Home /News /andhra-pradesh /

AFTER CYCLONE NIVAR ANOTHER STORM TO HIT ANDHRA PRADESH SU

Andhra Pradesh Weather: ఏపీని పొంచి ఉన్న తుపాన్ల గండం.. రేపే మరో తుపాన్?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Andhra Pradesh Weather: నివర్ తుపాన్ విధ్వంసం నుంచి కోలుకుని ఏపీపై మరో తుపాన్ ప్రభావం ఉండనుందని భారత వాతావరణ శాఖ(India Meteorological Department) శుక్రవారం హెచ్చరించింది. ఇది మాత్రమే కాకుండా డిసెంబర్ మొదటి వారంలో మరో రెండు తుపాన్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.

ఇంకా చదవండి ...
    ఆంధ్రప్రదేశ్‌కు వరుస తుపాన్ల గండం పొంచి ఉంది. ఇప్పటికే నివర్ తుపాన్‌ దక్షిణ కోస్తాతో పాటు, చిత్తూరు, కడప జిల్లాల్లో విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ మరో పిడుగు లాంటి వార్త చెప్పింది. తాజాగా మరో తుపాన్ ప్రభావం ఏపీపై ఉండనుందని భారత వాతావరణ శాఖ(India Meteorological Department) శుక్రవారం హెచ్చరించింది. ఇది మాత్రమే కాకుండా డిసెంబర్ మొదటి వారంలో మరో రెండు తుపాన్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటికే భూమధ్య రేఖకు సమీపంలో హిందూ మహాసముద్రం దానికి ఆనుకుని దక్షిణ అండమాన్‌ సముద్రంలో శుక్రవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో వచ్చే నంబర్ 29న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఆ తర్వాత ఇది వాయుగుండంగా మారి.. ఆ తర్వాత బలపడి తుపాన్‌గా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ తుపాన్ డిసెంబర్ 2వ తేదీన తమిళనాడు-పుదుచ్చేరి మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ తుపాన్ ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరితో పాటు కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో మరిన్ని వర్షాలు కురుస్తాయని వాతావణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

    అదే కాకుండా.. డిసెంబర్‌ నెలలో మరో రెండు తుపాన్లు వచ్చే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. డిసెంబర్‌2న 'బురేవి తుఫాన్' తీవ్ర ప్రభావం చూపనుందని, ఇది ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రా, రాయలసీమపై దీని ప్రభావం అధికంగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే డిసెంబర్ 5న మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనంతో 'టకేటి తుఫాన్' ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో డిసెంబరు 7 తేదీ దక్షిణ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
    AP Cabinet: నివర్ తుఫాన్ బాధితులకు డబ్బులు.. వారందరికీ ఇవ్వాలన్న సీఎం

    ఇదిలా ఉంటే నివర్ తుపాన్ బలహీనపడినప్పటికీ తీవ్ర నష్టాన్ని చేకూర్చిన సంగతి తెలిసిందే. నివర్ తుపాన్ ఏపీలోని జిల్లాలపై ప్రభావం చూపింది. తుపాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు పలుచోట్ల జనజీవనం స్తంభించింది. ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలపై తుపాన్ ధాటికి అధికంగా ధ్వంసమయ్యాయి. చాలాచోట్ల పంటలు నీటమునిగాయి. ఇంకా పలు గ్రామాలు వరద నీటిలోనే ఉన్నాయి. పలుచోట్ల రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Andhra Pradesh, Cyclone alert, Cyclone Nivar

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు