టీటీడీ బోర్డు సభ్యులకు కోటా... ఏ దర్శనం టికెట్లు ఎన్ని?

TTD Board Darshan Tickets : ఇటీవలే ఏర్పడిన టీటీడీ కొత్త బోర్డు... పాలక సభ్యులకు వివిధ దర్శనాలకు టికెట్లు కేటాయించింది.

news18-telugu
Updated: October 14, 2019, 1:29 PM IST
టీటీడీ బోర్డు సభ్యులకు కోటా... ఏ దర్శనం టికెట్లు ఎన్ని?
టీటీడీ బోర్డు సభ్యులకు కోటా... ఏ దర్శనం టికెట్లు ఎన్ని?
  • Share this:
TTD Board Darshan Tickets : టీటీడీ బోర్డు... పాలక మండలి సభ్యుల దర్శనం టికెట్ల కోటాను ఖరారు చేసింది. ప్రతి రోజూ ఉదయం వేళ... సుప్రభాతం దర్శనం టికెట్లు, రూ.300 ప్రత్యేక దర్శనం టిక్కెట్లు, తోమాల అర్చన, వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్ల కోటాను నిర్ధారించింది. దాని ప్రకారం... ప్రతీ సభ్యుడికీ... వీఐపీ బ్రేక్ దర్శనం కింద... మంగళవారం నుంచీ గురువారం వరకూ... రోజుకు 20 టికెట్లను అనుమతించింది. శుక్రవారం ఎలాంటి అనుమతీ లేదు. శనివారం, ఆదివారం మాత్రం 12 టికెట్ల చొప్పును అనుమతించింది. ఐతే... భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటే... వీఐపీ బ్రేక్ దర్శనాల్ని రద్దు చేస్తామని స్పష్టం చేసింది. ఐతే... తిరుమలకు భక్తుల రద్దీ ఎప్పుడూ ఎక్కువే. అందువల్ల వీఐపీ బ్రేక్ దర్శనాల వల్ల సామాన్య భక్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్న విమర్శలున్నాయి.

టీటీడీ బోర్డు సభ్యులకు కోటా... ఏ దర్శనం టికెట్లు ఎన్ని?


ఇక రూ.300 సుపథం దర్శనం కింద ఒక్కో సభ్యుడికీ రోజుకు 20 టికెట్లు కేటాయించింది. అలాగే... సుప్రభాత దర్శనం కింద వారానికి 4 టికెట్లు ఇస్తోంది. ఇక తోమాల లేదా అర్చన లేదా అష్టదల సేవల్లో వారానికి రెండు టికెట్లు ఇవ్వదలిచింది. కల్యాణోత్సవం కింద ఒక్కో సభ్యుడికీ వారానికి 4 టికెట్లు ఇస్తోంది.

సహస్ర కలశాభిషేకం లేదా తిరుప్పావడ సేవల కింద ఒక్కో సభ్యుడికీ రెండు వారాలకు రెండు టికెట్లు ఇవ్వదలచింది. పూర్ణాభిషేకం లేదా వస్త్రం సేవకు నాలుగు నెలల్లో ఇద్దరు వ్యక్తులు... బోర్డు సభ్యుడి కోటా కింద వెళ్లవచ్చు. ఈ కోటాలో బోర్డు సభ్యులు వెళ్లే దర్శనాలను కూడా కలిపి నిర్ణయించింది.

 

Anjali : అందాల బాల అంజలి క్యూట్ ఫొటోస్

ఇవి కూడా చదవండి :


గోదావరిలో బోటు వెలికితీత... లోపల అంతా బురదే...

ఛలో హైదరాబాద్ కలెక్టరేట్... జర్నలిస్టుల ధర్నా


భారత్‌లో స్వేచ్ఛను అనుభవిస్తున్నాం... దలైలామా ఆసక్తికర కామెంట్స్


తాగొచ్చిన భర్తను చావగొట్టిన భార్య... ఆ తర్వాత...

బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా సౌరవ్‌ గంగూలీ... దాదాపు ఖరారు
First published: October 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading