హోమ్ /వార్తలు /andhra-pradesh /

Amaravati: అమరావతి ఉద్యమానికి 800 రోజులు.. మార్చి నెలలో ఏం జరగబోతోంది..?

Amaravati: అమరావతి ఉద్యమానికి 800 రోజులు.. మార్చి నెలలో ఏం జరగబోతోంది..?

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాలను ఎప్పుడు కదిలించినా వెంటనే చర్చకు వచ్చే అంశం రాజధాని. ప్రస్తుతం ఏపీకి రాజధాని (AP Capital) ఏదీ అంటే ఠక్కున చెప్పలేని పరిస్థితి.

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాలను ఎప్పుడు కదిలించినా వెంటనే చర్చకు వచ్చే అంశం రాజధాని. ప్రస్తుతం ఏపీకి రాజధాని (AP Capital) ఏదీ అంటే ఠక్కున చెప్పలేని పరిస్థితి.

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాలను ఎప్పుడు కదిలించినా వెంటనే చర్చకు వచ్చే అంశం రాజధాని. ప్రస్తుతం ఏపీకి రాజధాని (AP Capital) ఏదీ అంటే ఠక్కున చెప్పలేని పరిస్థితి.

  Anna Raghu, Guntur, News18

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాలను ఎప్పుడు కదిలించినా వెంటనే చర్చకు వచ్చే అంశం రాజధాని. ప్రస్తుతం ఏపీకి రాజధాని (AP Capital) ఏదీ అంటే ఠక్కున చెప్పలేని పరిస్థితి. రాజధాని విషయంలో నెలకొన్ని అనిశ్చితి ప్రతిఒక్కరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం అమరావతి ప్రాంతాన్ని రాష్ట్ర రాజధానిగా ఎంపిక చేసింది. ప్రధాని నరేంద్ర మోదీతో అట్టహాసంగా శంఖుస్థాపన చేయించింది. శాసనసభ, సెక్రటేరియట్,హైకోర్టు వంటి కొన్ని పరిపాలన భవనాలను నిర్మించి అక్కడి నుండే పరిపాలన కొనసాగించారు. అప్పట్లో వేలకొట్ల రూపాయలు వెచ్చించి అమరావతిని అనేక హంగులతో అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ఊదరగొట్టారు. ఐతే నిధులలేమితో అమరావతి నిర్మాణం మందకొడిగా సాగింది. ఐదేళ్లు అధికారంలో ఉన్నా పూర్తిస్థాయిలో రాజధానిని రూపొందించలేకపోయారు.

  ఐతే 2019 లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆర్ధిక పరమైన అంశాలు, అప్పటి అధికార టీడీపీ వర్గాలు ముందే ఆప్రాంతంలో వేల ఎకరాలు కొనుగోలుచేసి ఇన్ సైడర్ ట్రైడింగ్ కు పాల్పడిందని, వేలాది ఎకరాల అసైన్డ్ భూములను ప్రభుత్వ పెద్దలు పేదల నుండి లాగేసుకుని వారికి అన్యాయం చేశారనే విషయాన్ని సాకుగా చూపి అమరావతి నిర్మాణం అసాధ్యం అంటూ మూడు రాజధానులు అంటూ కొత్త ప్రతిపాదనను ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది.

  ఇది చదవండి: జగన్ పాలనను కామెడీ సినిమాతో పోల్చిన బీజేపీ.., సంక్షేమ పథకాలపై సెటైర్లు..

  ఐతే అప్పటి వరకు తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని నమ్మి దాదాపు 33వేల ఎకరాలు ప్రభుత్వానికి ఇచ్చామని, సీఎం జగన్ మోసం చేశారంటూ అమరావతి ప్రాంత రైతులు ఆందోళనకు దిగారు. ఇక్కడే రాజధాని కొనసాగించాలంటూ అమరావతి ప్రాంత రైతులు ఉద్యమ బాట పట్టారు. వీరికి రాష్ట్రంలో ఒక్క వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి.

  ఇది చదవండి: కొడాలి నానిపై చంద్రబాబు కొత్త వ్యూహం..? ఆ ప్లాన్ వర్కవుట్ అవుతుందా..?

  ఈ క్రమంలో అమరావతి రైతుల ఉద్యమం గురువారంతో 800 రోజులు పూర్తి చేసుకుంది. ఉద్యమంలో భాగంగా నిరసనలు, నిరాహార దీక్షలు,తిరుపతి పాదయాత్ర వంటి అనేక రకాల కార్యక్రమాలు అమరావతి రైతులు చేపట్టారు. మూడు రాజధానుల అంశంపై కోర్టులో కేసులు వేశారు. అమరావతి రైతుల దెబ్బకి జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును అసెంబ్లీ సాక్షిగా విరమించుకుంది. ఇది అమరావతి రైతులు సాధించిన విజయంగా చెప్పుకోవచ్చు.

  ఇది చదవండి: జనసేన టార్గెట్ ఈ స్థానాలేనా.. కష్టపడితే గెలుపు గ్యారెంటీ అంటున్న సైనికులు.. పవన్ వ్యూహమేంటి..?

  ఐతే తాము మళ్ళీ సవరణలతో కొత్తబిల్లు తీసుకు వస్తామని జగన్ అసెంబ్లీ సాక్షి తెలపడంతో అమరావతి రైతులలో ఆందోళన మరింత ఎక్కువైంది. ఉద్యమానికి మొదటి నుండి అండదండలు అందిస్తున్న టీడీపీ నాయకులు మాత్రం వైసీపీపై మండిపడుతున్నారు. సీఎం ఒక కులం, ఒక ప్రాంతంపై పగబట్టి అమరావతిని అడ్డుకుంటున్నారని విమర్శిస్తున్నారు. దీనికి వైసీపీ నేతలు కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. వంద కోట్లు కూడా లేని ఖజానాతో లక్షకోట్లు ఖర్ఛు చేసి రాజధాని నిర్మించడం గ్రాఫిక్స్ లో తప్ప యదార్ధంలో సాధ్యమయ్యే పనికాదంటున్నారు అధికార పార్టీ నేతలు. మరి రాజధాని అంశంలో ప్రభుత్వ వైఖరి మారుతుందా..? రైతుల ఆకాంక్ష నెరవేరుతుందా..? అనేది వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తేలనుంది.

  First published:

  ఉత్తమ కథలు