హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Akhanda Movie: అఖండకు ఓ వైపు రికార్డుల మోత.. మరోవైపు అపశృతులు.. థియేటర్‌లో భారీగా మంటలు.. భయంతో ప్రేక్షకుల పరుగులు

Akhanda Movie: అఖండకు ఓ వైపు రికార్డుల మోత.. మరోవైపు అపశృతులు.. థియేటర్‌లో భారీగా మంటలు.. భయంతో ప్రేక్షకుల పరుగులు

Akhanda Photo : Twitter

Akhanda Photo : Twitter

Akhanda Movie: నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా ఓ వైపు కలెక్షన్లు రికార్డు కొనసాగిస్తోంది. కరోనా తరువాత ఇండస్ట్రీకి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందించాడు బాలయ్య.. అందుకే రికార్డులు సునామిలా విరుచుకుపడుతున్నాయి. ఆ ఏరియా, ఈ ఏరియా అని తేడా లేకుండా థియేటర్ లో మాస్ జాతర సందడి చేస్తోంది. ఇలా ఓ వైపు రికార్డుల పరంపర కొనసాగుతూంటే.. మరోవైపు అపశృతులు చోటు చేసుకుంటున్నాయి.

ఇంకా చదవండి ...

  Akhanda Movie Update:  కరోనా సెకండ్ వేవ్ (Corona Second wave) తర్వాత బాక్సాఫీస్ దగ్గర బాలయ్య ఊచకోత చూసిన తర్వాత ఎవరైనా ఇది బాలయ్య రేంజ్ అనాల్సిందే. టికెట్ రేట్లు తగ్గించారు.. కరోనా నిబంధనలు పాటించమన్నారు.. ఇన్ని ఆంక్షలున్నా బాలయ్య మాత్రం మామూలుగా రచ్చ చేయలేదు. బోయపాటి (Boyapati Sreenu) దర్శకత్వంలో బాలయ్య నటించిన అఖండ (Akhanda) సినిమా  కలెక్షన్స్ ట్రెండింగ్ అవుతున్నాయి.  బాలయ్య (Balakrishna) జూలు విదిలిస్తే ఇలా ఉంటుందా బాక్సాఫీస్ దగ్గర రచ్చ ఈ స్థాయిలో ఉంటుందా అనేలా మాస్ జాతరం చూపించాడు. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా, జగపతిబాబు, శ్రీకాంత్‌, పూర్ణ కీలక పాత్రలో నటించారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి వసూళ్లను రాబడుతోంది.

  అన్నిచోట్లా హౌజ్ ఫుల్ బోర్డులు పడటమే కాదు.. చాలా చోట్ల రికార్డులు కూడా తిరగరాసాడు బాలయ్య. చాలా రోజుల తర్వాత.. ఇంకా మాట్లాడితే చాలా సంవత్సరాల తర్వాత బాలయ్య సినిమా రికార్డు ఓపెనింగ్స్ తీసుకొచ్చింది. టాలీవుడ్ లోనే కాదు.. బాలీవుడ్ లో  నందమూరి నట సింహం బాలకృష్ణ  (Balakrishna)  సునామీ కొనసాగుతోంది. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ అఖండ (Akhanda).  రికార్డుల పరంగా సునామీలా విరుచుకుపడుతోంది.

  ఇదీ చదవండి: బిగ్ బాస్ ద్వారా ప్రియాంక ఎంత సంపాదించిందంటే? వెళ్తూ వెళ్తూ విన్నర్ ఎవరో చెప్పేసింది

  ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్‌ ఓ రేంజ్‌లో అమ్ముడు పోయాయని తెలుస్తోంది. అఖండ హిందీ డబ్బింగ్ హక్కులను ప్రముఖ పంపిణీ సంస్థకు విక్రయించింది చిత్రబృందం. కేవలం హిందీ డబ్బింగ్ రైట్స్ నుంచి రూ. 20 కోట్లను అందాయని అంటున్నారు. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.

  ఇదీ చదవండి: వైసీపీకి ఊహించని షాక్.. ఆమె అనుమతిస్తే కన్నీళ్లతో కాళ్లు కడుగుతాం.? అధికార పార్టీ ఎమ్మెల్యే

  ఇలా అఖండ సినిమా ఓ వైపు రికార్డులు కొల్లగొడుతూ ఉంటే.. మరోవైపు అనుకోని ఘటనలు ఆందోళన పెంచుతున్నాయి. తాజాగా అఖండ సినిమాను ప్రదర్శిస్తున్న ఓ థియేటర్లో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో ప్రేక్షకులు భయాందోళనకు గురయ్యారు. శ్రీకాకుళంలోని రవిశంకర్‌ థియేటర్‌లో తెరవెనుక ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భయభ్రాంతులకు గురైన ప్రేక్షకులు బయటకు పరుగులు తీశారు. సౌండ్‌ సిస్టమ్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఈ మంటలు చెలరేగాయి. వెంటనే థియేటర్‌ సిబ్బంది మంటలను అదుపులోకి తీసురావడంతో ప్రేక్షకులు ఊపిరి పీల్చుకున్నారు. సౌండ్‌ సిస్టమ్‌లో నుంచి పొగలు, మంటలు చెలరేగడంతో భయాందోళన కలిగించింది.


  ఇదీ చదవండి: ఆయన వల్లే ఈ స్థాయిలో ఉన్నా.. అసెంబ్లీలో మంత్రిగా తొలి అనుభవాన్ని గుర్తు చేసుకున్న హరీష్ రావు

  మరోవైపు సినిమా విడుదలైన తొలి రోజే అనూహ్య ఘటన జరిగింది. సినిమా సంచలన విజయం వైపు అడుగులు వేస్తుందనే  ఆనంద సమయంలో బాలయ్య అభిమానులకు బ్యాడ్ న్యూస్ వచ్చింది. అభిమానులంతా థియేటర్ల దగ్గర పండగ చేసుకుంటున్న ఈ సమయంలో ఓ ఎగ్జిబ్యూటర్ కమ్ బాలయ్య అభిమాని హఠాన్మరణం చెందడం అందరినీ విషాదంలోకి నెట్టేసింది. ఇలా ఊహించని ఘటనలు అభిమానులకు షాక్ ఇస్తున్నాయి.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Akhanda, Akhanda movie, Bala Krishna, Nandamuri balakrishna, Tollywood

  ఉత్తమ కథలు