ఆధార్ డేటా లీకేజ్‌ అవాస్తవం..తెలంగాణ పోలీసుల ఆరోపణల్లో పసలేదు: ఏపీ ఐటీశాఖ

ఏపీలోని మూడున్నర కోట్లమంది ఓటర్ల డేటాను ఐటీ గ్రిడ్స్ సంస్ధ అక్రమంగా ప్రభుత్వ సర్వర్ల నుంచి డౌన్ లౌడ్ చేసుకుని అమెజాన్, గూగుల్ సర్వర్లలో స్టోర్ చేసుకున్నట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ ప్రకటించిన నేపథ్యంలో ఏపీ ఐటీశాఖ ఈ వివరణ ఇచ్చింది.

news18-telugu
Updated: March 5, 2019, 8:45 PM IST
ఆధార్ డేటా లీకేజ్‌ అవాస్తవం..తెలంగాణ పోలీసుల ఆరోపణల్లో పసలేదు: ఏపీ ఐటీశాఖ
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
(సయ్యద్ అహ్మద్, కరెస్పాండెట్, న్యూస్ 18 తెలుగు)

ఏపీలో సంక్షేమ పథకాల సమాచారం చౌర్యంపై వస్తున్న ఆరోపణలను ఏపీ ప్రభుత్వం ఖండించింది. ఆధార్, పల్స్ సర్వే సహా ఏ విధమైన సున్నితమైన సమాచారం కూడా బయటకు వెళ్లే అవకాశమే లేదని ఏపీ ఐటీ శాఖ క్లారిటీ స్పష్టం చేసింది.  ఆధార్ సమాచారాన్ని UIDIA గోప్యంగా ఉంచుతుందని.. అటు ప్రజా సాధికార సర్వే డేటా సైతం పూర్తిస్థాయిలో భద్రంగా ఉందని ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి విజయానంద్ తెలిపారు.  ఈ వ్యవహారంలో తెలంగాణ పోలీసులు చేస్తున్న ఆరోపణల్లో పస లేదని చెప్పుకొచ్చారు.

ఏపీలో సంక్షేమ పథకాల అమలు కోసం తాము సేకరించిన డేటా భద్రంగా ఉందని ప్రభుత్వం ప్రకటించింది. టీడీపీకి చెందిన సేవా మిత్ర యాప్ కోసం హైదరాబాద్ కు చెందిన ఐటీ గ్రిడ్స్ సంస్ధ తమ సర్వర్ల నుంచి డేటా సేకరించినట్లు వస్తున్న ఆరోపణలు నిజం కావని ఏపీ ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి విజయానంద్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో మూడున్నర కోట్ల మంది ఓటర్ల ఆధార్ డేటా లీకయినట్లు జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదన్నారు. వందశాతం ఆధార్ డేటా సీడింగ్ అయిందన్నారు. ఆధార్ ప్రాధికార సంస్ధ ఈ సమాచారాన్ని పూర్తిస్ధాయిలో గోప్యంగానే ఉంచుతుందన్నారు.

గతంలో ప్రభుత్వం చేపట్టిన ప్రజా సాధికార సర్వేలో సేకరించిన డేటా కూడా లీకయ్యే ఛాన్స్ లేదని ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి విజయానంద్ తెలిపారు. పీపుల్స్ పల్స్ సర్వే సర్లర్లలో మాత్రమే ఉంటుందన్నారు. ఈ డేటాలో ఎక్కడా లీకేజీలు లేవన్నారు. రాష్ట్రంలో పీపుల్స్ పల్స్ సర్వే ఆధారంగానే రేషన్ కార్డులు, నిరుద్యోగ భృతి, తిత్లీ తుపాను బాధితులకు సాయం, పింఛన్లు, పసుపు-కుంకుమ వంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు ఐటీశాఖ వెల్లడించింది. 1100 నంబరుకు వచ్చే డేటాను కూడా ప్రభుత్వ శాఖలకు ఇవ్వడం లేదని తెలిపింది. డేటా చోరీ కాకుండా ఎక్కడికక్కడ పటిష్టమైన వ్యవస్ధను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది.

ఏపీలోని మూడున్నర కోట్లమంది ఓటర్ల డేటాను ఐటీ గ్రిడ్స్ సంస్ధ అక్రమంగా ప్రభుత్వ సర్వర్ల నుంచి డౌన్ లౌడ్ చేసుకుని అమెజాన్, గూగుల్ సర్వర్లలో స్టోర్ చేసుకున్నట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ ప్రకటించిన నేపథ్యంలో ఏపీ ఐటీశాఖ ఈ వివరణ ఇచ్చింది. మరోవైపు సైబరాబాద్ పోలీసులు ఎఫ్.ఎస్.ఎల్ కు పంపిన కంప్యూటర్ హార్డ్ డిస్క్ లు, ఇతర సామాగ్రిని విశ్లేషించిన తర్వాతే డేటా చౌర్యంపై నిజానిజాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.
First published: March 5, 2019, 8:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading