తిరుమలపై రెండు రోజులుగా చక్కర్లు కొడుతున్నవిమానం... టీటీడీ ఫిర్యాదు

తిరుమలపై విమానం ఎగరడాన్ని గుర్తించిన టీటీడీ విజిలెన్స్‌ అధికారులు.. చెన్నై ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌ (ఏటీసీ)కు ఫిర్యాదు చేశారు.

news18-telugu
Updated: February 5, 2020, 3:25 PM IST
తిరుమలపై రెండు రోజులుగా చక్కర్లు కొడుతున్నవిమానం... టీటీడీ ఫిర్యాదు
తిరుమల ఆలయం
  • Share this:
తిరుమల కొండపై మరోసారి విమానం హల్ చల్ చేసింది. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ‘నో ఫ్లైయింగ్‌ జోన్‌’గా ప్రకటించిన తిరుమలపై కేంద్రానికి చెందిన సర్వే ఆఫ్‌ ఇండియా(ఎస్‌వోఐ) ఛార్టెర్డ్‌ విమానం రెండు రోజులుగా చక్కర్లు కొడుతోంది. ఐదేళ్లకోసారి విమానాల ద్వారా దేశ భౌగోళిక పరిస్థితులను ఎస్‌వోఐ సర్వే చేయిస్తుంది. వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీవారి విమాన వేంకటేశ్వరస్వామికి ఎగువన విమానాలు వెళ్లకూడదనే నియమం ఉంది. దీనిపై గతంలోనూ ఏవియేషన్‌ ఆఫ్‌ ఇండియాకు తిరుమల తిరుపతి దేవస్థానం ఫిర్యాదు చేసింది.  ప్రస్తుతం రెండు రోజులుగా తిరుమలపై విమానం ఎగరడాన్ని గుర్తించిన టీటీడీ విజిలెన్స్‌ అధికారులు.. చెన్నై ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌ (ఏటీసీ)కు ఫిర్యాదు చేశారు. ఇకపై తిరుమల క్షేత్రంపైకి విమానాలు పంపబోమని ఏటీసీ అధికారులు చెప్పారన్నారు... విజిలెన్స్‌ వీజీవో మనోహర్‌.

తిరుమల కొండపై విమానాలు తిరిగరాదనే ఇప్పటికే ఏపీ ప్రభుత్వం సైతం కేంద్రాన్ని కోరింది. ఆగమశాస్త్రం ప్రకారం విమానాలు కొండపై తిరగరాదని టీటీడీ అధికారులు చెబుతున్నారు. తిరుమల కొండపై దేవతలు విహరిస్తుంటారని... అందుకే ఆ ప్రాంతంలో విమానాలు నిషేధమన్నారు. ఇటు సైన్స్ ప్రకారం... ఆ ప్రాంతంలో పాజిటివ్ రేస్ ఎక్కువగా ఉంటాయి. అందుకే అక్కడ ఎలాంటి విమానాలు తిరిగినా అవి పేలిపోయి ప్రమాదాలు జరుగుతుంటాయని తేలింది. గతంలో బ్రిటీష్ వారి హయాంలో రెండు విమానలు పేలినట్లు ఆధారాలున్నాయని అధికారులు తెలిపారు.

Published by: Sulthana Begum Shaik
First published: February 5, 2020, 9:13 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading