విజయవాడలో స్వర్ణప్యాలెస్ అగ్నిప్రమాద ఘటన మరవక ముందే అనంతపురంలో తీవ్ర కలకలం రేగింది. సర్వజన ఆస్పత్రి రికార్డు రూమ్‌లో మంటలు చెలరేగాయి. సిబ్బంది అప్రమత్తమై సకాలంలో కోవిడ్ రోగులకు వేరొక వార్డుకు షిఫ్ట్ చేయడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే అనంతపురం జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో ఫోన్‌లో రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మత్రి ఆళ్ల నాని మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడుని ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్‌లో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తున్నాయా..లేదా.. క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని స్పష్టం చేశారు.
ఇక ప్రెవేట్ హాస్పిటల్‌లో రోగులు నుండి అధిక ఫీజులు వసూలు చేస్తే ప్రభుత్వ పరంగా కఠినంగా చర్యలు ఉంటాయని మరోసారి హెచ్చరించారు ఆళ్ల నాని. అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో అగ్ని మాపక సిబ్బంది సకాలంలో స్పందించి నివారణ చర్యలు చేపట్టారని... కేవలం రికార్డు రూమ్‌లో కొన్ని పుస్తకాలు, పాత ఎక్సరేలు మాత్రమే అగ్ని ఆహుతయ్యాయని అన్నారు. అన్ని ఆస్పత్రుల్లో భద్రత ప్రమాణాలు పరిశీలించి చర్యలు చేపట్టాలని ఆదేశించారు ఆళ్ల నాని. కాగా, ఆగస్టు 9న విజయవాడలోని స్వర్ణప్యాలెస్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. రమేష్ ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోవిడ్ సెంటర్‌లో అగ్నిప్రమాదం జరగడంతో 10 మంది మరణించారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాద జరిగింది. ఆ ఘటనపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Alla Nani, Anantapuram, Andhra Pradesh, AP News