ALL POLITICAL PARTIES CAMPAIGN ENDING IN AP MUNICIPAL ELECTIONS NGS
AP Municipal Elctions: ఏపీలో ముగిసిన ఎన్నికల ప్రచారం.. ఆఖర్లో జోరుగా ప్రలోభాల పర్వం.. ఎక్కడివారక్కడే గప్ చుప్
మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం
ఏపీలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. బయటి ప్రాంతాల నేతలు వెళ్లిపోవాల్సిందే. స్థానిక నేతలు మాత్రమే ఉండాలి. సమయం దాటిపోడంతో ఎక్కడా జెండాలు కనిపించకూడదు. ప్రచారం అసలే చేయకూడదు. అయితే ప్రచారం ముగిసినా చాలా చోట్ల ప్రలోభాలు మాత్రం ఆగడం లేదని సమాచారం.
గత కొన్ని రోజుల నుంచి చెవుల్లో జోరీగల్లా సౌండ్ చేసిన మైకుల మోత ఆగింది. అంతా నిశ్వబ్ధం అయ్యింది. ఎక్కడికక్కడ ప్రచారాలు ముగిశాయి. ప్రచార గడువు ముగియడంతో ప్రచార రథాలన్నీ ఇంటికి పరిమితం అయ్యాయి. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్నికల ప్రచారం సాధరణ ఎన్నికల రేంజ్ లో సాగింది. అధికార, ప్రతిక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.
ఆరోపణలు, విమర్శల పర్వం హద్దులు దాటింది. రాష్టంలో రాజకీయ రచ్చ రేపిన మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి బ్రేకు పడింది.
పంచాయతీ ఎన్నికల ఫలితాలతో ఫుల్ జోష్‌లో ఉన్న అధికార పార్టీ.. మున్సిపాలిటీల్లోనూ అంతకు మించి ఫలితాలు సాధిస్తామంటోంది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కూడా పట్టణాల్లో తమ సత్తా చూపిస్తామంటోంది. అటు జనసేన బీజేపీ కూటమి కూడా తామేమి తక్కువ కాదంటోంది. మరి ఈ నెల 14న వెలువడే ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి..
బుధవారం అంటే 10వ తేదీన రాష్ట్రంలోని 12 మున్సిపాలిటీలు, 75 కార్పొరేషన్లకు పోలింగ్ జరగనుంది. ఈ నెల 14న కౌటింగ్ జరగనుంది. మొత్తం 12 కార్పొరేషన్లలో 671 డివిజన్లు ఉంటే.. 89 ఏకగ్రీవం అయ్యాయి. 582 డివిజన్లలో ఎన్నికలు జరుగుతాయి. 75 మున్సిపాల్టీల్లో 2123 వార్డులు ఉంటే.. 490 ఏకగ్రీవం అయ్యాయి. 1633 వార్డులకు ఎన్నికలు ఉన్నాయి. ఏకగ్రీవాల్లో వైసీపీ 570 వార్డులు వచ్చాయి. టీడీపీకి ఆరు, బీజేపీకి ఒకటి, ఇతరులు రెండు చోట్ల ఏకగ్రీవంగా గెలిచారు. పుంగనూరు, పులివెందుల, మాచర్ల, పిడుగురాళ్లల్లో వైసీపీ క్లీన్‌స్వీప్ చేసింది. ఏకగ్రీవాలను బట్టి రాయచోటి, పలమనేరు, ఆత్మకూరు మున్సిపాల్టీలు వైసీపీవే. నాయుడుపేట, సూళ్లురుపేట, కొవ్వూరుల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులే చైర్మన్లు అవుతారు. డోన్, తుని మున్సిపాల్టీల్లోనూ వైసీపీదే హవా. మరి ఫలితాలు ఎలా వస్తాయో చూడాలి.
ఆఖరి రోజు సైతం అన్ని పార్టీలు స్పీడుగా ప్రచారాన్ని ముగించాయి. ప్రచారం ముగిసిన.. ప్రలోభాల పర్వం జోరుగా సాగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. ఇవాళ్లి రాత్రి నుంచి పోలింగ్ మంగళవారం రాత్రి వరకు ఈ ప్రలోభాల పర్వం జోరందుకునే అవకాశం ఉంది. ఇప్పటికే భారీగా మద్యం ఏరులై పారుతున్నట్టు తెలుస్తోంది. భారీగా షాపుల నుంచి స్టాక్ తెచ్చి పెట్టుకున్న అభ్యర్థులు.. మందుబాబులను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. తాగినోళ్లకు తాగినంత అని చెప్పుకుంటున్నారు.
పోలింగ్‌కు సంబంధించి ఎప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. డబ్బు, మద్యం పంపిణీపై ఫిర్యాదులు రావడంతో… ఎస్ఈసీ గట్టి నిఘా ఏర్పాటు చేసింది. ఏర్పాట్లన్నీ పూర్తి చేశామని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించారు. పంచాయతీ ఎన్నికల మాదిరి పట్టణ ప్రజలు కూడా భారీగా ఓట్లు వేయాలని పిలుపు ఇచ్చారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల ప్రక్రియ అంతా సవ్యంగానే సాగింది అన్నారు.
Published by:Nagesh Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.