విశాఖ రైల్వే ప్రయాణికులకు హెచ్చరిక.. స్టేషన్‌లో ఉమ్మి ఊస్తే...

విశాఖ రైల్వేస్టేషన్‌లో 47 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. విశాఖలోని ఎనిమిది ప్లాట్‌ఫాంల్లో ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.

news18-telugu
Updated: February 14, 2020, 5:34 PM IST
విశాఖ రైల్వే ప్రయాణికులకు హెచ్చరిక.. స్టేషన్‌లో ఉమ్మి ఊస్తే...
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
విశాఖలో రైల్వే ప్రయాణికులకు హెచ్చరిక. విశాఖ రైల్వే స్టేషన్‌ను పరిశుభ్రంగా ఉంచేందుకు రైల్వే అధికారులు కొత్త కొరడాతో సిద్ధమయ్యారు. ఇకపై రైల్వే స్టేషన్‌లో ఎవరైనా ఉమ్మి ఊస్తే వారికి జరిమానా విధిస్తారు. ఉమ్మి ఊసిన వారికి రూ.300 ఫైన్ వేస్తారు. ఈ మేరకు విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో ప్రచార చిత్రాలను ఏర్పాటు చేశారు. రైల్వేస్టేషన్‌ను పరిశుభ్రంగా ఉంచాలంటూ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. తాజాగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఆదేశాలు జారీ చేసినట్టు ఆర్పీఎఫ్ అధికారులు చెబుతున్నారు. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి కొత్త ఫైన్లు అమల్లోకి వచ్చినట్టు చెప్పారు. రైల్వే స్టేషన్‌ పరిసరాల్లో చెత్తా చెదారం వేయడం, బాత్రూమ్‌ల్లో అపరిశుభ్రంగా చేయడం, మంచినీళ్లు తాగే చోట బురద బురదగా చేయడం, స్టేషన్‌లో కుర్చీలు పాడు చేయడం, లిఫ్ట్‌లు, మెట్ల మీద చెత్త పడేసే వారి వద్ద నుంచి ఇప్పటి వరకు సుమారు రూ.30,000 జరిమానా విధించినట్టు సమాచారం.

విశాఖ రైల్వేస్టేషన్‌లో 47 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. విశాఖలోని ఎనిమిది ప్లాట్‌ఫాంల్లో ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. 2019 సంవత్సరంలో జరిమానాల కింద ప్రయాణికుల వద్ద రూ.29,000 వసూలు చేశారు. ఈ ఏడాది అంతకంటే ఎక్కువ జరిమానాలు వసూలు అయ్యాయి. ఏ ప్రాంతంలో ఏ ప్రయాణికుడు చెత్తను పడేస్తున్నాడనే విషయాన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు అధికారులు. ఎవరైనా చెత్తను ఇష్టం వచ్చినట్టు స్టేషన్ పరిసరాల్లో పడేస్తే వెంటనే వారికి జరిమానాలు విధిస్తున్నారు. ప్లాట్‌ఫాంలో ఏర్పాటు చేసిన చెత్తడబ్బాల్లో మాత్రమే చెత్తను వేయాలంటూ ప్రచారం చేస్తున్నారు. అలాగే, స్టేషన్‌లో చిరుతిళ్లు విక్రయించే వ్యాపారులకు కూడా కచ్చితంగా నిబంధనలు పాటించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

First published: February 14, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు