ఏపీ సీఎం చంద్రబాబుతో బాబా రాందేవ్ భేటీ

AP CM Chandrababu Meets Baba Ramdev | విజయనగరం జిల్లా చిన్నరావుపల్లిలో పతంజలి సంస్థ రూ.634 కోట్లతో ఏర్పాటు చేసే ‘మెగా ఫుడ్ పార్క్’ ద్వారా దాదాపు 33,400 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది.

news18-telugu
Updated: December 6, 2018, 4:00 PM IST
ఏపీ సీఎం చంద్రబాబుతో బాబా రాందేవ్ భేటీ
బాబా రామ్‌దేవ్(ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: December 6, 2018, 4:00 PM IST
ఏపీ సీఎం చంద్రబాబుతో యోగా గురువు బాబా రాందేవ్ అమరావతిలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా చిన్నరావుపల్లిలో పతంజలి సంస్థ ఏర్పాటు చేసే ‘మెగా ఫుడ్ పార్క్’ గురించి సీఎం చంద్రబాబుకు రాందేవ్ వివరించారు. రూ.634 కోట్లతో ఆహార శుద్ధితో పాటు అనుబంధ యూనిట్లు ఏర్పాట్లు చేయనున్నారు. దీని ద్వారా దాదాపు 33,400 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. ‘మెగా ఫుడ్ పార్క్’కు ఏపీ ప్రభుత్వం 172.84 ఎకరాలు కేటాయించింది.

రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామని  సీఎం చంద్రబాబు తెలిపారు. రసాయనాలు, పురుగు మందులు లేకండా వ్యవసాయ ఉత్పత్తులు దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.


 
First published: December 6, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...