హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Congress: ఏపీ కాంగ్రెస్‌కు కొత్త అధ్యక్షుడు.. ప్రక్షాళన మొదలుపెట్టిన మల్లిఖార్జున ఖర్గే

AP Congress: ఏపీ కాంగ్రెస్‌కు కొత్త అధ్యక్షుడు.. ప్రక్షాళన మొదలుపెట్టిన మల్లిఖార్జున ఖర్గే

గిడుగు రుద్రరాజు

గిడుగు రుద్రరాజు

Congress Party: 2014కు ముందు కాంగ్రెస్ (Congress)కి ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) కంచుకోటగా ఉండేది. కానీ ఏపీ విభజన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కాంగ్రెస్ పార్టీ పాతాళానికి పడిపోయింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఏపీ కాంగ్రెస్‌ (AP Congress)కి కొత్త అధ్యక్షుడొచ్చారు. ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడి (APCC Chief)గా గిడుగు రుద్రరాజు (Gidugu Rudraraju)ను కాంగ్రెస్ హైకమాండ్ నియమించింది. ఇప్పుడున్న శైలజానాథ్‌(Sailajanath)ను పీసీసీ చీఫ్  పదవి నుంచి తప్పించి.. ఆయన స్థానంలో రుద్రరాజుకు అవకాశం ఇచ్చింది. 18 మందితో పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీతో పాటు 34 మందితో కో ఆర్డినేషన్‌ కమిటీని నియమిస్తూ.. ఏఐసీసీ బుధవారం రాత్రి ప్రకటన విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లుగా అధ్యక్షుడిగా మస్తాన్ వలి, సుంకర పద్మశ్రీ, జంగా గౌతమ్, రాకేశ్‌రెడ్డి, పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌గా మాజీ ఎంపీ హర్షకుమార్‌‌గా ఉంటారు. ఇక కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌గా మాజీ మంత్రి పల్లం రాజు, మీడియా, సామాజిక మాధ్యమాల కమిటీ చైర్మన్‌ బాధ్యతలను తులసిరెడ్డికి అప్పగించింది. ఈ మేరకు పార్టీ వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు.

2014కు ముందు కాంగ్రెస్ (Congress) పార్టీకి ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) కంచుకోటగా ఉండేది. కానీ ఏపీ విభజన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కాంగ్రెస్  పాతాళానికి పడిపోయింది. ఆ పార్టీని ఆదరించేవారే కరవయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత ఏ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ కనీసం పోటీ ఇవ్వలేకపోయింది. 2014, 2019 ఎన్నికల్లో కనీసం ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. అంతెందుకు పంచాయతీ ఎన్నికల్లో కూడా పట్టు నిలుపుకోలేకపోయింది. ఆ పార్టీ నేతలు కూడా ప్రజల్లో పెద్దగా క్రీయాశీలంగా లేరు. ప్రజా సమస్యలపై గళం విప్పడం లేదు.

కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) భారత్ జోడో యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు యాత్ర చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ.. వారికి భరోసానిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లిఖార్జున ఖర్గే (Mallikarjuna Kharge) కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా ఏపీలో కూడా నాయకత్వాన్ని పూర్తిగా మార్చేశారు. కనీసం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అయినా తమ అస్తిత్వాన్ని చాటు కోవాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. అందుకోసం ఇప్పటి నుంచి ప్రణాళిక రూపొందించే పనిలో ఉన్నారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Congress

ఉత్తమ కథలు