు మహిళా ఆందోళనకారులు రోజా కాన్వాయ్‌ను వెంబడించారు. పోలీసులు వారిని అడ్డగించారు. ఈ ఘటనతో యూనివర్సిటీ వద్ద కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.



First published: February 20, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు