హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Flash News: అమరావతి రాజధాని కేసు..పిటీషన్ల విచారణపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

Flash News: అమరావతి రాజధాని కేసు..పిటీషన్ల విచారణపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టు

అమరావతి రాజధాని కేసుల విచారణను దేశ అత్యున్నత న్యాయస్థానం వాయిదా వేసింది. రాజధాని అంశం, రాష్ట్ర విభజనపై దాఖలైన 35 పిటీషన్లను కలిపి సుప్రీంకోర్టు విచారించింది. రాష్ట్ర రాజధానిని నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి లేదని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. దీనిని సవాల్ చేస్తూ..ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో విచారించిన సుప్రీంకోర్టు విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది.  అయితే రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్లను, అమరావతి అంశంపై దాఖలైన పిటీషన్లను వేర్వేరుగా విచారించాలని దేశ అత్యున్నత న్యాయస్థానం నిర్ణయించింది. 

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

అమరావతి రాజధాని కేసుల విచారణను దేశ అత్యున్నత న్యాయస్థానం వాయిదా వేసింది. రాజధాని అంశం, రాష్ట్ర విభజనపై దాఖలైన 35 పిటీషన్లను కలిపి సుప్రీంకోర్టు విచారించింది. రాష్ట్ర రాజధానిని నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి లేదని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. దీనిని సవాల్ చేస్తూ..ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో విచారించిన సుప్రీంకోర్టు విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది.  అయితే రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్లను, అమరావతి అంశంపై దాఖలైన పిటీషన్లను వేర్వేరుగా విచారించాలని దేశ అత్యున్నత న్యాయస్థానం నిర్ణయించింది.

Western Coal Field Limited Jobs: వెస్ట్రన్ కోల్ ఫీల్డ్ లో ఉద్యోగాలు .. 900 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల..

రాజ్యాంగం ప్రకారం మూడు వ్యవస్థలు తమ తమ అధికార పరిధిల్లో పని చేయాలి. శాసన, పాలనా వ్యవస్థ అధికారంలోకి న్యాయవ్యవస్థ చొరబడడం రాజ్యాంగ మౌలిక వ్యవస్థకు విరుద్ధం. తమ రాజధానిని రాష్ట్రాలే నిర్ణయించుకోవడం అనేది సమాఖ్య వ్యవస్థకు నిదర్శనమని పిటీషన్ లో ప్రభుత్వం పేర్కొంది. రాజధానిపై శివరామ కృష్ణన్ (Shivarama krishnan)  కమిటీ నివేదిక, జిఎస్ రావు (Gs Rao) కమిటీ నివేదిక, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (Bostan Consulting Group) నివేదిక, హైపవర్డ్ (High powerd)  కమిటీ నివేదికలను హైకోర్టు పట్టించుకోలేదు. రాష్ట్ర ప్రయోజనాల దృష్యా రాజధానిని అమరావతిని కేంద్రికృతం చేయకుండా..వికేంద్రీకరణ చేయాలని నివేదికలు చెబుతున్నాయి. తమ రాజధానిని నిర్ణయించుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని తెలిపింది. ఒకే రాజధాని ఉండాలని, ఏపీ (Andhra Pradesh) విభజన చట్టంలో లేనప్పటికీ, చట్టానికి తప్పుడు అర్ధాలు చెబుతున్నారని పిటీషన్ లో పేర్కొన్నారు.

Conistable Jobs: త్వరలో 6500 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ..మొన్న సీఎం..నేడు డీజీపీ వెల్లడి..అలెర్ట్ అయిన పోలీస్ అభ్యర్థులు

కాగా గత కొన్ని రోజులుగా అమరావతినే రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలని రైతులు మహాపాదయాత్ర చేపట్టారు. ఏపీకి మూడు రాజధానుల నిర్ణయానికే కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం చెప్పుకొస్తుంది. ఈ క్రమంలో హైకోర్టులో విచారణ జరిగింది. మొదట పాదయాత్రకు కొన్ని నిబంధనలు విధించింది. ఆ తరువాత పోలీసుల తీరుపై, నిబంధనలపై హైకోర్టులో పిటీషన్ వేశారు రైతులు. దానిపై విచారించిన హైకోర్టు రాజధాని నిర్ణయం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. దీనితో ప్రభుత్వం హైకోర్టు (High Court) తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లారు.

నేడు విచారణ చేపట్టిన కోర్టు విభజన సమస్యలపై వ్యతిరేక పిటీషన్లు, అమరావతి పిటీషన్లను వేర్వేరుగా విచారించాలని నిర్ణయించింది.  మరి మూడు రాజధానుల అంశంపై సుప్రీంకోర్టు (Suprme Court) 28న ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి మరి.

First published:

Tags: Ap, AP News, Supreme Court

ఉత్తమ కథలు