Allu Arjun: పుష్ప షూటింగ్ కు వర్షం బ్రేక్.. గ్యాప్ లో అల్లూ అర్జున్ ఏం చేశాడో తెలుసా..? ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ..

allu arjun in kakinada: అల్లు అర్జున్ కాకినాడలో సందడి చేశాడు.. పుష్ప సినిమా షూటింగ్ కు వర్షం అంతరాయం కలిగించడంతో.. విరామంలో ఏం చేశాడో తెలుసా..?

allu arjun in kakinada: అల్లు అర్జున్ కాకినాడలో సందడి చేశాడు.. పుష్ప సినిమా షూటింగ్ కు వర్షం అంతరాయం కలిగించడంతో.. విరామంలో ఏం చేశాడో తెలుసా..?

 • Share this:
  Allu Arjun: అల్లు అర్జున్ సుకుమార్ (Allu Arjun Sukumar) కాంబినేషన్‌లో పుష్ప అనే ప్యాన్ ఇండియా సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.  ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఫస్ట్ పార్ట్‌కు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి కావోచ్చింది. ఈ సినిమాకు చెందిన మొదటి భాగం షూటింగ్ ప్రస్తుతం ఏపీలోని మారేడు మిల్లి అడువుల్లో జరిగింది. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాను ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో రానుంది. ఇప్పటి వరకు ఏ సినిమాలోనూ కనిపించని విధంగా బన్నీ సరికొత్తగా మాస్ లుక్ లో అలరించనున్నాడని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్‌తో పాటు మలయాళీ నటుడు ఫహద్ ఫాసిల్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఫహద్ పాసిల్ (Fahadh Faasil ) ఫస్ట్ లుక్ ఇటీవల విడుదలై మంచి ఆదరణ పొందింది. అల్లు అర్జున్‌కు జోడిగా రష్మిక మందన్న  (Rashmika Mandanna) నటిస్తోంది. ఈ చిత్రంలో శాండల్‌వుడ్ యువ నటుడు ధనంజయ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఇటీవల దాక్కో దాక్కో మేక (Pushpa Daakko Daakko Meka song)  అనే ఊర మాస్ సాంగ్ విడుదలై సంచలనం సృష్టించింది.

  మొదట్లో ఒకే పార్ట్‌గా విడుదల చేద్దామనుకున్న ఈ సినిమా తర్వాత నిడివి పెరగడంతో రెండు పార్టులుగా విడుదల చేయాల్సి వచ్చింది. ఇప్పటికే శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమా కరోనా కారణంగా కొన్ని రోజులు ఆగినా ఇప్పుడు మళ్లీ వేగం పెరిగింది. ప్రస్తుతం పుష్ఫ చిత్రీకరణ కాకినాడలో జరుగుతుంది. ఇందులో భాగంగానే అల్లు అర్జున్‌ శనివారం కాకినాడ చేరుకున్నారు.

  ఇదీ చదవండి: ఆన్‌లైన్‌ ఫ్రెండ్ కోసం 300 కిలోమీటర్ల ప్రయాణం.. మద్యం, డ్రగ్స్ ఇచ్చి గ్యాంగ్ రేప్ చేసిన కామాంధులు

  బన్నీ ఫ్యాన్స్‌ పెద్ద ఎత్తున హంగామా చేశారు. కాకినాడ పోర్టు ఏరియాలో సినిమా చిత్రీకరణ జరుగుతోంది. షూటింగ్ కు అంతా సిద్ధమైన సమయంలో.. ఆ ఏరియాలో భారీగా వర్షం పడడంతో సినిమా షూటింగ్‌ వాయిదా పడింది. దీంతో అనుకోకుండా దొరికిన ఈ ఖాళీ సమయంలో బన్నీ ఏం చేశాడో తెలుసా.. గోపీచంద్ సినిమా సిటీమార్ ఇప్పటికే థియేటర్స్ లో సందడి చేస్తోంది. దీంతో గోపిచంద్ సినిమాకు ప్రమోషన్ అన్నట్టు.. సరదగా సిటీమార్ సినిమాను కాకినాడలోని ఓ థియేటర్‌లో వీక్షించాడు.

  ఇదీ చదవండి: నేడు నీట్‌ ఎంట్రెన్స్ టెస్ట్.. పరీక్షలో స్వల్ప మార్పులు.. కొత్త గైడ్​లైన్స్ ఇవే.. విద్యార్థులకు అలర్ట్

  గోపీచంద్‌ హీరోగా తెరకెక్కిన ‘సీటీమార్’ సినిమాను అభిమానులతో కలిసి చూశారు అల్లు అర్జున్.. దీంతో అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. బన్నీతో ఫొటోలు, సెల్ఫీలు దిగడానికి ఆసక్తి చూపించారు. మరి ఆదివారం అయినా షూటింగ్‌కు వాతావరణం అనుకూలిస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌ పార్ట్‌ను క్రిస్మస్‌ కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
  Published by:Nagesh Paina
  First published: