కేంద్ర బడ్జెట్‌తో మారిన జగన్ మనసు... ఏపీలో 25 కంటే ఎక్కువ జిల్లాలు...

వైఎస్ జగన్మోహన్ రెడ్డి

ఏపీలో కొత్తగా మూడు జిల్లాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించడానికి అసలు కారణమే మెడికల్ కాలేజీల ఏర్పాటు. ఆ మూడు జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడానికి ఇప్పటికే సిద్ధమైంది.

 • Share this:
  ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల సంఖ్యను మరింత పెంచే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బడ్జెట్‌ను చూసిన తర్వాత జిల్లాల సంఖ్య 25 కంటే ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ 2020 - 21లో వైద్యుల సంఖ్య పెంచేందుకు ఓ కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. ప్రతి జిల్లా ఆస్పత్రికి అనుబంధంగా ఓ మెడికల్ కాలేజీని నిర్మించాలని ప్రతిపాదించారు. అది పీపీపీ పద్ధతిలో నిర్మించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్కువ ధరకు భూమిని కేటాయిస్తే ఆ స్థలంలో పీపీపీ పద్ధతిలో నిర్మిస్తారు. దీని వల్ల ప్రతి సంవత్సరం కొత్తగా ఎక్కువ మందికి మెడిసిన్‌లో సీటు వస్తుంది. ఒక్కో ఆస్పత్రికి ప్రాథమికంగా 50 సీట్లు కేటాయించినా... ఎన్ని జిల్లాలు ఉంటే అన్ని మెడికల్ సీట్లు పెరుగుతాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు మరిన్ని ఎక్కువ మెడికల్ సీట్లు దక్కించుకోవాలంటే.. జిల్లాల సంఖ్యను పెంచుకోవడం ఉత్తమం. ఈ దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది.

  ఏపీలో మున్సిపల్ ఎన్నికలు... ఎప్పుడంటే... | minister botsa satyanarayana clarifies on municipal elections in Andhra Pradesh ak
  ఆంధ్రప్రదేశ్ మ్యాప్


  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ 33 జిల్లాలను ఏర్పాటు చేశారు. 10 జిల్లాలను 33 జిల్లాలు చేశారు. ఈ ప్రాతిపదికన 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ను ఇంకా ఎక్కువ జిల్లాలు చేయడానికి అవకాశం ఉంది. అలాగే, జిల్లాలు కావాలని చాలా కాలంగా డిమాండ్లు చేస్తున్న వారి కోరికలు కూడా నెరవేర్చినట్టు అవుతుంది. ఏపీలో కొత్తగా మూడు జిల్లాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించడానికి అసలు కారణమే మెడికల్ కాలేజీల ఏర్పాటు. ఆ మూడు జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడానికి ఇప్పటికే సిద్ధమైంది. ఇప్పుడు కొత్తగా మెడికల్ కాలేజీలు రావాలంటే మరిన్ని కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం.

  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్


  తాను అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా మారుస్తానని జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. వాస్తవానికి రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన చేసి జనవరి 26 నుంచే వాటిని అమల్లోకి తీసుకురావాలని తొలుత భావించారు. అయితే, ప్రస్తుతం మూడు రాజధానుల అంశం హాట్ హాట్‌గా ఉన్న సమయంలో అది అంత సముచితం కాదని భావించి ప్రస్తుతానికి వాయిదా వేశారు. కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడానికి ముందు తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా ఎలాంటి కసరత్తు చేశారో తెలుసుకుంటున్నారు.

  ప్రస్తుతం ప్రతిపాదనలో ఉన్న జిల్లాలు

  1. అరకు (విశాఖ జిల్లా)

  2. అనకాపల్లి (విశాఖ జిల్లా)

  3. అమలాపురం (తూర్పుగోదావరి)

  4. రాజమండ్రి (తూర్పుగోదావరి)

  5. నరసాపురం (పశ్చిమ గోదావరి)

  6. విజయవాడ (కృష్ణా జిల్లా)

  7. నరసరావు పేట (గుంటూరు జిల్లా)

  8. బాపట్ల (గుంటూరు జిల్లా)

  9. నంద్యాల (కర్నూలు జిల్లా)

  10. హిందూపురం (అనంతపురం జిల్లా)

  11. తిరుపతి (చిత్తూరు జిల్లా)

  12. రాజంపేట (కడప జిల్లా)


  కేంద్రం బడ్జెట్ తర్వాత ఇవి మరింత పెరిగే అవకాశం ఉంది. గతంలో ఎన్టీఆర్ పేరుతో కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తానని జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. వీటితోపాటు జిల్లాల ఏర్పాటు సమయంలో చాలా కొత్త డిమాండ్లు వస్తుంటాయి. వాటిని బట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.
  Published by:Ashok Kumar Bonepalli
  First published: