హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Andhra Pradesh: మరో వివాదంలో వైఎస్ జగన్ సర్కారు.., ప్రతిపక్షాల చేతికి మరో విమర్శనాస్త్రం

Andhra Pradesh: మరో వివాదంలో వైఎస్ జగన్ సర్కారు.., ప్రతిపక్షాల చేతికి మరో విమర్శనాస్త్రం

కరోనా కేసులు తగ్గుతున్నాయని నిర్లక్ష్యాన్ని దరిచేరనీయోద్దంటున్నారు సీఎం జగన్. 144 సెక్షన్ కఠినంగా అమలు చేయాలని.. అలాగే థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో మరింత అలర్ట్ గా ఉండాలని.. ఏపీ వ్యాప్తంగా కోవిడ్ సెంటర్లలో పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని అధికారులను ఆదేశిస్తున్నారు.

కరోనా కేసులు తగ్గుతున్నాయని నిర్లక్ష్యాన్ని దరిచేరనీయోద్దంటున్నారు సీఎం జగన్. 144 సెక్షన్ కఠినంగా అమలు చేయాలని.. అలాగే థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో మరింత అలర్ట్ గా ఉండాలని.. ఏపీ వ్యాప్తంగా కోవిడ్ సెంటర్లలో పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని అధికారులను ఆదేశిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కాంట్రాక్టులు, వర్క్ ఆర్డర్లు, మెటీరియల్ సరఫరా, ఇతర కొనుగోళ్ల విషయంలో ఆరోపణలు వస్తూనే ఉంటాయి. వైసీపీ (YSR Congress) ప్రభుత్వంపై కూడా ఇలాంటి విమర్శలే వస్తున్నాయి.

  ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కాంట్రాక్టులు, వర్క్ ఆర్డర్లు, మెటీరియల్ సరఫరా, ఇతర కొనుగోళ్ల విషయంలో ఆరోపణలు వస్తూనే ఉంటాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపైనా అలాంటి విమర్శలే వస్తున్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి చెందిన కంపెనీలకే ప్రభుత్వం నుంచి భారీగా ఆర్డర్లు వెళ్తున్నట్లు వస్తున్న వార్తలు చర్చనీయాంశమవుతున్నాయి. రాష్ట్రంలో ప్రముఖ సిమెంట్ కంపెనీ అయిన భారతీ సిమెంట్స్ కు వైఎస్ జగన్ సతీమణి భారతి డైరెక్టర్ గా ఉన్నారు. ఆ కంపెనీలో వైఎస్ కుటుంబానికి 49శాతం వాటాలున్నాయి ఈ ఆర్ధిక సంవత్సరంలోని గత 10 నెలల్లో భారతీ సిమెంట్స్ కు ప్రభుత్వం నుంచి 2,28,370 మెట్రిక్ టన్నుల సిమెంట్ ఆర్డర్స్ వెళ్లాయట.గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జనవరి 18వరకు 14శాతం సిమెంట్ సప్లై ఆర్డర్స్ ప్రభుత్వం నుంచి వెళ్లినట్లు సమాచారం.

  భారతీ సిమెంట్స్ లో ఫ్రాన్స్ కు చెందిన వికాట్ సంస్థకు 51శాతం వాటటాలున్నాయి. ఇక ప్రభుత్వం నుంచి ఆర్డర్స్ వెళ్లడంతో భారతీ సిమెంట్స్ తొలిస్థానంలో ఉంటే., రెండోస్థానంలో ఇండియా సిమెంట్స్ ఉంది. ఇండియా సిమెంట్స్ కు ఏపీ ప్రభుత్వం నుంచి 1, 59, 753 మెట్రిక్ టన్నుల ఆర్డర్స్ వెళ్లాయి. ఇది భారతి సిమెంట్స్ కు వెళ్లిన ఆర్డర్స్ కంటే 30శాతం తక్కువ. గతంలో ఇండియా సిమెంట్స్.., భారతీ సిమెంట్స్ లో రూ.95.32 కోట్లు పెట్టుబడి పెట్టి అనంతరం తన వాటాను ఫ్రెంచ్ కంపెనీకి విక్రయించింది. ఇక ప్రభుత్వం నుంచి పెన్నా సిమెంట్స్ కు 1,50,325 మెట్రిక్ టన్నుల వర్క్ ఆర్డర్ వెళ్లినట్లు సమాచారం.

  ఇక ఇండియా సిమెంట్స్ అధినేత ఎన్.శ్రీనివాసన్ కు వైఎస్ ఫ్యామిలీతో సన్నిహిత సంబంధాలున్నాయి. జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ నమోదు చేసిన కేసుల్లో శ్రీనివాసన్ కూడా నిందితుడిగా ఉన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇండియా సిమెంట్స్ కు నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ అనుమతులు, నీటి కేటాయింపులు జరిగినట్లు ఆరోపణలున్నాయి. ఏప్రిల్ 2012 - సెప్టెంబర్ 2014 మధ్య  CBI దాఖలు చేసిన 11 చార్జిషీట్లలో డాల్మియా సిమెంట్స్, ఇండియా సిమెంట్స్, రఘురామ్ సిమెంట్స్ (భారతి సిమెంట్స్) మరియు పెన్నా సిమెంట్స్ ఉన్నాయి. భారతీ, ఇండియా, పెన్నా సిమెంట్లకు 2020 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు దాదాపు మూడో వంతు ఆర్డర్లు ఈ కంపెనీలకే వెళ్లినట్లు సమాచారం.

  అంతా పారదర్శకంగానే...

  దీనిపై స్పందించిన రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.., ఆయా కంపెనీలకు భారీగా సిమెంట్ సరఫరా చేయగలిగే సామర్ధ్యం ఉన్నందునే ప్రభుత్వం నుంచి ఆర్డర్స్ వెళ్తున్నట్లు తెలిపారు. ఇందులో ఎలాంటి పక్షపాతం లేదన్నారాయన. ప్రభుత్వం ఎలాంటి కొనుగోళ్లు జరిపినా అవి పూర్తి పారదర్శకంగా జరుగుతాయని స్పష్టం చేశారు.

  అంతా ఆన్ లైన్లోనే

  ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ నిర్మాణ్ పోర్టల్ ద్వారా కంపెనీలకు ఆన్ లైన్ ద్వారానే ఆర్డర్లు వెళ్తున్నాయి. ప్రభుత్వం చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు, గృహనిర్మాణ పథకాలకు అవసమైన మెటిరీయల్ ను ఈ పోర్టల్ ద్వారానే కొనుగోలు చేస్తున్నారు. ఈ పోర్టల్ ప్రభుత్వంతో సిమెంట్ తయారీ స్థంస్థలను అనుసంధానం చేస్తుంది. ఈ సంస్థల నుంచి ప్రభుత్వం సిమెంట్ బస్తా ధర రూ.225గా నిర్ణయించింది. వైఎస్ఆర్ నిర్మాణ్ పోర్టల్ ద్వారా సిమెంట్ కంపెనీలకు జిల్లా కలెక్టర్లు కొనుగోలు ఆర్డర్లు ఇస్తుంటారు. కాబట్టి ఇందులో ఎలాంటి అవకతవకలు తావులేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

  పక్షపాతానికి తావులేదు

  ప్రభుత్వం నుంచి వస్తున్న కొనుగోలు ఆర్డర్లలో ఎలాంటి పక్షపాతం లేదని భారతీ యాజమాన్యం కూడా చెప్తోంది. గత ప్రభుత్వ హయాంలో తాము సిమెంట్ బస్తా రూ.230 చొప్పున సప్లై చేసినట్లు స్పష్టం చేశారు. సిమెంట్ కొనుగోళ్ల కేటాయింపుల్లో ఎలాంటి పేవరెటిజమ్ ఉండదని.,కంపెనీల మార్కెట్, ఉత్పత్తి సామర్ధ్యాన్ని బట్టి ఆర్డర్స్ వెళ్తాయన్నారు. మరోవైపు వైఎస్ జగన్ ప్రభుత్వం తన బంధువుల కంపెనీలకు లబ్ధి చేకూర్చేందుకే ప్రభుత్వం నుంచి ఆర్డర్స్ ఇప్పిస్తున్నారని ప్రతిపక్ష టీడీపీ ఆరోపిస్తోంది. అలాగే భారతీ సిమెంట్స్ ఆధ్వర్యంలో సిండికేట్ గా ఏర్పడుతున్న సిమెంట్ కంపెనీలు ధరలు పెంచి ప్రజలపై భారం వేస్తున్నారని మండిపడుతున్నారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Andhra pradesh news, Ap cm ys jagan mohan reddy, Ys bharathi

  ఉత్తమ కథలు