హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

టెన్త్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. అందరినీ పాస్ చేస్తూ ఏపీ ప్రభుత్వం జీవో

టెన్త్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. అందరినీ పాస్ చేస్తూ ఏపీ ప్రభుత్వం జీవో

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

పదో తరగతి పరీక్షలకు దరఖాస్తు చేసిన హాల్ టికెట్లు పొందిన వారంతా ఉత్తీర్ణులయినట్లు ప్రకటించింది. ఐతే విద్యార్థులందరికీ ఎలాంటి గ్రేడ్ పాయింట్లు ఇవ్వకుండా పాస్ అయినట్లు తెలిపింది.

  పదో తరగతి విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీచేసింది. పదో తరగతి పరీక్షలకు దరఖాస్తు చేసిన హాల్ టికెట్లు పొందిన వారంతా ఉత్తీర్ణులయినట్లు ప్రకటించింది. ఐతే విద్యార్థులందరికీ ఎలాంటి గ్రేడ్ పాయింట్లు ఇవ్వకుండా పాస్ అయినట్లు తెలిపింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజేశేఖర్ ఉత్తర్వులు జారీచేశారు. SSCతో పాటు OSSC, ఒకేషనల్ పరీక్షలను రద్దుచేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

  కరోనా విజృంభణ నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను రద్దుచేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ఇది వరకే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జూలై 31 వరకు అన్ని కంటైన్‌మెంట్ జోన్లలో లాక్‌డౌన్‌ అమల్లో ఉంది. జూలై నెలాఖరు వరకు స్కూళ్లు, కాలేజీలు తెరవకూడదని ఇప్పటికే కేంద్రం స్పష్టం చేసింది. ఐతే డిగ్రీ పరీక్షలను మాత్రం ఖచ్చితంగా నిర్వహించాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం స్పష్టం చేసింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్షలను నిర్వహించుకోవచ్చని తెలిపింది.

  ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. ప్రతి రోజు రికార్డు స్థాయిలో కొత్త కేసులు వస్తున్న నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలు తెరుచుకోలేని పరిస్థితి నెలకొంది.

  కాగా, ఏపీలో ఇప్పటి వరకు 33,019 కరోనా పాజటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా నుంచి 17,467 మంది డిశ్చార్జి కాగా.. ఇప్పటి వరకు 408 మంది మరణించారు. ప్రస్తుతం ఏపీలో 15,144 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇక పరీక్షల విషయానికొస్తే.. గడిచిన 24 గంటల్లో 22,670 శాంపిల్స్ పరీక్షించగా.. 1,916 మందికి పాజిటివ్ వచ్చింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 11,95,766 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ తెలిపింది

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: 10th Class Exams, 10th class results, Andhra Pradesh, AP News, AP ssc results, Ssc exams

  ఉత్తమ కథలు